మీకు తెలియని పది మహీంద్రా వాహనాలు

Written By:

మహీంద్రా ఎన్నో సవత్సరాల క్రితం దేశీయంగా తమ కార్యకలాపాలు ప్రారంభించింది. అందులో చాలా వరకు స్పెషల్ యుటిలిటి వెహికల్స్ మరియు యుటిలిటి వెహికల్స్‌ను అందించేది. అయితే ఈ మధ్య కాలంలో నూతన ఉత్పత్తుల ద్వారా మంచి విజయాన్ని సాధించింది. కాని గతంలో మహీంద్రా అండ్ మహీంద్రా అద్బుతమైన వాహనాలను వినియోగంలోకి తెచ్చింది. అయితే ఇప్పటికే మార్కెట్ వర్గాలు వాటిని ఎప్పుడో మరిచిపోయాయి.

చాలా మందికి తెలియని మహీంద్రా అండ్ మహీంద్రా వారి పది వాహనాల గురించి నేటి కథనంలో తెలుసుకుందాం రండి.

లెజెండ్

మహీంద్రాలోని ఇతర ఎస్‌యువిలతో పోల్చితో లెజెండ్ పెద్దగా విజయం సాధించలేదు. ఈ లెజెండ్ వాహనాన్ని ఎమ్ఎమ్-540/550 ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. ఇది సాధారణ విల్లీస్ జీపు ఆధారంతో నిర్మించబడింది. ఈ స్థానాన్ని ఇప్పుడు థార్ ఎస్‌యువి ఆక్రమించింది.
Picture credit: lookautophoto

మహీంద్రా ఈ లెజెండ్ ఎస్‌యువిలో 58బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.5-లీటర్ సామర్థ్యం గల టుర్బో డీజల్ ఇంజన్‌ను అందించింది. దీని విడుదల సమయంలో ధర సుమారుగా 6 లక్షల వరకు ఉండేది. బహుశా ఈ కారణం చేత దీనిని ఎక్కువ మంది ఎంచుకోలేదోమో.. అందుకే ఇప్పుడు ఈ జాబితాలోకి వచ్చి చేరింది.
Picture credit: YouTube

అర్మాడా గ్రాండ్

అర్మాడా గ్రాండ్ మొదట్లో రెండు రూపాల్లో విడుదలైంది, ఒకటి సాధారణమైన వర్షన్ మరియు మరొకటి అత్యంత విలాసవంతమైన గ్రాండ్ వెర్షన్. అప్పట్లో సౌకర్య మరియు సుఖవంతమైన సౌకర్యాలను సాధారణ ఇంజన్‌తో కోరుకునే వారు దీనిని ఎక్కువగా ఎంచుకునే వారు.
Picture credit: mitula

ఈ అర్మాడా వాహనంలో సాధారణ అర్మాడాలో ఉన్న చతురస్రాకారంలో ఉన్న హెడ్ లైట్లకు బదులుగా గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ లైట్లు ఉన్నాయి. ఇది ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా లభించేది. విడుదలైన సమయం నుండి ఆశించిన స్థాయిలో విక్రయాలు జరపకపోవడంతో పెద్దగా క్లిక్ అవ్వలేదు.
Picture credit: cartrade

వాయేజర్

1990 లో మహీంద్రా అండ్ మహీంద్రా మిత్సుబిషితో చేతులు కలిపినపుడు లగ్జరీ ప్రయాణికుల కోసం దీనిని అభివృద్ది చేశాయి. అందుకు గాను దీనికి వాయేజర్ అనే పేరును కూడా ఖరారు చేసింది మహీంద్రా. అప్పటి భారతీయులకు తెలియని చాలా వరకు ఫీచర్లను ఇరు సంస్థలు ఈ వాయేజర్ లో పరిచయం చేశాయి.
Picture credit: usedgaadi

సాంకేతికంగా వాయేజర్ లగ్జరీ వాహనంలో 2.1-లీటర్ సామర్థ్యం గల టర్బో డీజల్ ఇంజన్ కలదు. అనేక సౌకర్యవంతమైన ఫీచర్లతో అప్పట్లో మార్కెట్లోకి అడుగుపెట్టిని దీనిని ఎంచుకోవడానికి ముందుకు వచ్చిన వినియోగదారుల సంఖ్య చాలా తక్కువ. అనతి కాలంలోనే మార్కెట్ నుండి దీనిని తొలగించడం కూడా జరిగిపోయింది.
Picture credit: usedgaadi

కమాండర్

మృదువైన టాప్‌తో వచ్చిన కమాండర్ జీపు విభిన్నమైన లేఔట్లలో అందుబాటులోకి వచ్చింది. సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి కూడా డిజైన్‌లో మార్పులు ఉండేవి. విభిన్న ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్నప్పటికీ దీనికి ఎలాంటి డోర్లు కూడా ఉండేవి కావు.
Picture credit: YouTube

సాంకేతికంగా కమాండర్ విభిన్న ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉండేది. అవి, 650డిఐ నుండి 750 డిపి వరకు. ఇందులో 650 డిఐ మోడల్ 50బిహెచ్‌పి పవర్ మరియు 147ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 2.5-లీటర్ ఇంజన్‌ను కలిగి ఉండేది. 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో అందుబాటులో ఉండే కమాండర్‌లో 2-వీల్ మరియు 4-డ్రైవ్ ఆప్షన్లు ఉండేవి.
Picture credit: STV/Flickr  

ఇన్వాడర్

బొలెరో వాహనం యొక్క కూల్ వర్షన్ ఇన్వాడర్ అని చెప్పవచ్చు. వెనుక వైపున మృదువైన రూఫ్ టాప్ కలిగి ఉండే ఇది కేవలం 2 డోర్లను మాత్రమే కలిగి ఉంటుంది. మారుతి జిప్సీ మోడల్‌కు కాస్త దగ్గరి పోలికలతో ఉంటుంది. అప్పట్లో దీని ధర రూ. 5.5 లక్షలుగా ఉండేది.
Picture credit: mitula

సాంకేతికంగా మహీంద్రా ఈ ఇన్వాడర్‌లో 2.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌ను అందించింది. ఇది గరిష్టంగా 63బిహెచ్‌పి పవర్ మరియు 177ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసేది. మహీంద్రా దీనిని అనేక స్పెషల్ ఎడిషన్లుగా పరిచయం చేసింది మరియు సెలబ్రిటీలకు దీనిని విభిన్న కస్టమైజేషన్స్ రూపంలో కూడా అందించింది.
Picture credit: productioncars

మహీంద్రా ఆక్స్

మహీంద్రా అండ్ మహీంద్రా ఆక్స్ అనే వాహనాన్ని సాధారణంగా ఇండియన్ మిలిటరీ అవసరాల కోసం నిర్మించింది. ప్రపంచ వ్యాప్తంగా హమ్మర్ వాహనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దేశీయంగా ఈ ఆక్స్ వాహనానికి అంతటి ప్రాముఖ్యత కలదు. అయితే దీనిని సాధారణ మార్కెట్ అవసరాల కోసం అందుబాటులో ఉంచలేదు.
Picture credit: carsbase

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక వాహన ప్రదర్శన వేదికల మీద దీనిని ప్రదర్శించడం జరిగింది. సాంకేతికంగా దీనిని 2.7-లీటర్ డీజల్ మరియు 4.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఆప్షన్‌లలో అందించింది. వీటికి 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు -స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం ఉండేది.
Picture credit: carsbase

మహీంద్రా బోట్లు

మహీంద్రా కేవలం వాహనాలకు మాత్రమే కాకుండా బోట్ల తయారీకి కూడా తమ సామ్రాజ్యాన్ని విస్తరించింది. నీటి తలం మీద విభిన్న అవసరాలకు ఉపయోగపడే అన్ని రకాల బోట్లను నిర్మించడంలో మహీంద్రా ప్రావీణ్యం సంపాదించింది. సైజును బట్టి ఒడిసియా 23, 33 మరియు 35 అనే విభిన్న మోడళ్లను విడుదల చేసింది.

నీటి తలం మీద గస్తీ కాయడానికి కమర్షియ్ బోట్లను, రక్షణ అవసరాల కోసం మరియు ప్యాసింజర్ అవసరాల కోసం బోట్లను నిర్మించడం కూడా మహీంద్రా మొదలు పెట్టింది. అంతే కాకుండా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసి డిజైన్ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది. వినోదం కోసం ఉపయోగించే బోట్లు 150 నుండి 315 బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్‌లను అందించింది.

ఏటివి లు

మహీంద్రా అండ్ మహీంద్రా ఎమ్‌ప్యాక్ట్ (mPACT) అనే సంస్థను ప్రారంభించింది. ఇది కేవలం ఏటివి లను మాత్రమే తయారు చేస్తుంది. ఏటివి - ఆల్ టెర్రైన్ వెహికల్ అనగా అన్ని భూబాగాల్లో నడవగలిగే వాహనాలు. ఆల్ టెర్రైన్ వెహికల్స్‌కు అత్యంత పేరుగాంచిన పొలారిస్ మీద పోటీగా వీటిని అందుబాటులోకి తెచ్చింది.

అయితే ప్రస్తుతం అమెరికా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా ఇంకా పరిచయం కావాల్సి ఉంది. ఇవి 750 నుండి 1000సీసీ సామర్థ్యం గల ఇంజన్‌లతో అందుబాటులో ఉంటాయి. విభిన్న నైసర్గిక స్వరూపాల కోసం మొత్తం 11 ఏటివి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా ఎమ్‌జిపి30

కార్లు, ఎస్‌యులు, ట్రక్కులు, లారీలు, బస్సులు, బోట్లతో పాటు బైకులను కూడా తయారు చేస్తోందని విషయం అందరికీ తెలిసిందే. సాధారణ బైకులను మాత్రమే కాదు మోటో 3 రేసర్ బైకులను కూడా పరిచయం చేసింది. మహీంద్రా గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఎమ్‌జిపి30 అనే బైకును ప్రదర్శించింది.

మహీంద్రా ఇప్పటికే కొన్ని రేసింగ్ బృందాలకు తమ మోటో రేసింగ్ ఉత్పత్తులను సరఫరా చేసింది. మరియు ఈ బైకుల్లో 250సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉండేది. ఇది గరిష్టంగా 50బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసేది. మహీంద్రా యురోపియన్ రేసింగ్ ప్రధాన కేంద్రం ఇటలీలో వీటిని అభివృద్ది చేసింది.

జెంజీ

జెంజీ అనేది విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ. దీనిని ఇప్పుడు మహీంద్రా తనలో కలుపుకుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. జెంజీ మహీంద్రా టూ వీలర్స్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైకులను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం మహీంద్రా ఈ బ్రాండ్ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో అందుబాటులో ఉంచింది. దేశీయ విపణికి వీటిని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.

జెంజీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 48కిలోమీటర్లుగా ఉంది. మరియు 2.5-గంటల్లో 0 నుండి 100 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఇది స్పోర్ట్ మరియు ఈజీ రైడింగ్ అనే రెండు మోడ్‌లలో అందుబాటులో ఉంది. ఒక్క సారి పూర్తి ఛార్జింగ్‌తో 48 కిమీలు ప్రయాణించవచ్చు.

భారతీయులు మరిచిపోయిన బైకులు:
కొన్నేళ్ల క్రితం ఇండియన్ మార్కెట్లోకి విడుదలై మంచి అమ్మకాలు సాధించిన బైకులు గురించి ఎప్పుడైనా విన్నారా...? అలాంటి బైకులను ఇప్పుడు అందరూ మరచిపోయారనే చెప్పాలి. భారతీయులు మరిచిపోయిన బైకుల గురించి డ్రైవ్‌ స్పార్క్ తెలుగు పాఠకుల కోసం ఆఫ్ బీట్ శీర్షిక ద్వారా ప్రత్యేక కథనం.... 

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, December 21, 2016, 16:05 [IST]
English summary
10 Mahindra Vehicles You Dont Know About
Please Wait while comments are loading...

Latest Photos