లాంబోర్గినీ అవంటేడర్‌ను కొనుగోలు చేసిన క్రిస్టియానో రొనాల్డో

శనివారం, ఫిబ్రవరి 18, 2012, 16:41 [IST]
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యంత వేగంతో పరుగులు పెట్టే కారును కొనుగోలు చేశాడు. ఆ కారంటే మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. అదే ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ అందిస్తున్న "అవంటేడర్" సూపర్‌కార్. క్రిస్టియానో రొనాల్డో ఇటీవల తన 27వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతను సుమారు రూ.4 కోట్ల విలువైన లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్‌కారును కొనుగోలు చేశాడు.

నలుపు రంగులో మ్యాట్ ఫినిష్‌తో కూడిన అవెంటేడర్‌ను లాంబోర్గినీ కొత్తగా డిజైన్ చేసింది. ఇందులో శక్తివంతమైన 6.4 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 700 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అంటే సాంప్రదాయ కార్లతో పోల్చుకుంటే ఈ శక్తి ఏడు రెట్లు అధికం అన్నమాట. ఈ కారు కేవలం నాలుగు సెకండ్లలో మెరుపు వేగంతో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 324 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.
English summary
How would you celebrate your birthday if you are a petrol head and had Rs.4 crores with you? By buying a brand new Lamborghini Aventador off course. And that is how Portugal and Real Madrid footballer Cristiano Ronaldo did when he celebrated his 27th birthday on 5th February.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .