పది సూపర్ కార్లను సీజ్ చేసిన చెన్నై పోలీసులు: అసలేం జరిగింది.....?

పోర్షే, లాంబోర్గిని మరియు ఫెరారీ సంస్థలకు చెందిన అత్యంత ఖరీదైన సుమారు పది టాప్ ఎండ్ కార్లను చెన్నై పోలీసులు సీజ్ చేసారు. 30 ఏళ్ల లోపు వయస్సున్న వ్యక్తులు చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు మీద రేసింగ్ చేస్తున్నారని వారిని అదుపులోకి తీసుకుని, ఆ పది కార్లను సమీప పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అక్కరాయ్ ప్రాంతానికి సమీపంలో సూపర్ కార్ల ఓనర్లు, అనధికారిక స్ట్రీట్ రేసింగ్ చేస్తున్నందుకు గాను వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఓ కార్ల తయారీ సంస్థ నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ అనే ఈవెంట్ లో పాల్గొన్నట్లు తెలుపుతున్నారు.

అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, లాంబోర్గిని కారును నడుపుతున్న వ్యక్తి రాఘవ్ క్రిష్ణన్ ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్ పాదం మీద కారును నడిపినందుకు అతడిని అరెస్ట్ చేశారు.

ర్యాష్ మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు దాను రాఘవ క్రిష్ణన్ మీద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసు వివరణ ఇచ్చాడు. ఈస్ట్ కోస్ట్ రహదారిలో విపరీతమైన శబ్దాలు చేసుకుంటూ బైకులు మరియు సూపర్ కార్లతో రేసింగ్ చేసున్నారని అక్కడ పబ్లిక్ నుండి పోలీసులకు సమాచారం అందించారు. ఈ తరుణంలో ఆది వారం ఉదయం వాహన తనిఖీ చేపట్టండం జరిగింది.

అక్కరాయ్ సమీపంలో ఆదివారం ఉదయం పోలీసులు వాహన తనిఖీ చేపట్టినపుడు ఈ వాహనాలు ఆగకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ కార్లను నిలువరించేందుకు పోలీసు బృందం తీవ్ర ప్రయత్నాలు చేసి చివరికి ఉతండి టోల్ గేట్ సమీపంలో వాహనాలను పట్టుకున్నారు.

నీలంకరాయ్ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ సుందర్ రాజన్ మాట్లాడుతూ, కార్లను నడుపుతున్న వ్యక్తుతులు సంభందిత పత్రాలను చూపించడానికి నిరాకరించారు, పోలీసులకు కోపరేట్ చేయకుండా ప్రాంతీయ రాజకీయ నాయకుల పేర్లను చెప్పుకొచ్చారని వివరించాడు.

ర్యాష్ మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ పాదచారులను ప్రమాదానికి గురిచేస్తున్నారని ఇక్కడి నివాసితుల నుండి ఫిర్యాదు వచ్చినట్లు మీడియాతో తెలిపారు.

ఇక సూపర్ కార్ల డ్రైవర్ల విషయానికి వస్తే, సూపర్ కార్లకు సంభందించిన ఓ వీడియోను ఫేస్‌బుక్ మాద్యమంలో అప్‌లోడ్ చేసి, ఇవి సూపర్ కార్లు కాబట్టి గంటకు 50కిలోమీటర్ల వేగంతో నడిపినా కూడా రేసింగ్ శబ్దం వస్తుంది. అయితే కొందమంది ప్రజలు దీనిని రేస్‌గా భావించి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.

అద్బుతం: లీటర్ నీటితో 300 మైళ్ల మైలేజ్
నీటితో నడిచి, నీటి ఆవిరిని పొగలా వెదజల్లే మోటార్ సైకిల్‌ గురించి ఎప్పుడైనా విన్నారా...? ఓక్క లీటర్ నీటితో 300 మైళ్ల మైలేజ్ ఇవ్వగిలిగే ఈ బైకు గురించి పూర్తి వివరాలు..

లాంబోర్గిని సూపర్ కార్ల ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి, మీకు నచ్చిన ఫోటోను డౌన్ లోడ్ చేసుకోండి....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, February 27, 2017, 14:31 [IST]
English summary
Ten Sports Cars Impounded For Racing Chennai
Please Wait while comments are loading...

Latest Photos