ఆశ్చర్యం..! కార్ల సంస్థలు, వాటికి వచ్చిన పేర్ల తీరు..

By N Kumar

నేమింగ్ అనేది చాలా సింపుల్ విషయం కాదు, ఒక్క సారి పేరు పెట్టామంటే అది చాలా ఏళ్లా పాటు కొనసాగుతుంది. అచ్చం ఆటోమొబైల్ సంస్థలతో కూడా ఇదే సమస్య. నిస్సాన్, టయోటా వంటి అత్యంత పేరుగాంచిన సంస్థలు ఏ పేర్లతో ప్రారంభమయ్యాయి, వాటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి. వంటి అనేక ఆసక్తికరమైన విషయాల గురించి కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

1. నిస్సాన్

1. నిస్సాన్

నిస్సాన్ సంస్థ డిఎటి మోటార్‌కార్ (DAT Motorcar)అనే పేరుతో పురుడు పోసుకుంది. ఈ సంస్థను స్థాపించిన ముగ్గురు వ్యవస్థాపకుల నుండి డిఎటి ఏర్పడింది. వీరి మొదటి కారును Datson అనే పేరుతో విడుదల చేసారు. తరువాత ఇది Datsun గా రూపాంతరం చెందింది. ఆ తరువాత కాలంలో నిప్పాన్ శాంగోయ్ అనే సంస్థను స్థాపించిన యోషిసుకే అయికవా అనే జపాన్‌కు చెందిన వ్యక్తి డిఎటి మోటార్‌కార్‌ను సంస్థను దక్కించుకుని నిస్సాన్ శాంగోయ్ (Nippon Sangoy) నుండి నిస్సాన్‌గా ఆవిర్బవించింది.

2. టయోటా

2. టయోటా

ప్రారంభంలో టయోటా కార్లను తయారు చేసే సంస్థ కాదు, ఆటోమేటిక్‌గా వస్త్రాలను నేసే యంత్రాలు చేసే సంస్థగా టయోడా (Toyota) అనే పేరుతో 1926 లో సకిచి టయోడా అనే వ్యక్తి స్థాపించాడు. ఆ తరువాత కాలంలో ఇతని కుమారుడు కిచిరో కార్లను తయారు చేసే సంస్థను ప్రారంభించాడు. ఆ తరువాత టయోడా కాస్స టయోటాగా రూపాంతరంచెందింది. జపనీస్ భాషలో టయడా ను వ్రాయడానికి 9 అక్షరాలు అవసరమయ్యేవి, అదే టయోటాను వ్రాయడానికి 8 అక్షరాలు అవసరమయ్యేవి. జపాన్‌లో 8 ఎంతో లక్కీ నెంబర్‍‌‌.

3. క్లిస్లర్

3. క్లిస్లర్

దీని గురించి చిన్న కథ ఉంది. వాల్టర్ క్లిస్లర్ అనే వ్యక్తి రైలు రోడ్ మెకానిక్‍‌. కాని దాని కన్నా మెషినిష్ట్‌గా మంచి అనుభవం గడించాడు. Buick అనే సంస్థకు 1911 లో ప్రొడక్షన్ ఛీఫ్‌గా పనిచేశాడు. తరువాత ఈ సంస్థకు హెడ్‌ అయ్యాడు. ఈ సంస్థ నుండి వైదొలగి విల్లీస్-ఓవర్‌ల్యాండ్ మోటార్ కంపెనీని స్థాపించాడు , అయితే అది అపజయాన్ని ఇచ్చింది.

తర్వాత కాలంలో మ్యాక్స్‌వెల్ మోటార్ సంస్థలో కంట్రోలింగ్ ఇంట్రెస్ట్‌గా నియమితులయ్యారు. కొద్ది మొత్తం సంపాదించి 1924 క్లిస్లర్ అనే పేరుతో మొదటి కారును రూపొందించాడు. తరువాత ఏడాదిలో మ్యాక్స్‌వెల్ సంస్థ కాస్త క్లిస్లర్‌గా రూపాంతరం చెందింది.

4. హోండా

4. హోండా

హోండా కథ చాలా ముక్కు సూటిగా ఉంటుంది. సోయిచిరో హోండా అనే వృత్తి రీత్యా మెకానిక్ చిన్న మోటార్ సైకిళ్లను తయారు చేయడానికి హోండా మోటార్ కంపెనీని 1960 లో ప్రారంభించాడు. ఆ తరువాత అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలలో ఒకటిగా నిలిచింది. 1963 లో కంపెనీ హోండా టి360 అనే మొదటి ఫోర్ వీలర్ పికప్‌ ట్రక్‌ను విడుదల చేసింది.

5. బ్యూయిక్ (Buick)

5. బ్యూయిక్ (Buick)

డేవిడ్ డన్బార్ బ్యూయిక్ అనే వ్యక్తి ప్రారంభంలో క్యాస్ట్ ఐరన్ కోటింగ్ గల బాత్ టబ్‌లను తయారు చేసే వాడు. తరువాత ఇతను ఇంజన్‌లను తయారు చేయడం ప్రారంభించి విఫలం చెందాడు. మళ్లీ 1902 సంవత్సరంలో బ్యూయిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని ప్రారంభించాడు. ఉత్తమ పరిజ్ఞానంతో తయారయ్యే ఇతని కార్ల అప్పట్లో ఉన్న మిగతా వాటితో పోల్చుకుంటే ఎంతో నాణ్యంగా ఉండేవి. కాని సరైన సమయానికి ఉత్పత్తి చేసి డెలివరీ ఇవ్వలేక మళ్లీ విఫలం చెందాడు.

తరువాత జనరల్ మోటార్స్‌కు తన సంస్థను 1908 లో 100,000 డాలర్లకు అమ్మేసి ఒక ఆయిల్ సంస్థలో పెట్టుబడిగా పెట్టి నష్టపోయాడు. తరువాత ఆటోమొబైల్ ప్రపంచానికి దూరంగా వెళ్లి డెట్రాయిట్ స్కూల్ ఆఫ్ ట్రేడ్స్‌లో ఉద్యోగంలో చేరి ఫైనల్‌గా 1920 లో చనిపోయాడు. ఎన్నో సార్లు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయాడు.

6. షెవర్లే

6. షెవర్లే

ఖర్మ అంటే ఏమిటో దీనిని చదివితే తెలుస్తుంది, విల్లియమ్ సి దురంత్. 1908 లో బ్యూయిక్ సంస్థను కొనుగోలు చేసిన జనరల్ మోటార్స్ వ్యవస్థాపకుడు ఇతను. బ్యూయిక్‌కు జరిగిన సంఘటనే ఇతనికీ జరిగింది, ఓటమిని రుచి చూసిన దురంత్ స్విస్ రేసర్ కార్ డ్రైవర్ లూయిస్ షెవర్లేతో చేతులు కలిపి షెవర్లే పేరుతో 1911 నుండి కార్లను తయారు చేయడం ప్రారంభించాడు.

అనతి కాలంలోనే జనరల్ మోటార్స్ నిర్వహణకు కావాల్సిన డబ్బును సంపాదించాడు. 1917లో జనరల్ మోటార్స్ షెవర్లే సంస్థను పూర్తిగా ఆధీనపరుచుకుంది. అయితే దురంత్‌లా షెవర్లే విజయాన్ని అందుకోలేక పోయాడు. ఇక చేసేది లేక 1914 లో షెవర్లే జనరల్‌ మోటార్స్‌కు అమ్మేసి అదే సంస్థలో ఉద్యోగంలోకి చేరాడు.

అప్పటి నుండి జనరల్ మోటార్స్ షెవర్లే‌ను అలాగే కొనసాగిస్తూ వస్తోంది.

7. డోడ్జ్

7. డోడ్జ్

ఇది ఇద్దరు అన్నదమ్ముల విజయగాథ అని చెప్పవచ్చు. జాన్ మరియు హొరస్ డోడ్జ్ ఇద్దరు అన్నదమ్ములు. 1890 లో ఈ ఇద్దరు మెకానిక్‌లు బైసైకిల్ కంపెనీని ప్రారంభించారు. ఈ సంస్థను అమ్మేసి 1913లో ఓల్డ్స్ మోటార్ కం, మరియు ఫోర్డ్ సంస్థకు గేర్‌బాక్స్‌లను సప్లే చేశారు. తరువాత ఈ బిజినెస్‌ను మానేసి కార్లను తయారు చేయాలనే తమ చిరకాల కోరికను నిజం చేసుకున్నారు. అనతి కాలంలోనే అమెరికాలో రెండవ అతి పెద్ద కార్ల సంస్థగా అవతరించింది.

8. మెర్సిడెస్ బెంజ్

8. మెర్సిడెస్ బెంజ్

ఎమిల్ జెల్లినెక్ అనే ఆస్ట్రియన్‌కు చెందిన వ్యాపారవేత్త యూరప్‌ రేసులో ఉపయోగించడానికి డైమ్లర్ కార్లను కొనుగోలు చేసే వాడు. తన పన్నెండేళ్ల కుమార్తె కోసం డైమ్లర్ నుండి ఏకంగా 36 కార్లను కొనుగోలు చేశాడు. ఆ కార్లకు తన కుమార్తె పేరు మెర్సిడెస్‌‌గా నామకరణం చేశాడు. అప్పటి నుండి డైమ్లర్ మెర్సిడెస్‌ గా కొనసాగుతూ వచ్చింది.

9. వోల్వో

9. వోల్వో

ఇండియాలో వోల్వో బస్సులకు మరియు కార్లకు మంచి పేరు ఉంది. 'I Roll అనే లాటిన్ పదానికి అర్థం వోల్వో. ఇది ప్రారంభంలో బాల్ బేరింగ్‌లను తయారు చేసే ఎస్‌కెఎఫ్ సంస్థగా ఆవిర్భవించింది. 1915 లో వోల్వోగా రూపాంతరం చెందింది. వోల్వో ప్రక్కనే ఎనిథింగ్ దట్ రోల్స్ (బేరింగ్స్, బై సైకిల్స్, ఆటోమొబైల్స్) అనే విధంగా స్వీడెన్‌కు చెందిన వోల్వో 1926 లో కార్ల తయారీని ప్రారంభించింది.

10. క్యాడిలాక్

10. క్యాడిలాక్

ప్రపంచ వ్యాప్తంగా పురాతణ కార్ల తయారీ సంస్థలలో క్యాడిలాక్ ఒకటి. ఆంటోని డి ల మోతె క్యాడిలాక్ (Antoine de la Mothe Cadillac) అనే పేరు నుండి ఆవిర్భవించింది. క్యాడిలాక్‌ను 1902 లో హెన్రీ ఫోర్డ్ కొనుగోలు చేశారు. ఆ తరువాత 1909 లో జనరల్ మోటార్స్ దీనిని కొనుగోలు చేశాడు. అమెరికాలో అనతి కాలంలోనే లగ్జరీ కార్ల తయారీ సంస్థగా అవతరించింది.

టాప్-10 కార్ల సంస్థలు, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి ?

  • ఎయిర్‌బ్యాగ్స్: ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు, చరిత్ర

Most Read Articles

English summary
Car Companies And How They Got Their Names
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X