బహుశా ఈ 10 కార్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియకపోవచ్చేమో!

అందరికీ అన్ని విషయాలు తెలియాలన్న రూల్ ఏమీ లేదు. ఒక్కోసారి అన్ని విషయాలు తెలిసి ఉన్నప్పటికీ కాలగమనంలో మనం వాటిని మర్చిపోతుంటాం. విజ్ఞానం అనేది అనంతమైనది తెలుసుకునేద్దీ దీని లోతు మరింత పెరుగుతుంటుంది. చరిత్రలోని కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకుంటుంటే, వాటి పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంటుంది.

ఇది కూడా చదవండి: ఆటోమొబైల్స్ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

ఆటోమొబైల్స్ అనేవి ప్రస్తుత మానవ జీవితంలో ఓ భాగమైపోయాయి. ఆటోమొబైల్స్ ఉపయోగించే వారందరికీ, బహుశా వాటికి సంబంధించిన అనేక అంశాలు తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో మనం చెప్పుకోబోయే కొన్ని కార్ ఫ్యాక్ట్స్ చదివితే, మీరు ఔరా అని ఆశ్చర్యపోవటం ఖాయం. మరి ఆలస్యం చేయకుండా ఆ టాప్ 10 కార్ క్విర్కీ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం రండి..!

ఇది కూడా చదవండి: ఆటోమొబైల్స్ గురించి కొన్ని సరదా నిజాలు

10 ఇంట్రెస్టింగ్ కార్ ఫ్యాక్ట్స్

టాప్ 10 కార్ క్విర్కీ ఫ్యాక్ట్స్‌ను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ఒక గుర్రం ఒక హార్స్‌పవర్‌తో సమానం కాదు

ఒక గుర్రం ఒక హార్స్‌పవర్‌తో సమానం కాదు

సాధారణంగా ఇంజన్ శక్తిని హార్స్‌పవర్‌తో సూచిస్తుంటాం. ఉదాహరణ, ఏదైనా ఒక కారు 100 హార్స్‌పవర్ (హెచ్‌పి)ల శక్తిని కలిగి ఉందంటే, అది 100 గుర్రాల శక్తితో సమానం అని కాదు. టెక్నికల్‌గా చెప్పాలంటే, ఒక హార్స్‌పవర్ 745 వాట్ల శక్తి లేదా నిమిషానికి 33,000 ఫుట్ పౌండ్ల టార్క్‌తో సమానం అనొచ్చు. ఈ లెక్కల ప్రకారం, ఒక గుర్రం సగటున 0.7 హార్స్‌పవర్‌ను మాత్రమే కలిగి ఉంటుంది.

మీ వాహన ఫ్యూయెల్ ట్యాంక్ ఏవైపు ఉంది?

మీ వాహన ఫ్యూయెల్ ట్యాంక్ ఏవైపు ఉంది?

తరచూ వాహనాలను అద్దెకు తీసుకునే వారు లేదా కొత్తగా కారు కొన్న వారికి తమ వాహనంలో ఫ్యూయెల్ ట్యాంక్ ఏవైపు ఉందో/ఇంధనాన్ని ఏవైపు ఫిల్ చేసుకోవాలో తెలియనప్పుడు సింపుల్ 'ఫ్యూయెల్ గేజ్' (ఇంధన స్థాయిని చూపించే మీటర్)ను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.

అదెలా అంటే.. ఫ్యూయెల్ గేజ్ మీటర్‌పై చిన్నటి త్రికోణాకారంలో ఉండే ఓ మార్క్ ఉంటుంది. ఈ మార్క్ ఎటువైపు ఉంటే మీ కారులో ఫ్యూయెల్ ట్యాంక్ అటువైపు ఉంటుంది. ఉదాహరణకు ఈ ట్రైయాంగిల్ కుడివైపుకు ఉంటే మీ కారులో ఫ్యూయెల్ ట్యాంక్ కుడివైపు ఉంటుంది, అదే ఎడమవైపుకు ఉంటే, ఫ్యూయెల్ ట్యాంక్ ఎడమవైపుకు ఉంటుంది.
డ్యాష్‌బోర్డ్

డ్యాష్‌బోర్డ్

డ్యాష్‌బోర్డ్‌ను కార్లలో కన్నా ముందుగా గర్రపు బండ్లలో ఉపయోగించావారు. గుర్రపు బండి చలనంలో ఉన్నప్పుడు రోడ్డుపై నుంచి బురద/నీళ్లు బండి లోపకి చిమ్మకుండా ఉండేలా, ఎత్తుగా ఎర్పాటు చేసిన ఓ చెక్క నిర్మాణాన్నే డ్యాష్‌బోర్డ్ అనేవారు.

జరిమానా

జరిమానా

అతిపెద్ద స్పీడింగ్ ఫైన్ (మితిమీరిన వేగంతో నడిపినందుకు గాను విధించే జరిమానా) స్వీడన్‌కు చెందిన ఓ వ్యక్తికి విధించారు. అతను గరిష్టంగా 180 మైళ్ల (సుమారు 290 కి.మీ.) వేగంతో వాహనం నడిపినందుకు గాను అతని ఆదాయానికి సరిపోయే జరిమానాను విధించారట. అతనికి విధించిన జరిమానా 10 లక్షల డాలర్లు.

రిమోట్ కార్ కీ

రిమోట్ కార్ కీ

రిమోట్ కార్ కీని మన తల వద్ద ఉంచుకొని ఆపరేట్ చేస్తే, దాని రేంజ్ రెట్టింపు అవుతుందట. ఇందుకు కారణం మనిషి పుర్రె ఓ యాంప్లిఫయర్‌లా పనిచేయడమేనట.

ఆటోమొబైల్ రీసైకిల్

ఆటోమొబైల్ రీసైకిల్

ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అత్యధికంగా రీసైకిల్ కాబడుతున్న ఉత్పత్తి ఆటోమొబైల్. వాస్తవానికి, ప్రతి ఏటా 95 శాతం కాలం చెల్లిపోయిన వాహనాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఆటోమొబైల్స్‌లోని ప్రతిభాగాన్ని (ఫ్లోర్ మ్యాట్స్ మొదలుకొని, స్టీల్ బాడీ వరకు) రీసైకిల్ చేసి, ఇతర ఆటోమొబైల్స్ లేదా వేరే ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు.

బెంజ్ కోసం అప్పు అడుక్కున్న హిట్లర్

బెంజ్ కోసం అప్పు అడుక్కున్న హిట్లర్

అడాల్ఫ్ హిట్లర్ 1924వ సంవత్సరంలో జైలులో ఉన్నప్పుడు కార్ లోన్ కోసం ఓ మెర్సిడెస్ బెంజ్ డీలరుకు లేఖ రాశాడు. అప్పట్లో 11/40 మోడల్‌పై మనసు పారేసుకున్న హిట్లర్, మునిచ్‌లోని మెర్సిడెస్ బెంజ్ డీలర్ అయిన జాకబ్ ఫెర్లిన్‌ను కార్ లోన్ లేదా అడ్వాన్స్ కోరుతూ లేఖ రాశాడు. ఆ తర్వాతి కాలంలో ఆయన అనేక బెంజ్ కార్లకు ఓనర్ అయ్యాడు లెండి.

మొట్టమొదటి ఆటోమొబైల్ యాక్సిడెంట్ - 1771

మొట్టమొదటి ఆటోమొబైల్ యాక్సిడెంట్ - 1771

మొట్టమొదటి ఆటోమొబైల్ యాక్సిడెంట్ 1771వ సంవత్సరంలో జరిగింది. నికోలస్ జోసెఫ్ క్యుగ్‌నాట్స్ ఆవిరితో నడిచే 'స్టీమ్ డ్రే' అనే వాహనం అదుపు తప్పి ఓ గోడకు గుద్దుకుంది. ఈ ప్రమాదంలో డ్యామేజ్ అయిన వాహనాన్ని ఇప్పటికీ, ప్యారిస్‌లో ఉన్న కాన్సర్వేటివ్ నేషనల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

మొట్టమొదటి సుధీర్ఘ ప్రయాణం

మొట్టమొదటి సుధీర్ఘ ప్రయాణం

ఆగస్ట్ 1888లో కార్ల్ బెంజ్ భార్య బెర్తా బెంజ్ కారులో సుధీర్ఘ ప్రయాణం చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. బెర్తా బెంజ్ తన భర్తకు తెలియకుండా తమ బెంజ్ పేటెంట్-మోటార్‌వ్యాగన్‌లో తన ఇద్దరు కుమారులతో కలిసి దక్షిణాధి జర్మనీలోని మ్యాన్‌హీమ్ ప్రాంతం నుంచి ఫోర్జీమ్‌కు బయలుదేరింది. అప్పట్లో ఆటోమొబైల్ ప్రయాణాలు చాలా తక్కువ దూరాలు చేసేవారు. అయితే, తాము తయారు చేసిన వాహనాలు ఉపయోగకరంగా ఉండి, సాధారణ ప్రజానీకం సైతం ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటాయని నిరూపించేందుకు ఆయన ఈ ప్రయత్నం చేశారు.

అంతేకాదు, ఆమె ప్రయాణించిన 106 కిలోమీటర్ల దూరం వలన కార్ల అభివృద్ధిలో కొన్ని కీలక అంశాలకు తెరలేపింది. అప్పట్లో ఆమె ఈ దూరాన్ని రెండు రోజుల్లో కవర్ చేశారు. ఆ సమయంలో బ్రేకులు రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆమె బ్రేక్ లైనింగ్‌ను కనుగొన్నారు. హ్యాట్‌పిన్‌ను ఉపయోగించి బ్లాక్ అయిన ఫ్యూయెల్ పైప్‌ను క్లీన్ చేసి, మోకాలి పట్టీతో దానిని ఇన్సులేట్ చశారు.

ఒకే కారును 82 ఏళ్ల పాటు నడపటం

ఒకే కారును 82 ఏళ్ల పాటు నడపటం

ఒక కారును 82 ఏళ్ల పాటు నడపటమంటే అషామాషీ విషయం కాదు. అల్లెన్ స్విఫ్ట్ అనే వ్యక్తి తన రోల్స్ రాయిస్ పిక్కాడిల్లీ-పి1 రోడ్‌స్టర్ కారును 82 ఏళ్ల పాటు ఉపయోగించాడు. అతను 1928లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందకు గాను అల్లెస్ తండ్రి ఈ కారును కానుకగా ఇచ్చాడట. 102 ఏళ్ల పాటు జీవించిన అల్లెన్ తాను మరణించే వరకు ఈ కారునే ఉపయోగించాడు. అతని మరణానంతరం ఈ కారును స్ప్రింగ్‌ఫీల్డ్ మ్యూజియంకి దానం చేశారు.

10 ఇంట్రెస్టింగ్ కార్ ఫ్యాక్ట్స్

ఈ ఆసక్తికరమైన కార్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Just like human beings, automobiles have their own little interesting tales. We have put together a list of 10 unique car facts for you to browse through and smile at.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X