రోల్స్ రాయిస్ గురించి పది షాకింగ్ నిజాలు

Written By:

రోల్స్ రాయిస్ లిమిటెడ్ ఖరీదైన కార్లు మరియు విమాన ఇంజన్‌ల తయారీ సంస్థ. చార్లెస్ స్టెవర్ట్ రోల్స్ మరియు ఫ్రెడరిక్ హెన్రీ రాయిస్ ఇద్దరూ 1906లో రోల్స్ రాయిస్ సంస్థను స్థాపించారు. ఇలాంటి మరిన్ని నిజాలు నేటి కథనంలో చూద్దాం రండి...

రోల్స్ రాయిస్ సంస్థ ఘోస్ట్ కార్ల తయారీకి ప్రసిద్దిగాంచిందని తెలిసిందే, కాని నిజానికి ఇది విమానాలలో వినియోగించే ఇంజన్‌లను కూడా తయారు చేస్తోంది. 1906లో ప్రాణం పోసుకున్నరోల్స్ రాయిస్ అదే సంవత్సరంలో తమ మొదటి కారు సిల్వర్ ఘోస్ట్‌ను ఆవిష్కరించింది. తరువాత ఈ కారు రికార్డ్ బ్రేక్ చేస్తూ నాన్ స్టాప్‌గా 24,000 కిలోమీటర్లు తిరిగింది.

ఇంగ్లాండు ప్రభుత్వం చేసి 1971లో రోల్స్ రాయిస్ జాతీయ చేయబడింది. రెండేళ్ల అనంతరం రోల్స్ రాయిస్ సంస్థ నుండి రోల్స్ రాయిస్ మోటార్స్ వేరుపడగా, రోల్స్ రాయిస్ లిమిటెడ్ అలాగే జాతీయ సంస్థగా నిలబడి 1987లో ప్రైవేటీకరణ గావించబడింది.

రోల్స్ రాయిస్ మోటార్స్ తొలినాళ్ల నుండి ఇప్పటి వరకు ఉత్పత్తి చేసిన మొత్తం కార్లలో 65 శాతం వరకు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాయి.

ప్రసిద్ద రోల్స్ రాయిస్ మోటార్స్‌ను 1980లో బ్రిటీష్‌కు చెందిన కాంగ్లోమెరేట్ వికర్స్ స్వాధీనపరుచుకుంది. ఆ తరువాత 1988లో బిఎమ్‌డబ్ల్యూ కొనుగోలు చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఆఫర్‌ను తలదన్నే రీతిలో రోల్స్ రాయిస్‌ను కొనుగోలు చేసేందుకు వోక్స్‌వ్యాగన్ ముందుకొచ్చింది. అయితే అప్పటికే బిఎమ్‌డబ్ల్యూతో ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్నందుకు బిఎమ్‌డబ్ల్యూ చెంతకే చేరింది. తరువాత కాలంలో ఇంగ్లాండ్‌లోని గుడ్‌వుడ్ ప్రాంతంలో రోల్స్ రాయిస్ ఫ్యాక్టరీని నిర్మించింది.

2003లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ప్రపంచానికి పరిచయం అయ్యింది. బిఎమ్‌డబ్ల్యూ భాగస్వామ్యంతో రోల్స్ రాయిస్ అభివృద్ది చేసిన మొదటి కొత్త జనరేషన్ కారు ఇది. దీనిని సుమారుగా 44,000 రంగుల్లో ఎంచుకోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ఫాంటమ్ కారు కూడా జర్మనీలో ప్రాణం పోసుకుంటుంది. ఒక్కో ఫాంటమ్ కారులో మొత్తం 200 అల్యూమినియం సెక్షన్లు మరియు 300 లకు పైగా అల్లాయ్ విడి భాగాలు ఉంటాయి. వీటన్నింటి చేతితో వెల్డింగ్ చేస్తారు. ఒక్కో ఫాంటమ్ కారు తయారీకి రెండు నెలల సమయం తీసుకుంటుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో వి12 ఇంజన్ కలదు. ఇది కేవలం 5.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

రోల్స్ రాయిస్ కార్ల ముందు భాగంలో శిల లాంటి ఆకారంలో ఉన్న ఆర్నమెంట్ అందించేది. దీనిని 1911 నుండి అందివ్వడం ప్రారంభించింది. ఫ్రంట్ గ్రిల్ లో అందించిన మెకానిజమ్ ద్వారా ఇది రిమోట్ కంట్రోల్ లేదంటే ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా విచ్చుకుంటుంది.

ప్రతి ఫాంటమ్ కారులో టెఫ్లాన్ కోటింగ్ గల గొడుగులు ఉంటాయి. టచ్ బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా డోర్లలో అందించిన గొడుగులు బయటకు విచ్చుకుంటాయి.

ప్రతి ఫాంటమ్ కారు ఇంటీరియర్‌లోని పై భాగం (అప్ హోల్‌స్ట్రే) 75 చదరపు మీటర్లు ఉంటుంది, దీనిని పూర్తి స్థాయిలో నిర్మించడానికి 17 రోజుల సమయం పడుతుంది.

ఇతరులు ఎక్కువ చదువుతున్న కథనాలు:

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Friday, March 17, 2017, 13:03 [IST]
English summary
10 facts every Rolls-Royce fan should know
Please Wait while comments are loading...

Latest Photos