ఇండియన్ సెలబ్రిటీలు కార్లను ఇలా కస్టమైజ్ చేయించుకుంటారా?

By N Kumar

సెలబ్రిటీలు అమ్మో ఇది సాధారణ పదం కాదు. ఎందుకంటారా రాజకీయ నాయకుల కన్నా సమాజంలో సెలబ్రిటీలు ఎంతో శక్తివంతమైన వారు. ఐదేళ్లు పదవిలో ఉండే వారి కన్నా జీవితాంత సినిమా రంగంలో ఉండే సెలబ్రిటీలు అంటే ప్రజలు పడి చచ్చిపోతుంటారు. ఇది మనం సెలబ్రిటీలు గురించే ఊహించే తీరు.

కాని సెలబ్రిటీలు కార్లు కొనే విషయానికి వస్తే డబ్బున్న ప్రతి ఒక్కరూ కొనే విధంగా కాకుండా అరుదైన, ఖరీదైన కార్లను ఎంచుకుంటారు. అలా ఒకేవిధమైన కార్లు కొంటే సాధారణ ప్రజలకు వీరికి తేడా ఏముంటుంది. అందుకే కొనుగోలు చేసిన తరువాత సెలబ్రిటీలు వారి అభిరుచికి తగ్గట్లుగా వాటిని కస్టమైజ్ చేయించుకుంటారు. అలా కస్టమైజ్డ్ కార్లను కలిగి ఉన్న టాప్-10 ఇండియన్ సెలబ్రిటీల గురించి క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము. అయితే ఈ వీకెండ్‌ను బోరింగ్‌గా ఫీల్ అవకుండా ఈ కథనాన్నిపూర్తి చదివేసుకోండి.

10. గుల్ పనాగ్

10. గుల్ పనాగ్

ధూప్ సినిమాతో బాలీవుడ్ వెండి తెరకు పరిచయం అయిన ఈ హిందీ అమ్మడు దగ్గర రాయల్ ఎన్పీల్డ్ నుండి మహీంద్రా వారి ఎలక్ట్రిక్ కారు ఇ2ఒ వరకు చాలా వాహనాలనే కలెక్ట్ చేసింది.

గుల్ పనాగ్ ఎస్‌యువి

గుల్ పనాగ్ ఎస్‌యువి

గుల్‌ పనాగ్ వద్ద ఉన్న స్కార్పియో వాహనాన్ని ఇది స్కార్పియో అని ఎవరూ గుర్తుపట్టలేనంతగా కస్టమైజ్ చేయించుకుంది. చూడటానికి టాప్ లెస్‌గా కనిపించినప్పటకీ ఇది రూఫ్‌ను కలిగి ఉంది. అంతే ఇందులో టాయిలెట్ కూడా కలదు. గుల్‌పనాగ్ డిస్కవరీ ఛానెల్‌లో చేసే షో ఆఫ్ రోడ్ విత్ గుల్ పనాగ్ అనే షోలో ఈ అమ్ముడు ఈ వాహనాన్ని వినియోగిస్తోంది.

09. షాహిద్ కపూర్

09. షాహిద్ కపూర్

షాహిద్ కపూర్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మరియు పోర్షే వారి క్యాయన్ మరియు ఇతర ఖరీదైన లగ్జరీ కార్ల ప్రేమికుడు. అయితే అన్నింటి కన్నా జాగ్వార్‌కు చెందిన ఎక్స్‌కెఆర్-ఎస్ సూపర్ ఛార్జ్‌డ్ వెర్షన్ కారుకు మంత్ర ముగ్దుడు.

 షాహిద్ కపూర్ - జాగ్వార్ ఎక్స్‌కెఆర్-ఎస్

షాహిద్ కపూర్ - జాగ్వార్ ఎక్స్‌కెఆర్-ఎస్

జగ్వార్ ఎక్స్‌కెఆర్-ఎస్ సూపర్ ఛార్జ్‌డ్ వెర్షన్ కారులో 5.0-లీటర్ వి8 సూపర్ ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమరుగా 550 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. కేవలం నాలుగు సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది.

08. గౌతమ్ సింఘానియా

08. గౌతమ్ సింఘానియా

గౌతమ్ సింఘానియా ఇతన్ని ఏ సినిమాలలో కూడా చూడలేదు అని అనుకుంటున్నారా ? ఇతను ఇండియా అతి పెద్ద పారిశ్రామిక వేత్త మరియు రేమండ్ గ్రూప్ ఇండియాకు ఛైర్మెన్ మరియు మేనిజింగ్ డైరెక్టర్. ఇతను రేమండ్ తరువాత ఎక్కువగా ప్రేమించేది రేసింగ్. ఇతని వద్ద పార్శ్ సూపర్‌కార్ క్లబ్ అనే కారు ఇతని వద్ద కలదు.

గౌతమ్ సింఘానియా బిఎమ్‌డబ్ల్యూ ఇ92

గౌతమ్ సింఘానియా బిఎమ్‌డబ్ల్యూ ఇ92

కార్లను అమితంగా ప్రేమించే గౌతమ్ కారు గ్యారేజ్‌లో లోటస్ ఎల్సీ, నిస్సాన్ జిటి-ఆర్ మరియు బిఎమ్ డబ్ల్యూ ఇ92 వంటి కార్లు కలవు. అన్నింటి కన్నా రేమండ్ ఎమ్‌డి స్థానంలో ఉన్నందుకు తన బిఎమ్‌డబ్ల్యూ కారు మొత్తాన్ని రేమండ్ పేర్లతో నింపేశాడు.

07. జాన్ అబ్రహం

07. జాన్ అబ్రహం

భారతీయ ప్రపంచానికి తెలిసిన సత్యాలలో జాన్ అబ్రహం కార్ల ప్రేమికుడు అనేది కూడా. ఈ బాలీవుడ్ స్టార్ వద్ద యమహా ఆర్1 బైకు, ఆడి క్యూ7 మరియు ఇతర వాహనాలు ఇతని వద్ద కలవు.

జాన్ అబ్రహం - మారుతి సుజుకి జిప్సి

జాన్ అబ్రహం - మారుతి సుజుకి జిప్సి

ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ జిప్సీ మజాయే వేరంటాడు అబ్రహం. ఇతని వద్ద ఉన్న కార్లలో ఫేవరేట్ వాహనం ఏదంటే జిప్సి అని చెప్పుకొస్తాడు. తన చిన్న తనంలో ఇకానిక్ ర్యాలీ కారు ఇతని వద్ద ఉండేది అయితే ప్రమాదంలో ఇది పాడైపోయింది.

06. ఇమ్రాన్ ఖాన్

06. ఇమ్రాన్ ఖాన్

ప్రముఖ బాలీవుడ్ నటుడు రెండు కార్లను కలిగి ఉన్నాడు ఇయితే రెండింటిని కూడా తన అభిరుచి తగ్గట్లుగానే కస్టమైజ్ చేయించుకున్నాడు. ఇతని వద్ద ఉన్న కార్లలో ఫెరారి కాలిఫోర్నియా అంటే ఇతని చాలా ఇష్టం. దీనిని 2014 లో కొనుగోలు చేశాడు.

ఇమ్రాన్ ఖాన్ - ఫెరారి కాలిఫోర్నియా

ఇమ్రాన్ ఖాన్ - ఫెరారి కాలిఫోర్నియా

ఇమ్రాన్ ఖాన్ కాలిఫోర్నియా కారును ఎంచుకున్న తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ, " నేను 11 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడూ ఎఫ్-430 అనే కారును పొందాను, అయితే అప్పటికే ఫెరారికి పెద్ద అభిమానిని అయిపోయాను అందుకే ఇప్పుడు కాలిఫోర్నియా బ్లాకా అండ్ రెడ్ కారు కొనుగోలు చేశానని తెలిపాడు. ఇందులోని ఇంజన్ మరియు సీట్లను నా అభిరుచికి తగ్గట్లు డిజైన్ చేయించుకున్నా" అని తెలిపాడు.

05. విజయ్ మాల్యా

05. విజయ్ మాల్యా

ఒకప్పుడు విజయ్ మాల్యాని గుర్తు చేస్తే అతి పెద్ద పారిశ్రామిక వేత్త అనే వారు కాని నేడు, అతి పెద్ద దోపిడీ దారుడు అని అంటున్నారు. విజయ్ మాల్యా జీవితం అనుకోకుండా మలుపులు తిరిగింది. మాల్యా లైఫ్ బాగున్నపుడు కార్ల అంటే పిచ్చ ఇష్టం ఉండేది. ఇతను రేసింగ్ చెందిన అన్ని వింటేజ్ కార్లను కలిగి ఉన్నాడు.

విజయ్ మాల్యా జాగ్వార్లు

విజయ్ మాల్యా జాగ్వార్లు

ఇతని వద్ద భారీ స్థాయిలో జాగ్వార్ కార్లను కలిగి ఉన్నాడు. అందులో ఎక్స్‌జెఆర్15 రేసర్ కారు దీనిని యాండి ఇవన్స్ అనే రేసర్ చేత ఇంటర్ కాంటినెన్షియల్ ఛాలెంజ్ అనే మూడు రేస్‌లలో కూడా ఈ కారును నడిపాడు, ఈ కారును మాల్యా 1999లో కొనుగోలు చేశాడు. విజయ్ మాల్యా వద్ద రోల్స్‌రాయిస్‌కు చెందిన ప్రతి ఆధునికి మోడల్ కూడా కలదు.

04. రణబీర్ కపూర్

04. రణబీర్ కపూర్

చాక్‌లెట్ బాయ్ రణబీర్ వాహనం ప్రపంచ గురించి తెలియన్ ఇండియన్స్ ఉండరు, ఇతనో తెరిచిన పుస్తకం లాంటి వాడు, ఇతను ఎంచుకునే కార్లు మరియు వాటికి ఎంచుకునే ఫ్యాన్సీ నెంబర్లను చూస్తే మతిపోయేలా ఉంటుంది.

 రణబీర్ కపూర్ మెర్సిడెస్ జి 63 ఏఎమ్‌జి

రణబీర్ కపూర్ మెర్సిడెస్ జి 63 ఏఎమ్‌జి

ఇతని జీవితంలో ఉన్న వాహన ప్రపంచంలో ఉన్న అన్నింటి కన్నా మెర్సిడెస్ జి 63 ఏఎమ్‌జి అంటే ఎక్కువ ఇష్టం, అందుకే అన్ని సంధర్భాలలో దీనినే నడుపుతుంటాడు మరియు ఈ వాహనం ఇతనికి ఎంతో ప్రత్యేకం చేసుకున్నాడు.

అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

జూనియర్ అమితాబ్ బచ్చన్ అంటే ఇతనికి బాగా సరిపోతుంది. తండ్రికి తగ్గట్టే ఇతని వద్ద కూడా భారీ స్థాయిలో లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో రోల్స్‌రాయిస్ ఫాంటమ్ మరియు బెంట్లీ కాంటినెన్షియల్ జిటి. ఇతని వద్ద ఉన్న వాటిలో ఇవే ప్రత్యేకం.

 అభిషేక్ బచ్చన్ - ఆడి ఎ8ఎల్ 4.2 లీ

అభిషేక్ బచ్చన్ - ఆడి ఎ8ఎల్ 4.2 లీ

అభిషేక్ బచ్చన్ ప్రత్యేకంగా తన అభిరుచికి తగ్గట్లుగా కస్టమైజ్డ్ ఆడి ఎ8ఎల్ 4.2 కారును సొంతం చేసుకున్నాడు. ఇందులో ముఖ్యంగా కంట్రోల్ ప్యానెల్, స్టీరింగ్ వీల్ మరియు సీట్లును తనకు తగ్గట్లుగా మలిపించుకున్నాడు.

02. సచిన్ టెండూల్కర్

02. సచిన్ టెండూల్కర్

సచిన్ క్రికెట్‌ను ఎంత ప్రేమిస్తాడో కార్లును కూడా అంతగానే ప్రేమిస్తాడు. అందులోను బిఎమ్‌డబ్ల్యూ కార్లు అంటే మహా పిచ్చి ఇతనికి. సచిన్ ఎలాగైనా ఒక బిఎమ్‌డబ్ల్యూ కారు కొంటే చాలు అనుకునే వాడంట. అయితే ఇప్పుడు అదే బిఎమ్‌డబ్ల్యూ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. దేశీయంగా బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారుకు మొదటి ఓనర్ సచిన్ దీనితో పాటు ఫెర్రారి మరియు నిస్సాన్‌కు చెందిన జిటి-ఆర్ కార్లను కూడా కలిగి ఉన్నాడు.

కస్టమ్ బిల్ట్ 7 సిరీస్

కస్టమ్ బిల్ట్ 7 సిరీస్

సచిన్ అన్ని కార్ల కన్నా బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారును ఎక్కువగా ఇష్టపడతాడు. తాను సంతకం పెట్టిన అచ్చరను తన కారులోని సీటులో ముద్రగా వేయించుకున్నాడు, ఇది కూడా పూర్తిగా సచిన్ అభిరుచి మేరకు బిఎమ్‌డబ్ల్యూ డిజైన్ చేసింది.

Also Read: సచ్చిన్ టెండూల్కర్ కార్ల ప్రపంచం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

 01. మహేంద్ర సింగ్ ధోని

01. మహేంద్ర సింగ్ ధోని

ఇండియాలో ప్రస్తుతం ఇతన్ని మించిన సెసబ్రిటీ ఉంటాడా చెప్పండి. క్రికెట్ ఆటలో ఉన్న 11 మందిని కేవలం కంటి చూపుతో కట్టుదిట్టం చేయగలడు. అంతే తన వ్యక్తిగతం జీవితంలో అంతే ముక్కు సూటి వ్యక్తి ధోని. కూల్ ఇండియన్ కెప్టెన్ తన కాన్ఫెడరేట్ హెల్ల్‌కాట్ X132 వాహనంలో రోడ్డు మార్గం ద్వారా జై పూర్ నుండి ఢిల్లీ వరకు వెళతాడు. అదే ఇతని సహ ఆటగాళ్లు మాత్రం విమానంలో వస్తారు, అదీ మరి ధోని అంటే.

 ఎమ్‌ ఎస్ ధోని జిఎమ్‌సి సియెర్రా

ఎమ్‌ ఎస్ ధోని జిఎమ్‌సి సియెర్రా

చాలా అరుదైన వాటిలో జిఎమ్‌సి సియెర్రా పికప్ ట్రక్ అంటే ధోనికి ఎంతో ఇష్టం. ఇది ఎటుంటి లగ్జరీ మోడల్ కాదు అమెరికాకు చెందిన సాధారణ ఆఫ్ రోడ్ వెహికల్.

ఇండియన్ సెలబ్రిటీల కస్టమైజ్డ్ కార్లు

ఖరీదైన కార్లు గల దక్షిణ భారత సినీతారలు: దుమ్ములేపిన తెలుగు తారలు

ఖరీదైన ఆడి కారు కొన్న జబర్దస్త్ యాంకర్ అనసూయ

ఇండియన్ సెలబ్రిటీల కస్టమైజ్డ్ కార్లు

బాలీవుడ్ తారలకు ఇష్టమైన బైకులు

వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!

ఇండియన్ సెలబ్రిటీల కస్టమైజ్డ్ కార్లు

విరాట్ కోహ్లి అత్బుత వాహన ప్రపంచం

100 కు పైబడి లగ్జరీ కార్లను కలిగి ఉన్న ఫేమస్ బాక్సర్

Most Read Articles

English summary
10 Indian Celebrities Who Customized Their Cars To Suit Their Style
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X