ఇండియా మీదుగా వెళ్లే పది అంతర్జాతీయ రైలు మార్గాలు

Written By:

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రైల్వేలలో నాలుగవ అతి పెద్ద రైల్వే ఇండియన్ రైల్వే, దేశీయంగానే కాకుండా దీనికి సమీపంగా ఉన్న దేశాలైన పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలకు రైల్వే సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ప్రస్తుతం మూడు విదేశాలకు రైల్వే సర్వీసులను నడుపుతోంది. ఇతర దేశాలతో కూడా సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తోంది. ఇండియన్ రైల్వే అంతర్జాతీయంగా రైల్వే లైన్లను పంచుకోనున్న దేశాల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

జోగ్బాని-బిరథ్ నగర్ లింక్ - నేపాల్

ఇండియా మరియు నేపాల్‌ను కలిపే రెండు రైల్వే రూట్లు ఉన్నాయి. అవి రక్సాల్ జంక్షన్ గుండా వెళ్లే బిహార్-సిర్సియా మరియు బిహార్ - ఖాజూరి మధ్య రైలు సర్వీసులు ఉన్నాయి.
Picture Credit: mapio

సంజౌతా ఎక్స్‌ప్రెస్ - పాకిస్తాన్

భారతీయుల దాయాదుల దేశానికి మధ్య కూడా ఒక రైల్వే కలదు, ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఏకైక రైల్వే లైను కూడా ఇదే. సంజౌతా ఎక్స్‌ప్రెస్ మరియు థార్ ఎక్స్‌ప్రెస్ రైలుగా పిలువబడే ఈ రైలు రెండు దేశాలకు రాకపోకలు సాగించే వాఘా బార్డర్ నుండి ఇండియాలోకి వస్తుంది.
Picture Credit: Najanaja/Wiki Commons

మైత్రి ఎక్స్‌ప్రెస్ - బంగ్లాదేశ్

అంతర్జాతీయ బార్డర్ మీదుగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మరియు భారత్‌లోని పశ్చిబెంగాల్‌లో గల కలకత్తాలను కలుపుతూ పోతుంది ఈ మైత్రి ఎక్స్‌ప్రెస్ రైలు. ప్రతి వారంలో ఆరు రోజుల పాటు సర్వీసులను అందిస్తుంది.
Picture Credit: Binodkumars/Wiki Commons

భూటాన్ రైల్వే - భూటాన్

భూటాన్ మరియు ఇండియాలను కలపడానికి ఇండియన్ రైల్వే రెండు దేశాల మధ్య రైల్వే నిర్మాణం చేయాలనే ప్రతిపాదనలో ఉంది.
Picture Credit: YouTube

మయన్మార్ రైలు - మయన్మార్

భారతదేశానికి సమీప దేశమైన మయన్మార్‌‌కు రైల్వే లైన్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. దీనిని మణిపూర్ నుండి బర్మా మధ్య నిర్మిస్తున్నారు.
Picture Credit: calflier001/Wiki Commons

వియత్నాం రైల్వే లైను - వియత్నాం

కేంద్ర ప్రభుత్వం మణిపూర్ నుండి వియత్నాంకు రైల్వే లైనును ప్రతిపాదిస్తున్నారు.
Picture Credit: Dragfyre/Wiki Commons

థాయిలాండ్‌ లైన్ - థాయిలాండ్

అంతర్జాతీయంగా రైల్వే సేవలు అందించాలని భారత దేశం తీసుకున్న జాబితాలో థాయిలాండ్ కూడా ఉంది.
Picture Credit: calflier001/Wiki Commons

చైనా రైల్వే లింక్

భారతీయ రైల్వే న్యూ ఢిల్లీ నుండి చైనాలోని కన్మింగ్‌ మధ్య హై స్పీడ్ రైళ్లను నడపడానికి ఆసక్తిగా ఉంది.
Picture Credit: Wiki Commons

మలేషియా రైల్వే లింక్

బర్మా మరియు ఇండియా మధ్య రైల్వే నిర్మాణం పూర్తయితే, ఇండియా నుండి బర్మా మీదుగా మలేషియాకు భవిష్యత్తులో రైలు సేవలు విస్తరించనున్నారు.
Picture Credit: calflier001/Wiki Commons

సింగపూర్ రైల్వే లింక్

బర్మా మరియు ఇండియా మధ్య రైల్వే నిర్మాణం పూర్తయితే, ఇండియా నుండి బర్మా మీదుగా సింగపూర్‌కు కూడా భవిష్యత్తులో రైల్వే సేవలు విస్తరించనున్నారు.
Picture Credit: EquatorialSky2/Wiki Commons

Source  

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రైలు #rail
English summary
10 International Train Routes From India
Please Wait while comments are loading...

Latest Photos