మీ జీవితకాలంలో మనదేశంలో చేయాల్సిన టాప్ 10 రోడ్ ట్రిప్స్

By Ravi

కొందరి జీవితాల్లో రోడ్ ట్రిప్ ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే, మరికొందరి జీవితంలో ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సరిగ్గా ప్లాన్ చేసుకొని, సురక్షితంగా రోడ్ ట్రిప్ పూర్తి చేసుకుంటే, ఆ ప్రయాణంలోని ప్రతి మజిలీ ఓ అందమైన అనుభూతిగా మారుతుంది.

భారతదేశంలో కెల్లా 10 పొడవైన జాతీయ రహదారులు

విదేశాల్లోనే కాదు మనదేశంలో కూడా సుందరమైన రహదారులు ఎన్నో ఉన్నాయి. ఆయా రహదారులపై లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, ఇక కన్నులు ప్రకృతిని క్యాప్యూచర్ చేయటంలో బిజీ బిజీగా ఉండిపోతాయి.

జీవితంలో చూసిన తీరాల్సిన రోడ్లు (వరల్డ్ వైడ్)

రోడ్లపై లాంగ్ డ్రైవ్‌కి వెళ్తూ చుట్టు పక్కల ఉన్న ప్రకృతిని తనివితీరా ఆస్వాదిస్తూ ముందు సాగిపోతుంటే, ఆ అనుభూతిని చెప్పడానికి మాటలు చాలవు. ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఈ రకమైన అనుభూతికి లోనై ఉంటారు. మనదేశంలో ఉన్న ఇలాంటి అద్భుతమైన రోడ్లపై మీ జీవితకాలంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిన టాప్ 10 రోడ్లను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

పంబన్ బ్రిడ్జ్

పంబన్ బ్రిడ్జ్

రామేశ్వరంలోని పంబన్ ద్వీపాన్ని తమిళనాడు రాష్ట్రాన్ని కలుపుతూ సముద్రంపై నిర్మించిన ఈ పంబన్ బ్రిడ్జ్‌పై రోడ్డు ప్రయాణం ఓ అందమైన అనుభూతి. నీలి నీటితో నిండిన సముద్రంపై నిర్మించిన ఈ అత్యంత పొడవైన బ్రిడ్జ్‌కు సంబంధించి ఓ పుకారు కూడా వినికిడిలో ఉంది. అదేంటంటే, ఈ బ్రిడ్జ్‌ను ఆపరేట్ చేసే క్రమంలో వేలాది మంది ప్రాణాలను కాపాడేందుకు ఓ వ్యక్తి తన కుమారుడి ప్రాణాలను పణంగా పెట్టినట్లు చెప్పుకుంటుంటారు.

Picture Credit: Deepak Bansi via Wiki Commons

మనాలీ-లెహ్ హైవే

మనాలీ-లెహ్ హైవే

రోడ్డపై తెల్లటి హిమపాతాన్ని చూడటానికి మనం విదేశాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. మనదేశంలో హిమాలయాల అంచున ఉండే, మనాలీ-లెహ్ రహదారిపై రోడ్ ట్రిప్ చేస్తే చాలు, ఇలాంటి దృశ్యాన్ని అడుగడుగునా చూడొచ్చు. పచ్చని ప్రకృతి తెల్లటి దుప్పటి కప్పుకున్నట్లుగా ఉంటుంది ఇక్కడి వాతావరణం.

Picture Credit: Biswarup Ganguly via Wiki Commons

ఎన్‌హెచ్ 212

ఎన్‌హెచ్ 212

కేరళలోని కోళికోడ్ నుంచి మైసూర్ మీదుగా కర్ణాటకలోని కొల్లెగల్ ప్రాంతాలను కలిపే ఈ 212వ జాతీయ రహదారి కర్ణాటకలోని బండిపూర్ టైగర్ రిజర్వ్ గుండా సాగిపోతుంది. ఈ మార్గంలో మీరు దండకారణ్యాలతో పాటుగా భీకరమైన ఏనుగులను, వివిధ అటవీ జంతువులను మరియు ప్రకృతి అందాలను తిలకించవచ్చు.

Picture Credit: Kamaljith K V via Flickr

చంఢీఘడ్-మనాలీ హైవే

చంఢీఘడ్-మనాలీ హైవే

భోజన ప్రియులు, ప్రకృతిని తమ కెమెరాల్లో బంధించాలనుకునే ఫొటో గ్రాఫర్లకు ఈ రూట్ ఓ అద్భుతమైన గమ్యం. దారిపొడవునా కనిపించే వివిధ రెస్టారెంట్లు/డాబాలలో లభించే విభిన్న రకాల వంటకాలు భోజన ప్రియులకు నోరూరిస్తాయి.

Picture Credit: Biswarup Ganguly via Wiki Commons

లెహ్-శ్రీనగర్ హైవే

లెహ్-శ్రీనగర్ హైవే

ప్రయాణం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో సందర్శించాల్సిన టాప్ 5 ప్రదేశాలలో లెహ్-లడక్ రూట్ ఒకటి. లెహ్ నుంచి శ్రీనగర్‌కు బైక్‌పై వెళ్తుంటే, ఆ అనుభూతిని వివరించడానికి మాటలు సరిపోవు. అలాగే, ఈ రూట్‌లోని ప్రకృతి అందాలను చూడటానికి రెండు కన్నులు సరిపోవు.

Picture Credit: sushmita balasubramani

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్

తీర్థయాత్రలంటే ఇష్టపడే వారికి మహాబలేశ్వర్ రోడ్ ట్రిప్ ఓ మధురమైన జ్ఞాపకంగా మిగులుతుంది. ఉత్తర కర్ణాటక జిల్లాలో ఉన్న మహాబలేశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివుని ఆత్మలింగం ఉంటుంది. ఈ దేవాలయాన్ని కాశీ లేదా వారణాసి దేవాలయాలతో సమంగా భావిస్తారు. పవిత్రమైన ఏడు ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పూజిస్తారు.

Picture Credit: ganuullu via Flickr

కళ్యాణ్ నిర్మల్ హైవే

కళ్యాణ్ నిర్మల్ హైవే

మహారాష్ట్ర మరియు తెలంగాణా రాష్ట్రాల మీదుగా సాగిపోయే ఈ కళ్యాణ్ నిర్మల్ హైవే‌లో అడుగడునా ప్రకృతి మనకి స్వాగతం పలుకుతూ ఉంటుంది. ప్రతి ప్రాంతంలో విభిన్న సంసృతి, సాంప్రదాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.

Picture Credit: Anand Balasubramaniam via Flickr

రోహ్‌తంగ్ పాస్

రోహ్‌తంగ్ పాస్

మనాలీ నుంచి 51 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రోహ్‌తంగ్ పాస్ లెహ్ జాతీయ రహదారిలో అత్యంత కీలకమైన మార్గం. ఈ రోహ్‌తంగ్ పాస్ రూట్ అడ్వెంచర్లతో కూడుకున్నది. మంచు రోడ్లు, ఎత్తు పల్లలాతో కూడిన రోడ్లు ఎంతో అందగా ఉంటాయి.

Picture Credit: Achiwiki356 via Wiki Commons

ముంబై-పూనే రూట్

ముంబై-పూనే రూట్

స్పీడ్ అంటే ఇష్టపడే వారికి ముంబై పూనే ఎక్స్‌ప్రెస్ వే బెస్ట్ చాయిస్. ఇది భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ సిక్స్-లేన్ (6 లైన్ల) రోడ్. ఈ రోడ్డుపై ప్రకృతి కన్నా ఇతర వాహనాల వేగమే మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Picture Credit: Nikhil.kawale

ఓల్డ్ సిల్క్ రూట్

ఓల్డ్ సిల్క్ రూట్

ఓల్డ్ సిల్క్ రూట్

జెలెప్ లా పాస్ మీదుగా భారతదేశాన్ని, టిబెట్‌ను కలిపే రహదారి ఈ ఓల్డ్ సిల్క్ రూట్. ఇదొక పురాతన కాలపు హిల్లీ రోడ్. కొండలు, గుట్టలు మీదుగా సాగిపోయే ఈ రోడ్డు ప్రయాణం ఓ మధురానుభూతిగా నిలిచిపోతుంది. ఈ రోడ్డు మనకు ప్రాచీన చరిత్రను కూడా పరిచయం చేస్తుంది.

Picture Credit: hceebee via Flickr

పూరీ-కోణార్క్ రూట్

పూరీ-కోణార్క్ రూట్

ఇది కూడా తీర్థయాత్రలంటే ఇష్టపడే వారికి ఓ చక్కటి రూట్. పూరీ జగన్నాథుని సందర్శించుకోవాలని బయలుదేరే వారు కేవలం ఆ పుణ్యక్షేత్రాన్నే కాకుండా మార్గమధ్యంలోని ప్రకృతి దేవత అందాలను కూడా ఆస్వాదించవచ్చు.

Picture Credit: Manasa Malipeddi via Flickr

Most Read Articles

English summary
Here is a list of some of the India's most craziest roads and bridges which we think everyone should experience once in their lifetime. Some of the roads are beautiful and others are outright scary. Sit back and start clicking through the slides.
Story first published: Monday, August 25, 2014, 10:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X