దెయ్యాలు ఎక్కువగా ఉన్న టాప్-10 భారతీయ రోడ్లు

By Anil

దెయ్యాలు ఉన్నాయా అని ఎవరినైనా కదిలిస్తే చాలు దెయ్యాలు గురించి రామాయణం, మహాభారతం రేంజ్‌లో కథలు చెప్పుకొస్తారు. కాని ఇంత వరకు దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది ప్రశ్నలాగే మిగిలిపోయిందేగాని దీనికి సంభందించి ఎటువంటి సరైన కథనాలు ఇంత వరకు రాలేదు. అయితే మన భారతీయ రోడ్ల మీద కొన్ని దెయ్యాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయట.

మన దేశంలో గల ఏయే రహదారుల్లో దెయ్యాలు ఉన్నాయి మరియు దాని వెనకున్న అసలు కథేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే.

 1. కల్కా సిమ్లా రైల్వే సొరంగం

1. కల్కా సిమ్లా రైల్వే సొరంగం

ఒకానొక కాలంలో కల్కా మరియు సిమ్లా మధ్య ఒక ప్రాంతంలో రైల్వే సొరంగం నిర్మించాల్సి వచ్చింది. అప్పుడు కొంత మంది కార్మికుల చేత కలొనెల్ బరోగ్ అనే వ్యక్తి సొరంగం పనులు మొదలు పెట్టారు. అయితే అతని తెలివికి ఎంతకీ సొరంగం పని పూర్తి అవ్వలేదు ఇలా రకరకాల కారణాల వలన కార్మికులు బరోగ్‌ను ద్వేషించడం ప్రారంభించారు. ఇది భరించలేని బరోగ్ ఆ సొరంగం నిర్మాణంలో కాల్చుకుని చనిపోయాడు. ఆ తరువాత అతడిని అక్కడే ఖననం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతని ఆత్మ అక్కడే తిరుగుతోందని వదంతులు వినిపించాయి. ఏదయితేనే మీరు కనుక అటు వైపు వెళితే కొంచెం జాగ్రత్తగా ఉండండి.

Picture credit: DailyMotion

 2. రెండు లైన్ల ఈస్ట్ కోస్ట్ రహదారి

2. రెండు లైన్ల ఈస్ట్ కోస్ట్ రహదారి

ఈ రహదారి గుండా ప్రయాణించిన వారు ఆ రోజంతా సంతోషంగా ఉంటారట కాని వారికి చీకటి పడేంత వరకు తెలియదంట ఆ రోడ్ మహత్యం. కొంత మంది ఆ రోడ్డు మీద ప్రయాణించిన డ్రైవర్లు మరియు ప్రయాణికుల కథనం ప్రకారం అర్థ రాత్రి పూట ఒక యువతి తెల్లటి చీర కట్టుకుని రహదారి నడిభగంలో నడయాడుతూ ఉంటుందని తెలిపారు. అయితే ఆ రోడ్డు ఎక్కువ శాతం ప్రమాదాలు ఆ దెయ్యం వలనే జరిగాయని చెబుతున్నారు.

Picture credit: hourdose

3. ఢిల్లీ కంటాన్‌మెంట్ రోడ్డు

3. ఢిల్లీ కంటాన్‌మెంట్ రోడ్డు

దెయ్యం కథతో మరో రోడ్డు వచ్చింది అదే ఢిల్లీ కంటాన్‌మెంట్ రోడ్డు. ఈ రోడ్డు మీద బాగా చీకటి అలుముకున్నాక ఒక దెయ్యం తెల్లట చీరలో రోడ్డు మధ్యలో ఉంటుందని మరియు అటుగా వచ్చిన వారిని మట్టుబెడుతుందని తెలిసింది. అయితే దీని గురించి ఒక వ్యక్తి మాట్లాడుతూ మీరు ఆ రోడ్డు మీదకు వెళ్లిన తరువాత మీ వాహనాన్ని రాకెట్ వేగంతో నడపాలి లేదంటే ఆమె మిమ్మల్లి వెంటాడుతుందని తెలిపాడు.

Picture credit: TaxiForSure

4. రాంచీ జంషెడ్‌పూర్ జాతీయ రహదారి

4. రాంచీ జంషెడ్‌పూర్ జాతీయ రహదారి

మీకు జాతీయ రహదారుల గురించి అవగాహన ఉంటే దీనిని 33 వ జాతీయ రహదారి అంటారు. ఈ హైవేలో ఉన్న 40 కిలోమీటర్ల మేర దెయ్యాలు మాటు వేసి ఉంటాయి అనేది ముఖ్య కథనం. ఎందుకంటే గత మూడేళ్లలో కేవలం 40 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా 243 మంది ప్రాణాలు కోల్పోయారు. మరియు ఎక్కువ భయంకరమైన జాతీయ రహదారుల్లో ఇది మొదటి స్థానంలో ఉంది.

Picture credit: panoramio

5. మార్వి అండ్ మధ్ ఐలాండ్ రోడ్డు

5. మార్వి అండ్ మధ్ ఐలాండ్ రోడ్డు

ఈ రహదారి అంతగా భయంకరమైనది కానప్పటికీ పగటి పూట ఈ రోడ్డులో జర్నీ ఎంతో హాయిగా ఉంటుంది. అయితే రాత్రి వేళలో దీనికి పూర్తిగా విరుద్దం ఎందుకంటే ఒక మహిళ పెళ్లి దుస్తులు ధరించి పెళ్లి కూతురు వేషధారణలో అటుగా వెళ్లే వారికి ముచ్చెమటలు పట్టింస్తోందట. అంతే కాకుండా అటుగా వెల్లేవారికి వినపడేలా వింత వింత శబ్ధాలు సృష్టిస్తూ తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోందట.

Picture credit: polkacafe

6. ముంబాయ్-నాసిక్ జాతీయ రహదారి

6. ముంబాయ్-నాసిక్ జాతీయ రహదారి

దెయ్యాలకు స్థావరాలుగా ముంబాయ్ మరియు నాసిక్ మీద కాసర‌ఘాట్ అనే ప్రాతం ప్రసిద్దగాంచింది. ఈ జాతీయ రహదారి మీద కాసర్‌ఘాట్ అనే ప్రాంతంలోకి వాహనాలు వెళ్లే సరికి అక్కడ చుట్టుప్రక్కల ఉన్న అడవిలోని చెట్లు మరియు పొదలు ఎంతో భయంకరంగా ఊగుతాయి మరియు వాటి మీద తలలేని మహిళ దర్శనం ఇస్తుంది ఆ తరువాత మీరు తెలివిని కోల్పోయి ప్రమాదానికి దారి తీస్తుందని తెలిపారు.

Picture credit: stockpicturesforeveryone

7. జాతీయ రహదారి-209 , సత్యమంగళం

7. జాతీయ రహదారి-209 , సత్యమంగళం

సత్యమంగళం వన్యప్రాణి అభయారణ్యం ఇది ఒకప్పుడు కూసి మునిస్వామి వీరప్పన్ తలదాచుకునే ప్రాంతం. అప్పట్లో ఇతను ఇక్కడ డబ్బుకోసం అటుగా వెళ్లే వారిని వెంబడించే వాడు. అయితే వీరప్పన్ చనిపోయాక కూడా అదే విధంగా చీకటిలో లైట్లు వెలిగేవి, మరియు భయానకమైన శబ్దాలు వినిపించేవి అని కొంమంది కథనం. అంటే దీని అర్థం అక్కడ వీరప్పన్ ఆత్మ ఏమైనా తిరుగుతూ ఉంటుందా...?

Picture credit: Suniltg/Wiki Commons

8. కాషేడి ఘాట్, ముంబాయ్-గోవా హైవే

8. కాషేడి ఘాట్, ముంబాయ్-గోవా హైవే

ముంబాయ్-గోవా రహదారి మధ్యలో వచ్చే కాషేడి ఘాట్ రోడ్ మరొక మిస్టరీకి నెలవు. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్డు ఎంతో ఎత్తులో ఉంటుంది మరియు చాలా వరకు మలుపులతో కూడుకున్నది. అయితే అటుగా వెళ్లే కార్లు లేదా బస్సులు మలుపుల వద్ద తిరుగుతున్న సమయంలో కుడు చేతి వైపున ఒక వ్యక్తి వచ్చి ఉన్నట్లుండి స్టాప్ అని సంకేతాన్ని చూపిస్తాడు. ఆ తరుణంలో డ్రైవర్లు భయపడి వాహనాన్ని అలాగే లోయలోకి నడిపేస్తారు. ఇలాంటి కథనం మీదనే అక్కడ చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

Picture credit: bcmtouring

9. బెసంత్ అవెన్యు రోడ్

9. బెసంత్ అవెన్యు రోడ్

చెన్నైలోని ఈ బెసంత్ అవెన్యు రోడ్డుకు కూడా ఒక కథ ఉంది. ఈ రోడ్డు పగులంతా సందడిగానే ఉంటుంది. అయితే చీకటి పడేకొద్దీ అక్కడ పరిస్థితులు మారుతూ ఉంటాయి. అయితే ఆ రోడ్డులో వింత శబ్దాలు మరియు ఎవరో అక్కడ నుండి తొసినట్టు మరియు ఏదో బలం మన మీద ప్రయోగించబడుతున్నట్లు అవుతుందని అటుగా వెళ్లే వారు తెలిపారు. అయితే ఎంతో కాలం నుండి ఇదే తంతు నడుస్తున్నట్లు తెలిసింది.

Picture credit: Sankar Pandian/Wiki Commons

10. ముంబాయ్-పూనే పాత ఎక్స్‌ప్రెస్ రహదారి

10. ముంబాయ్-పూనే పాత ఎక్స్‌ప్రెస్ రహదారి

ఒక దెయ్యం నేను నిజంగానే ఉన్నాను అని చెప్పి చేసిన సంతకం: ఈ రహదారిలో ఒకతను ప్రతి రోజు రాత్రి తన పని ముగిసిన తరువాత స్కూటర్ మీద ప్రయాణం అయ్యేవాడు. అయితే ఒక రోజు ఒక అమ్మాయి రోడ్డు మీద లిఫ్ట్ అడుగుతూ కనబడింది. సరే అని అమెను వెను సీటు మీద కూర్చున్నాడు. తరువాత అమె అడిగిన చోట దింపిన తరువాత మరి కొంచెం దూరంలో అదే అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ ఉంది. సరేలే అని మళ్లీ లిఫ్ట్ ఇచ్చాడు. తరువాత కొంచెం దూరంలో అమెను దింపి వెనక్కు చూశాడు.......

తరువాత స్లైడర్‌లో

Picture credit: ixigo

ముంబాయ్-పూనే పాత ఎక్స్‌ప్రెస్ రహదారి

ముంబాయ్-పూనే పాత ఎక్స్‌ప్రెస్ రహదారి

......వెనక్కి చూస్తే అమె కనబడలేదు. అప్పటికే ఆమె ఒక దెయ్యం అని నిర్ణయానికి వచ్చాడు. తరువాత చేసేదేమీ లేక స్కూటర్‌ను 80 కిలోమీటర్ల వేగంతో నడిపాడు అపుడు ప్రక్కవైపుల నుండి ఉన్నట్లుండి నవ్వులు మరియు ఏడుపు ఒకదానివెంట ఒకటి వినిపించాయి.అంతలో ఇతను ఏంటా అని తల ప్రక్కకు తిప్పితే అది చూడటానికి ఒక భయంకరమైన ఆకారంలో ఉందని తెలిపాడు. తరువాత సృహ తప్పి పడిపోయిన అతను మరుసటి రోజు తన కాలి మీద గాయాన్ని గుర్తించాడు. అక్కడ నేను దెయ్యాన్ని సంతకం చేసి ఉందని తెలిపాడు.

Picture credit: ixigo

 దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే

దెయ్యాలు ఉన్నాయా, లేవా అన్నది ఒకరు చెపితే తెలిసే రహస్యం కాదు. స్వయంగా ఆ అనుభవాన్ని పొందితే తప్ప. అయితే అనుకోకుండా వాటిని చూస్తే తప్పులేదు. కాని అదే పనిగా వాటి ఛేదనలో పడితే చాలా ప్రమాదం. ఎందుకైనా మంచిది అటువంటి పనులకు దూరంగా ఉండండి. అయితే ఈ మొత్తం సమాచారం ఒక వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ఆధారంగా మీకు అందించాము.

మరిన్ని కథనాల కోసం...
  • బొగ్గు గనులలో బయల్పడిన రహస్యమైన కార్లు అవశేషాలు
  • వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!

Most Read Articles

English summary
10 Haunted Road Routes In India
Story first published: Wednesday, March 9, 2016, 16:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X