క్రూయిజ్ షిప్స్ ప్రయాణం వెనుక దాగున్న చీకటి రహస్యాలు

By Anil

వైభవమైన మరియు అత్యంత విలాసవంతమైన లగ్జరీ క్రూయిజ్ షిప్స్‌లో ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఆ అనుభవం కోసం ఎంతో మంది ప్రయత్నిస్తూనే ఉంటారు. కొంత మందైతే నీటి మీద తెలియాడుతూ ప్రపంచ దేశాలను చుట్టేయాలనే జీవిత కాలపు లక్ష్యాన్ని పెట్టుకుంటారు. క్రూయిజ్ షిప్స్‌లో ప్రయాణం అనే ఎంతో కలగా చెప్పవచ్చు.

అయితే క్రూయిజ్ షిప్స్ ప్రయాణం, వీటిలో సౌకర్యాలు, వీటి ఇంజన్ మరియు రూపం వంటి ఎన్నో విశషయాల గురించి చదివి ఉంటారు. కాని ఈ రోజుల్లో నౌకల ప్రయాణంలో మనకు తెలియకుండా రహస్యంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. నౌకల ప్రయాణంలో ప్రయాణికులకు తెలియకుండా జరిగే పనులేమిటి వంటి వాటి గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

1. మార్చురీ

1. మార్చురీ

పెద్ద పెద్ద క్రూయిజ్ నౌకలు చాలా దూర ప్రాంతాలకు పయనిస్తుంటాయి. ఇలాంటి నౌకలలో మధ్య వయస్సున్న వారు మరియు వయస్సు పైబడిన వారు ఎక్కువ ప్రయాణిస్తుంటారు. అయితే అకస్మాత్తుగా ఎవరయినా చనిపోతే వారిని భద్ర పరచడానికి నౌకల్లో మార్చురీలను అందుబాటులో ఉంచుతారు. క్రూయిజ్ నౌకల్లో మరణం పొందేవారి ఉండనేఉన్నారు. అయితే చనిపోయిన వారి తాలుకు వారి దేహాన్ని కోరదలిచితే హెలికాప్టర్‌ ద్వారా చేర్చుతారు లేదా సమీపంలోని తీరానికి చేరుకుని మృతదేహాన్ని వారి ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తారు. క్రూయిజ్ నౌకలలో ఖచ్చితంగా మృత్యువాత పడతారు అని ప్రత్యేకించి మార్చురీలని ఏర్పాటు చేసుకుంటారు.

2. అంటు వ్యాధులు

2. అంటు వ్యాధులు

క్రూయిజ్ నౌకల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు గుంపులు గుంపులుగా మూగడం వలన అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎక్కువ ఆహార సంభదమైన వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. అందు కోసం నౌకలలోని సిబ్బంది ప్రతి రోజు ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. జబ్బుల బారిన పడిన వారికి ప్రత్యేక గదులను కేటాయించి వైద్య సేవలందిస్తారు.

3. అధిక కాలుష్యం

3. అధిక కాలుష్యం

క్రూయిజ్ నౌకలు భారీ స్థాయిలో కాలుష్యాన్ని వెలువరిస్తాయి. అలాంటి నౌకలు కదలడానికి వాటిలో ఉన్న ఇంజన్‌లు అపారమైన ఇంధనాన్ని తీసుకుంటాయి. ప్రముఖ క్యూఇ2 అనే నౌక ఒక్క మైళు కదలడానికి 400 లీటర్ల ఇంధనాన్ని తీసుకుంటాయి. అదే విధంగా చాలా వరకు క్రూయిజ్ నౌకలు 3,000 మంది వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వారి ద్వారా ఒక వారానికి 800,000 లీటర్ల (210,000 గ్యాలన్లు) నీరు మురుగుగా సముద్రంలోని విడుదల అవుతుంది.

4. సముద్ర దొంగలు

4. సముద్ర దొంగలు

సముద్రంలో ప్రయాణించే నౌకల మీద కన్నేసే దొంగలు కూడా ఉంటారు. ఎక్కువ రోజుల పాటు నౌకలలో ప్రయాణించే ప్రయాణికులు అధిక మొత్తంలో డబ్బు మరియు ఇతర విలువైన వస్తువులతో ప్రయాణిస్తుంటారు. అదే విధంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే నౌకలలో సరుకులను కూడా రవాణా చేస్తుంటారు. ఇలాంటి విలువైన వస్తువులను దోచుకోవడానికి సముద్రం దొంగలు క్రూయిజ్ నౌకలను టార్గెట్ చేస్తుంటారు. క్రూయిజ్ నౌకల్లో వారిని నియంత్రించే భద్రత సామాగ్రి మరియు ఆయుధాలు గనుక నౌకల్లో లేకపోతే సర్వం దోచుకుంటారు.

5. శాశ్విత అతిథులు

5. శాశ్విత అతిథులు

పిల్లలు వదిలేసిన పెద్దలు, వయసైపోయిన వారు, బాగా డబ్బున్న వారు చాలా వరకు ఎక్కువగా నౌకల్లోనే గడపడానికి ఇష్టపడతారు. ఇందులో ఎక్కువ మంది శాస్వతంగా నౌకల్లోనే ఉంటారు. వైద్యం. వినోదం మరియు ఆహారం అనే విషయాలు ఏ మాత్రం వారికి అడ్డం కాదు. వారికి కావాల్సిన సకల సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఇలాంటి నౌకల్లో ఏడాది పాటు గడపడానికి సుమారుగా 100,000 డాలర్ల వరకు ఖర్చవుతుంది.

6. రిజిస్ట్రేషన్

6. రిజిస్ట్రేషన్

చాలా వరకు నౌకలు పనామా మరియు లిబేరియా వంటి దేశాలలో రిజిస్టేషన్ చేయించుకుంటున్నారు. అధిక ఉద్గారాలను వెలువరించడం మరియు మానవ హక్కుల నిభందనలకు విరుద్దంగా ఉన్నప్పటికీ ఆయా దేశాలలో నౌకల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అందు కోసం ఇలాంటి నౌకల రిజిస్ట్రేషన్ గల నౌకలకు సముద్రం మీద కొన్ని రీజియన్‌లలో అనుతులు లేవు. అంతే కాకుండా ఇలాంటి నౌకలలో పని చేసే కార్మికులు బానిసలుగా ఉంటారు. వారానికి 80 గంటలు పని చేసే వారికి వారానికి 50 డాలర్లు జీతం ఉంటుంది.

7. ప్రపంచపు అతి పెద్ద నౌక

7. ప్రపంచపు అతి పెద్ద నౌక

ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద నౌకలు రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ వారి వద్ద ఉన్నాయి. అందులో ఎమ్‌ఎస్ ఒయాసిస్ మరియు ఎమ్ఎమ్ అల్లురే ఆఫ్ ది సీస్ (సాంకేతికంగా అతి పెద్దది). ఇంది నాలుగు ఫుట్ బాల్ స్టేడియంలకు సమానమైన పొడవుతో, 16 అంతస్తుల ఎత్తుతో ఉంటుంది. ఇందులో సుమారుగా 6,000 మంది వరకు ప్రయాణించవచ్చు.

8. కోస్టా కన్కోర్డియా

8. కోస్టా కన్కోర్డియా

కోస్టా కన్కోర్డియా అనే అకి పెద్ద నౌక 2012 తీర ప్రాంతానికి సమీపంలో ప్రమాదానికి గురయ్యి మునిగిపోయింది. అప్పట్లో ఇందులో సుమారుగా 3,229 ప్రయాణికులు మరియు1,023 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన తరువా 30 మంది శవాలు దొరికియా ఇద్దరు గల్లంతయ్యారు. అయితే ఈ ప్రమాదాన్ని గల కారణాలు కోసం చేసిన దర్యాప్తులో తేలిన విషయం ఏమిటంటే నౌకను నడిపిన కెప్టెన్ ఇందులో డ్యాన్సర్లుకు దీనిని ఎలా నడపాలో వివరిస్తూ అనుకోకుండా అనవసరంగా వినియోగించిన కంట్రోల్స్‌కు కారణందా ఈ నౌక మునిగిపోయింది. అందుకు గాను ప్రమాదానికి కారణందా గుర్తించి కెప్టెన్‌తో పాటు మొత్తం ఐదు మందికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు.

9. కార్నివాల్ ప్రమాదం

9. కార్నివాల్ ప్రమాదం

2013 లో కార్నివాల్ ట్రయంప్ నౌక ప్రమాదం ఎంతో భీతిని సృష్టించింది. మెక్సికో యుఎస్ నుండి మెక్సికోకు బయలు దేరిన ఈ నౌక సముద్రం మధ్యలో ఉండగా సాంకేతిక గదిలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుని నౌక మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. దీని వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ ఇంజన్ పనిచేయకుండా అయిపోయింది. అయితే టగ్ బోటును ఉపయోగించి ఈ నౌకను తిరిగి యుఎస్ వైపుకు నెట్టించారు. అందు కోసం సుమారుగా ఐదు రోజుల సమయం తీసుకుంది. విద్యుత్ లేకపోవడం టాయిలెట్ల శుబ్రత, గదులకు ఏ/సి లేక ప్రయాణికులు ఆహారం మరియు విపరీతమైన వేడితో ఎంతగానో ఇబ్బంది పడ్డారు. దీనిని ఎన్నో ఏళ్లుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ సంస్థ మరుగున పడిపోయింది.

10. అదృశ్యం

10. అదృశ్యం

2000 సంవత్సరం నుండి సుమారుగా 200 వరకు నౌకలు మునిగిపోయాయి. లగేజితో పాటు బయటిపడిన వ్యక్తుల వివరాలతో సమం అయినపుడు మిగతా వారి కోసం వెతికి చివరికి దొరకని వాళ్లను గల్లంతయ్యారని చెబుతారు. అయితే ప్రమాదం సమయంలో మధ్య సేవించిన వారు, ఆత్మహత్య చేసుకునే వారు ఇలాంటి సమయంలో గల్లంతు అనే అంశంల చేర్చబడతారు.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

  • విమాన ప్రయాణంలో పైలట్లు మరియు విమాన సిబ్బంది చేసే చీకటి పనులు
  • మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

    • ఇది సింగపూర్ ఎయిర్ పోర్ట్ కాదు: ఆంధ్రప్రదేశ్ లోని భారతదేశపు అత్యాధునిక ఆర్‌టిసి బస్టాండ్

Most Read Articles

Read more on: #నౌకలు #ships
English summary
10 Fascinating Facts About Cruise Ships - Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X