విలాసవంతమైన కార్లను తయారు చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న స్వీడన్ కంపెనీ వోల్వో, భారత మార్కెట్లో ఓ చిన్న కారును ప్రవేశపెట్టి ఆ సెగ్మెంట్లోనూ మార్కెట్ వాటాను పెంచుకోవాలని భావిస్తోంది. వచ్చే ఏడాది జనవరి-మార్చి నెల నాటికి ఓ చిన్న కారు (వోల్వో వీ40)ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు వోల్వో ఇండియా సన్నాహాలు చేస్తుంది.
వోల్వో వీ40 చిన్న కారే అయినప్పటికీ, దీని ధర మాత్రం చిన్నదిగా ఉండే అవకాశమే లేదు. వచ్చే నెలలో జరగనున్న జెనీవా మోటార్ షోలో వోల్వో వీ40 2012 వెర్షన్ కారును కంపెనీ ఆవిష్కరించనుంది. ఈ మోడల్ ఇండియాకు రావడానికి మరో సంవత్సరం సమయం పట్టనుంది. భారత మార్కెట్లో వోల్వో వీ40 కారు ధర రూ.20-22 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.
వోల్వో ఎస్40 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న వోల్వో వీ40 కారు మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇటీవల వోల్వో భారత్‌లో అందిస్తున్న ఎస్60, ఎస్80, ఎక్స్‌సీ60 మోడళ్లలో చౌకరకం వేరియంట్లను విడుదల చేసిన సందర్భంగా వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎర్న్‌బర్గ్ మాట్లాడుతూ..
ఈ సంవత్సరం రెండు గ్లోబల్ మోడళ్లను ప్రవేశపెట్టనున్నామని, ఇందులో ఒక చిన్న వాహనం ఉంటుందని, దానిని ఇండియా మార్కెట్‌కు తీసుకు వస్తామని అన్నారు. ఈ చిన్న కారు ద్వారా పెద్ద మార్కెట్ వాటాను చేజిక్కుంచుకోవాలని వోల్వో భావిస్తోంది.