ఛండీఘడ్‌లోనూ షోరూమ్‌ను ఏర్పాటు చేసిన రోల్స్ రాయిస్

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012, 10:00 [IST]
Rolls-Royce
భారతదేశంలో సంపన్న వర్గాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారి విలాసాలను తీర్చేందుకు గానూ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ దేశీయ విపణిలో తమ మార్కెట్ పరిమితిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగాంగానే, దేశంలో తమ నాలుగో డీలర్‌షిప్‌ను చండీగఢ్‌లో ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ షోరూమ్‌లో కంపెనీ ఇటీవల భారత మార్కెట్లోకి విడుదల చేసిన రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ ఎక్స్‌టెండెడ్‌ వీల్‌బేస్‌ మోడల్‌ను కూడా అందుబాటులోకి తీసుకుచ్చింది.

ఢిల్లీకు చెందిన 'సెలక్ట్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్'ను ఛండీఘడ్‌లో తమ అధీకృత డీలర్‌గా రోల్స్ రాయిస్ నియమించుకుంది. ఈ సంస్థ ఢిల్లీ కూడా రోల్స్ రాయిస్‌కు అధీృత డీలర్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రోల్స్ రాయిస్‌కు ముంబయి, ఢిల్లీ, హైదరాబద్‌లలో డీలర్‌షిప్‌లు ఉండగా, ఛండీఘడ్‌లో ఏర్పాటు చేసినది నాలుగవది కావడం విశేషం. గడచిన డిసెంబర్ రోల్స్ రాయిస్ హైదరాబా‌ద్‌లో తమ మూడో డీలర్‌షిప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో రోల్స్ రాయిస్ అధీకృత డీలర్‌గా కున్‌ మోటోరెన్‌ వ్యవహరిస్తోంది.

హైదరాబాద్‌లో రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ ఎక్స్‌టెండెడ్‌ వీల్‌బేస్‌ మోడల్‌ ధర (ఎక్స్-షోరూమ్) రూ.3.05 కోట్లుగా ఉంది. ఇదివరకటి రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్‌తో పోలిస్తే ఇది మరింత విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని డ్యాష్‌బోర్డ్ నిర్మాంలో కేరళలో లభించే అరుదైన మలబార్ చెక్కను ఉపయోగించారు. వైడ్ సన్‌రూఫ్, ఊల్ కార్పెట్, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వంటి ఫీచర్లతో పాటుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారును తీర్చిదిద్దారు. ఇది 12 ఆకర్షనీమయైన రంగుల్లో లభ్యమవుతుంది.

భారత్‌లో విక్రయించే రోల్స్ రాయిస్ కార్లను కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది (సిబియూ రూట్లో). ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు డీలర్లషిప్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. చండీగఢ్‌లో ధనవంతులైన రైతులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతంలో తమ షోరూమ్‌ను ఏర్పాటు చేశామని కంపెనీ తెలిపింది.
English summary
British luxury carmaker Rolls-Royce is on a roll. It has opened its fourth Indian showroom in Chandigarh. The new showroom will be operated by Select Cars which also owns the franchise in Delhi, Mumbai and Hyderabad. The new Rolls-Royce showroom was opened by unveiling the Ghost Extended Wheel Base.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .