అత్యంత ప్రసిద్దిగాంచిన వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు గురించి పది ఆశక్తికరమైన విషయాలు

By N Kumar

వోక్స్‌వ్యాగన్ వారి అన్ని కార్లలో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్దగాంచిన కారు బీటిల్. ఇది కేవలం రెండు డోర్లను మాత్రమే కలిగి ఉంటుంది. అయితేనే ప్రపంచం మొత్తం అమితమైన అభిమానుల మనస్సును దోచుకుంది. ఇది లభించు రంగులు, డిజైన్ ఇలా ఇందులో అన్ని ప్రత్యేకమే.

మరి ఇంత ప్రత్యేకమైన బీటిల్ కారు వెనకున్న ఆశక్తికరమైన నిజాలు మరియు ఆశ్చర్యకరమైన పది విషయాలు తెలుసుకుందామా ? అయితే క్రింద గల కథనం మీద ఓ లుక్కేసుకోండి.

 ప్రపంచ ప్రసిద్దిగాంచిన బీటిల్ కారు గురించి ఆశక్తికరమైన విషయాలు

1925 లో హంగేరియన్ కు చెందిన 18 సంవత్సరాల వయస్సున్న టెక్నాలజీ స్టూడెంట్ ఒక కారు ఛాసిస్ కు సంభందించిన డిజైన్‌ను వోక్స్‌వ్యాగనా వారికి సమర్పించాడు. అతని ప్రాథమిక డిజైన్ సలహాల నుండి రూపుదిద్దుకున్నదే ఈ వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు.

Photo Source

 ప్రపంచ ప్రసిద్దిగాంచిన బీటిల్ కారు గురించి ఆశక్తికరమైన విషయాలు

ఫెర్డినాండ్ పోర్షే ఇతను ఆస్ట్రియన్ కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ ఇంజనీర్. 1934 లో హిట్లర్ నుండి ఈ కారుకు ఆర్డర్ వచ్చిన తరువాత వోక్స్‌వ్యాగన్ బీటిల్‌ కారును ఇతనే రూపొందించాడు.

Photo Source

 ప్రపంచ ప్రసిద్దిగాంచిన బీటిల్ కారు గురించి ఆశక్తికరమైన విషయాలు

1938 లో దీనిని ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. రుడాల్ఫ్ హిట్లర్‌కు ఇచ్చిన ఈ కారుకు కెడియఫ్-వ్యాగన్ అని పేరు పెట్టారు. కెడియఫ్ అనగా క్రాఫ్ట్ డర్చ్ ఫ్రీడ్ దీని అర్థం ఆనందం వలన బలము. నిజంగా దీనిని రూపొందించినది ఫెర్డినాండ్ ఫోర్షే అయితే సమాజంలో వోక్స్‌వ్యాగన్ అని ముద్ర వేశారు.

 ప్రపంచ ప్రసిద్దిగాంచిన బీటిల్ కారు గురించి ఆశక్తికరమైన విషయాలు

మొదటి సారిగా 1938 జూలై 3 న న్యూయార్క్ టైమ్స్ పత్రిక దీనికి బీటిల్ అని ఒక ముద్దు పేరు పెట్టింది. అప్పటి నుండి దీనికి ఈ పేరు కొనసాగుతూ వచ్చిందని చెప్పవచ్చు.

Photo Source: Wiki Commons

 ప్రపంచ ప్రసిద్దిగాంచిన బీటిల్ కారు గురించి ఆశక్తికరమైన విషయాలు

1949 లో బీటిల్ కారు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయి 40 శాతం వరకు మార్కెట్ షేర్లను కొల్లగొట్టింది. ఆ తరువాత దీనిని 1950 ఈ కన్వర్టబుల్ కారు విపరీతమైన ఉత్పత్తికి సిద్దమైపోయింది.

 ప్రపంచ ప్రసిద్దిగాంచిన బీటిల్ కారు గురించి ఆశక్తికరమైన విషయాలు

1972 ఫిబ్రవరి 17 నాటికి వోక్స్‌వ్యాగన్ దాదాపుగా 15,007,034 యూనిట్ల బీటిల్ కార్లను ఉత్తత్పి చేసి రికార్డును బద్దలు కొట్టింది. ఫోర్డ్ మోటార్స్ వారి మీద ఉన్న రికార్డు ఈ బీటిల్ కారు బ్రేక్ చేసింది. 2002 వరకు దాదాపుగా వోక్స్‍‌వ్యాగన్ 20 మిలియన్ కార్లను అమ్మేసింది.

ప్రపంచ ప్రసిద్దిగాంచిన బీటిల్ కారు గురించి ఆశక్తికరమైన విషయాలు

మొదటి బీటిల్ కారును 1952 జర్మనీలో ఒక బ్రిటీష్ సర్వీస్ మ్యాన్ దీనిని దిగుమతి చేసుకున్నాడు. ఆ తరువాత 1964 లో 100,000 వ కారును బ్రిటన్ కు చెందిన వ్యక్తి కొనుగోలు చేశాడు. 1971 లో 14 మిలియన్ వ కారును కూడా బ్రిటన్ కు చెందిన వ్యక్తి దక్కించుకున్నాడు.

ప్రపంచ ప్రసిద్దిగాంచిన బీటిల్ కారు గురించి ఆశక్తికరమైన విషయాలు

క్లాసిక్ బీటిల్ కార్లను వోక్స్‌వ్యాగన్ 1938 నుండి 2003 వరకు ఉత్పత్తిల చేసింది. అంటే దాదాపుగా 65 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఈ క్లాసిక్ బీటిల్ కార్లను ఉత్పత్తి చేశారు. వోక్స్‌వ్యాగన్ తన చరిత్రలో వరుసగా ఇన్ని సంవత్సరాల పాటు ఉత్పత్తి చేయబడిన కారు కూడా ఇదే. ఈ సమయంలో దాదాపుగా 231,529,464 కార్లను తయారు చేశారు.

ప్రపంచ ప్రసిద్దిగాంచిన బీటిల్ కారు గురించి ఆశక్తికరమైన విషయాలు

చివరగా ఉత్పత్తి చేసిన వోక్స్‌వ్యాగన్ బీటిల్ కార్లను జర్మనీలో ఉన్న వోక్స్‌వ్యాగన్ మిల్టన్ కీనెస్ పార్ట్ స్టోర్‌లో భద్రపరిచారు

ప్రపంచ ప్రసిద్దిగాంచిన బీటిల్ కారు గురించి ఆశక్తికరమైన విషయాలు

బీటిల్ నుండి మరొక ప్రసిద్ది గాంచిన కారు హెర్బీ సినిమాలోని రేస్ కారు. నెంబర్ 53 గల కారు అత్యంత ప్రసిద్దిగాంచింది, ముఖ్యంగా దీని కలర్ అందరికీ నచ్చింది.

Photo Source

ఆశక్తికరమైన విషయాలు....

Most Read Articles

English summary
10 Intresting Facts About Beetle Car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X