క్రూయిజ్ షిప్స్ గురించి మానవాళికి తెలియని భయంకరమైన రహస్యాలు

By Anil

లగ్జరీ నౌకలను నీటి తేలియాడే స్వర్గం అని చెప్పవచ్చు. మానవుని జీవితకాలంలో విహార యాత్రకలకు వెళ్లాలనే కలలు కంటూ ఉంటారు. ఇక అందులో నౌకల్లో విహార యాత్రలకు వెళ్లడం అంటే ఆ ఆనందమే వేరు. ఫైవ్ స్టార్ హోటళ్లు, వసతులు, వినోద కార్యక్రమాలు, సాహస ఆటలు వంటి అనేక వసతులు స్వర్గదామాన్ని తలపిస్తాయి.

అయితే ఇలాంటి ఓడల్లో ప్రయాణం మధ్య తరగతి ప్రజలకు కలగానే మిగిలిపోతుంది. లగ్జరీ క్రూయిజ్ నౌకల్లో అద్బుతమైన వసతులతో గొప్ప అనుభవాలతో పాటు కొన్ని అభ్యతరకరమైన అతి చెడ్డ అనుభవాలు కూడా ఎదురవుతాయి. అందులో చాలా వరకు రహస్యంగా ఉంచుతారు. మీ కోసం కొన్ని....

జైళ్లు

జైళ్లు

నౌకల్లో జైళ్లు ఏంటి అనుకుంటున్నారా ? అతి పెద్ద లగ్జరీ నౌకల్లో వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతున్నా ఏదైనా ప్రమాదానికి కారణం అయినా లేదా నేరస్థులు ఉన్నా.. వారిని అదుపులోకి తీసుకుని నౌకలోని జైలులో ఉంచుతారు. తరువాత సంభందిత అధికారులకు వారిని అప్పగిస్తారు.

నౌకల్లో శవపేటికలు

నౌకల్లో శవపేటికలు

క్రూయిజ్ షిప్‌లలో కొన్ని వందల మంది ప్రయాణిస్తుంటారు. అలాంటి సందర్బంలో ఎవరైనా ఏదయినా కారణం చేత మరణిస్తే వారి దేహాలను భద్రత పరచడానికి నౌకల్లో శవపేటికలను తీసుకెళతారు, నౌక ప్రయాణం పూర్తయిన తరువాత సంభందీకులకు శవాన్ని అప్పగిస్తారు.

బంకర్ ఫ్యూయల్

బంకర్ ఫ్యూయల్

కొన్ని వేల మందిని రవాణా చేసే నౌకలు నీటి మీద నడవాలంటే భారీ స్థాయిలో ఇంధన అవసరం ఉంటుంది. అందుకోసం నౌకల్లో ఇంధన ట్యాంకర్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇందులో శుద్ది చేయని ఇంధనా (బంకర్ ఇంధనం)న్ని నింపుతారు. దీని ద్వారా వెలువడే పొగ ఎంతో హానికరమైనది. అందుకోసం ఈ పొగ నుండి వెలువడే మాలిన్యాలను తగ్గించడానికి ప్రత్యేక పరికరాలను వినియోగించినప్పటికీ కాలుష్య సమస్య అలాగే ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా మూడవ వంతు కార్మికులు

ప్రపంచ వ్యాప్తంగా మూడవ వంతు కార్మికులు

సుమారుగా 25 శాతం మంది ఉద్యోగులు నౌకా రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇందులో ప్రయాణికులతో మాట్లాడకుండా నౌకల్లో విభిన్నరకాల విధులు నిర్వర్తించే కార్మికుల సంఖ్య చాలా ఎక్కువ. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నౌకల్లో పని చేసే వారి నెల వారి సగటు జీతం కేవలం 400 డాలర్లుగానే ఉంది.

జబ్బులు

జబ్బులు

నౌకల్లో ఎక్కువ రోజులు గడపుతూ ప్రయాణిచడం సరదాగా ఉంటుంది. అనేది చాలా మంది భావన. అయితే ఇందులో సరదాతో పాటు అనారోగ్యం కూడా ఎదురవుతుంటుంది. మీరు విన్నది నిజమే వివిధ ప్రదేశాలను చుట్టేయడం ద్వారా వాతావరణంలో జరిగే మార్పులు మరియు నౌకల్లోని ఆహార పదార్థాలు ప్రయాణికులను తరచూ జబ్బుల పాలు చేస్తుంటాయి.

ఊహించని అదనపు ఛార్జీలు

ఊహించని అదనపు ఛార్జీలు

క్రూయిజ్ నౌకల ప్రయాణాన్నికి కస్టమర్లను ఆకర్షించే సమయంలో అన్ని పన్నులతో సహా అని ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తారు. అయితే ప్రయాణ సమయంలో అనివార్య కారణాలను వలన పెంపును ప్రకటించామని ముక్కు పిండి అధిక డబ్బును వసూలు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 25 శాతం నౌక సంస్థలు ఈ మార్గాల ద్వారా లాభపడుతున్నాయని తెలిసింది.

పన్ను ఎగవేత

పన్ను ఎగవేత

కొన్ని దేశాల్లో నౌకల ద్వారా సాగే ప్రయాణాలకు మరియు వాటికి సంభందించిన వ్యాపారాలు చట్టం చేయబడలేదు. కాబట్టి షిప్పింగ్ సంస్థలు ఆ యా ప్రభుత్వాలకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మరికొన్ని షిప్పింగ్ సంస్థలు ప్రభుత్వాలతో ఏకీకృతం కాకపోవడం వలన ఆ ప్రభుత్వాలకు ఆదాయం గండిపడుతోంది. తక్కువ ధరలో క్రూయిజ్ నౌకల్లో ట్రావెల్ చేయాలనుకుంటే సీజన్‌లో వెల్లడం చాలా మంచిది.

శాస్వత వైద్యులు ఉండరు

శాస్వత వైద్యులు ఉండరు

నౌకల్లో అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించడానికి శాస్వత వైద్యుల అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే చాలా షిప్పింగ్ సంస్థలు తమ నియమ నిభందల వివరాల్లో వైద్యులు నామమాత్రంగానే ఉంటారు మరియు శాస్వత వైద్యులు ఉండరు అనే వాఖ్యం ఉంటుంది.

ప్రయాణ రద్దు విధానాలు

ప్రయాణ రద్దు విధానాలు

ప్రయాణాన్ని అప్పుడప్పుడు రద్దు చేస్తుంటాయి కొన్ని షిప్పింగ్ సంస్థలు. చాలా వరకు ఇలాంటివి జరగవు, ఒక వేళ ముందుగా ఊహించుకున్న క్రూయిజ్ నౌక ప్రయాణం రద్దయితే మీరు చెల్లించిన సొమ్ము దాదాపుగా వెనక్కి తిరిగి రాదు.

వ్యర్థాల సంగతేంటి

వ్యర్థాల సంగతేంటి

పెద్ద పెద్ద నౌకల్లో వెలువడే మానవ మరియు ఆహార వ్యర్థాల పరిస్థితేంటి మరియు వాటిని ఎలా నిర్వహిస్తారు అనే ప్రశ్నతో ఉన్నారా ? వొయాగ్ అనే నౌక నుండి ఒక వారానికి సుమారుగా 210,000 గ్యాలన్ల మానవ వ్యర్థాలు వెలువడతాయి, వీటిని ఎక్కవ రోజులు పాటి నౌకలో నిల్వ చేయలేరు. చిన్న చిన్న బోట్ల ద్వారా భూమిని చేరవేస్తాయి. కాని ఇలాంటివి అన్ని సంస్థలు చేయవు. చాలా వరకు సముదర జలాల్లోకి విడుదల చేస్తాయి.

నౌకల్లో చట్టాలు పనిచేయవు

నౌకల్లో చట్టాలు పనిచేయవు

నిజమే, నౌకల్లో మీరు కొంత మంది వలన ఇబ్బంది పడాల్సి వస్తే అప్పుడు మీరు చేసే ఫిర్యాదులు ఏ మాత్రం పని చేయవు. ఎఫ్‌బిఐ వారి కథనం ప్రకారం, లైంగిక దాడులు నేల మీద కన్నా నౌకల్లో 59 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

లగ్జరీ నౌకల్లో భయంకర రహస్యాలు

  • షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు
  • 102 ఏళ్ల తరువాత విస్తరించబడిన పనామా కెనాల్ చరిత్ర
  • టైటానిక్‌ను గుర్తు చేస్తున్న అరుదైన ఫోటోలు

Most Read Articles

Read more on: #నౌకలు #ships
English summary
Read In Telugu: 10 Dirty Scecrets Of Big Cruise Ships
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X