క్లబ్‌వ్యాన్ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసిన మినీ

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 15:49 [IST]
బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ప్రీమియం కార్ల తయారీ బ్రాండ్ "మినీ" కూపే, క్యాబ్రియోలెట్, ఎస్‌యూవీ వంటి మోడళ్లను తయారు చేసిన తర్వాత తొలిసారిగా ఓ సరికొత్త క్లబ్‌వ్యాన్ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసింది. ఎస్టేట్ కార్, డెలివరీ వ్యాన్ వంటి బాడీస్టైల్ కలిగిన కార్లకు పోటీగా మినీ ఈ క్లబ్‌వ్యాన్‌ను ప్రవేశపెట్టనుంది.

వచ్చే మార్చి నెలలో జరగనున్న జెనీవా మోటార్‌ షోలో మినీ తమ క్లబ్‌వ్యాన్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించనుంది. మినీ బ్రాండ్‌ నుండి అత్యంత పాపులర్ అయిన 'క్లబ్‌మ్యాన్' మోడల్ ఆధారంగా క్లబ్‌వ్యాన్ కాన్సెప్ట్‌ను కంపెనీ రూపొందించింది. ఇందులో రెండు సీట్లు మాత్రమే (డ్రైవర్ + ప్యాసింజర్) ఉంటాయి. దీనికి మొత్తం ఐదు డోర్లు ఉంటాయి.

వెనుకవైపు క్యాబిన్ డోర్లు గవ్వ (షెల్) మాదిరిగా సగం పైవైపుకు, సగం క్రింది వైపుకు ఓపెన్ అవుతాయి. ఈ క్లబ్‌వ్యాన్ కాన్సెప్ట్ ఒకపట్టి మారియోస్ మినీ ట్రావెలర్‌ను గుర్తుకు తెస్తుందని, స్టైలిష్ యుటిలిటీ వెహికల్ కోరుకునే వారి కోసం ఈ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేశామని మినీ పేర్కొంది.
English summary
BMW-owned premium carmaker MINI has developed the Clubvan concept, which is scheduled to showcase at the upcoming Geneva Motor Show in March 2012.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .