ప్రపంచంలోనే అతిపెద్ద బిఎమ్‌డబ్ల్యూ కార్ షోరూమ్!!

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 12:19 [IST]
విలాసవంతమైన కార్లను తయారు చేసే ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ మేకర్ 'బిఎమ్‌డబ్ల్యూ' ప్రపంచంలోనే అతిపెద్ద షోరూమ్‌ను ఏర్పాటు చేసి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దాదాపు 81 మిలియన్ డాలర్లను వెచ్చించి, అబుధాబీలో 35,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో ఓ షోరూమ్‌ను బిఎమ్‌డబ్ల్యూ ఏర్పాటు చేసింది.

ఈ షోరూమ్‌లో ఒకేసారి 120 కార్లను ప్రదర్శన, 80 కార్లను సర్వీసింగ్, 170 కార్లను పార్కింగ్ చేయవచ్చు. బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్‌లో అమ్ముడవుతున్న బిఎమ్‌డబ్ల్యూ, మినీ, రోల్స్ రాయిస్ వంటి అన్ని బ్రాండ్‌లు ఈ షోరూమ్‌లో దర్శనమిస్తాయి. ఈ షోరూమ్‌ను నిర్మించడానికి అబుధాబీ మోటార్స్‌ (బిఎమ్‌డబ్ల్యూ అధికారిక దిగుమతిదారు)కు 3 సంవత్సరాల సమయం పట్టింది.

ఈ షోరూమ్‌లో 70 కార్లు, 10 మోటార్‌సైకిళ్లు పర్మినెంట్‌గా డిస్‌ప్లేలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో, ఓ పెద్ద టెలివిజన్ స్క్రీన్, కేఫ్, చిన్న పిల్లల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ సదుపాయాలు, ఓ మసీదు, ఫార్ములా వన్ అనుకరణయంత్రం (ఎఫ్1 సిములేటర్) వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. మరి ధనికులు అత్యధికంగా నివసించే ఇలాంటి దేశాల్లో ఈ మాత్రం సౌకర్యాలు లేకపోతే ఎలా..!
English summary
German luxury car maker BMW has inaugurated its world’s largest showroom in Abu Dhabi. Spread over a massive 35,000 square meter area, this showroom can house 120 cars, service 80 cars and park 170 cars, all at the same time.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .