చెత్త వస్తువులతో బీటెల్ కారును డిజైన్ చేసిన ఫోక్స్‌వ్యాగన్

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 14:40 [IST]
దశాబ్ధాల చరిత్ర కలిగిన ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఈ పాపులర్ కారుకు కోట్లల్లో అభిమానులు. ఒకప్పుడు బీటెల్ కారు పేరు ఫోక్స్‌వ్యాగన్ పీపుల్స్ కారు. ఇప్పుడే అదే ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ పేరుగా మారింది. ఇది చూడటానికి డిజైన్‌లో చిన్నదిగా ఉన్నప్పటికీ విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

సరే ఇదంతా అటుంచితే.. ఈ ఫోటోలు కనిపిస్తున్న బీటెల్ కారును గమనించారా.. ఇది 'చెత్త' బీటెల్. అంటే పనికి రాని బీటెల్ కారని కాదండోయ్..!! పనికిరాకుండా విసిరేసే చెత్త వస్తువులు (స్క్రాప్ మెటీరియల్స్)తో తయారు చేసిన బీటెల్ కారు ఆర్ట్. దాదాపు 2805 లకు పైగా చెత్త వస్తువులతో ఈ ఐకానిక్ కారును రూపొందించారు.

ఇందులో 800 స్పార్క్ ప్లగ్స్, 800 కోల్డ్ డ్రింక్ క్రౌన్స్, 200 బాటిల్ క్యాప్స్, 60 మథర్ బోర్డ్స్, కంప్యూటర్ కీ బోర్డ్స్, హార్డ్ డిస్క్స్, సిడిలు, ఆడియో క్యాసెట్లు, స్పీకర్లు, బార్బెక్యూ స్టిక్స్, బీర్ క్యాన్స్, టెలికామ్ వైర్స్, ఫ్లాట్ స్క్రీన్ మోనిటర్, పెన్స్, టైప్ వ్రైటర్లు వంటి అనేక పనికిరాని స్క్రాప్ మెటీరియల్స్‌ను దీని డిజైన్‌లో ఉపయోగించారు.

ఈనెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి 12వ తేదీ వరకూ జరిగిన కాలా ఘోడా ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ కారును ఫోక్స్‌వ్యాగన్ థింక్ బ్లూ క్లీన్-అప్ క్యాంపైన్ ద్వారా సేకరించిన వ్యర్థాలను ఉపయోగించి కంపెనీ డిజైన్ చేసింది. దీని ద్వారా పర్యావరణం గురించి ఆలోచింపజేయాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ చెత్త బీటెల్‌ను రూపొందించింది.

English summary
Volkswagen has created its Iconic car Beetle using the scrap materials which they managed to collect from various Think Blue clean-up drives. It is said over 2805 pieces of scrap material has been utilized to recreate this amazing real size Beetle art piece.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .