పాత భారతీయ కార్ల గురించి మనం మిస్ అయ్యే 10 అంశాలు

By Ravi

భారత ఆటోమొబైల్ రంగంలో కార్లు అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. ప్రస్తుతం మనకు మోడ్రన్ కార్లలో టచ్ స్క్రీన్స్, మోడ్రన్ ఎలక్ట్రానిక్స్, కీలెస్ ఎంట్రీ, కార్బన్ ఫైబర్ బాడీ, అధునాతన సేఫ్టీ ఫీచర్స్, డ్రైవర్ అవసరం లేకుండా కారును కంట్రోల్‌లోకి తెచ్చుకునే ఆన్-బోర్డ్ కంప్యూటర్ ఇలా అనేక అంశాలు అందుబాటులో ఉన్నాయి.

కానీ, పురాతన భారతీయ కార్లలో ఇలాంటి మోడ్రన్ ఫీచర్లు అందుబాటులో ఉండేవి కావు, అయినప్పటికీ డ్రైవర్లు ఆయా కార్ల డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేసే వారు. మరి ప్రస్తుత కార్లతో పోల్చుకుంటే, పాత భారతీయ కార్ల నుంటి మనం మిస్ అయిన 10 విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

1. ధృడమైన, చవకగా రిపేరు చేసుకోదగిన బాడీ

1. ధృడమైన, చవకగా రిపేరు చేసుకోదగిన బాడీ

ఈ విషయంలో ముందుగా గుర్తుకు వచ్చేది అంబాసిడర్, ఫియట్ పద్మిని వంటి కార్లు. ఇవి ధృడమైన బాడీని కలిగి ఉన్నప్పటికీ, వాటి మరమ్మత్తుకు అయ్యే ఖర్చు మాత్రం అందుబాటులోనే ఉండి. కానీ, ప్రస్తుత మోడ్రన్ కార్లలో చిన్న డెంట్ తీయటానికి కూడా భారీగా ఖర్చు అవుతోంది.

2. వెనుక సీటులో కంఫర్ట్

2. వెనుక సీటులో కంఫర్ట్

మోడ్రన్ కార్లలో కాంపాక్ట్ పేరిట వెనుక సీటు స్థలాన్ని కుదించి వేస్తున్నారు. అదే పాత కార్లను గమనిస్తే, అవి పొడవుగా ఉండి వెనుక సీటులో చాలా విశాలమైన స్థలం ఉండేది. ఇప్పటి కార్లలో ఆ కంఫర్ట్ కనిపించడం లేదు.

3. ఫుల్ సైజ్ స్పేర్ వీల్

3. ఫుల్ సైజ్ స్పేర్ వీల్

పాత భారతీయ కార్లలో ప్రాపర్ స్పేర్ వీల్ లభ్యమయ్యేది. టైరు పంక్చర్ అయినప్పుడు స్పేర్ వీల్‌ను మార్చుకుంటే, సదరు టైరు పంక్చర్ సరి చేసుకున్న తర్వాత ఒరిజినల్ వీల్ అమర్చుకోవాల్సిన అవసరం లేకుండానే స్పేర్ వీల్‌తోనే ముందుకు సాగిపోవచ్చు. అసలు అప్పటి స్పేర్ వీల్‌కి ఒరిజినల్ వీల్‌కి పెద్దగా వ్యత్యాసం తెలిసేది కాదు. కానీ మోడ్రన్ కార్లలో ఈ సౌకర్యం ఉండట్లేదు.

4. ఎలాంటి ఎలక్ట్రానిక్ సాయం ఉండేది కాదు

4. ఎలాంటి ఎలక్ట్రానిక్ సాయం ఉండేది కాదు

ఇప్పటి తరం కార్లలో మాదిరిగా అప్పటి కార్లలో పలు రకాల ఎలక్ట్రానిక్ సదుపాయాలు ఉండేవి కావు. ఇంజన్ గురించి కానీ, ఇతర సాంకేతిక విషయాల గురించి డ్రైవర్‌ను అప్రమత్తం చేసే లేదా డ్రైవరుకు సమాచారం అందించే సాంకేతిక వ్యవస్థ అప్పటి కార్లలో ఉండేది కాదు. అయినప్పటికీ, డ్రైవర్లు మాత్రం తమ కార్ డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేసేవారు.

5. తేలికైన కార్లు

5. తేలికైన కార్లు

అప్పట్లో కొన్ని రకాల కార్లు చాలా తేలికగా ఉండేవి. అందుకే వాటిలో చిన్నపాటి ఇంజన్లను అమర్చి ఎక్కువ మైలేజీని వచ్చేలా తయారీదారులు జాగ్రత్తలు తీసుకునేవారు. లైట్ వెయిట్ కార్లను డ్రైవ్ చేయటంలో ఉండే ఫన్నే వేరు.

6. సులువుగా రిపేర్

6. సులువుగా రిపేర్

అప్పట్లో కార్లను ఏ మెకానిక్ అయినా సరే సులువుగా రిపేర్ చేయగలిగే వాడు. కానీ, ప్రస్తుత మోడ్రన్ కార్ల మరమ్మత్తును నిపుణులైన కంపెనీ సర్వీస్ ప్రతినిధులు మాత్రమే చేయగలుగుతున్నారు.

7. ప్రాపర్, యాక్చువల్ కీస్

7. ప్రాపర్, యాక్చువల్ కీస్

ప్రస్తుత తరం కార్లలో కీ అవసరం లేకుండానే ఇంజన్‌ను స్టార్ట్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కానీ అప్పటి తరం కార్లలో మాత్రమే కారును స్టార్ట్ చేయాలంటే తప్పనిసరిగా కారు కీ అవసరమయ్యేది. కారును ఇగ్నిషన్‌లో ఉంచి స్టార్ట్ చేస్తేనే కారు స్టార్ట్ అయ్యేది. కానీ మోడ్రన్ కార్లలో కారు కీని పాకెట్‌లో ఉంచుకొని పుష్ బటన్ సాయంతో ఇంజన్ ఆన్ చేయవచ్చు.

8. సింపుల్ ఇంటీరియర్స్

8. సింపుల్ ఇంటీరియర్స్

పాత తరం కార్లలో ఇంటీరియర్స్ చాలా సింపుల్‌గా, క్లిష్టతరం కాకుండా ఉండేవి. కానీ, మోడ్రన్ కార్లను గమనిస్తే ఇంటీరియర్స్ స్పేస్ కోసం కార్ మేకర్లు అన్వేషిస్తుంటారు. స్పేస్ దొరికిన ప్రతిచోటా ఏదో ఒక ఫీచర్‌ని జోడించేస్తుంటారు.

9. మ్యాన్యువల్ గేర్‌బాక్స్

9. మ్యాన్యువల్ గేర్‌బాక్స్

మోడ్రన్ కార్లలో క్రమంగా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాయమవుతూ వస్తోంది. ప్రస్తుత తరం కార్లలో ఆటోమేటిక్, ఏఎమ్‌టి అంటూ డ్రైవర్ గేర్‌బాక్స్‌ను ఎక్కువగా ఉపయోగించాల్సిన పనిలేకుండా కార్లు తయారవుతున్నాయి. పాతతరం కార్లలో ఎక్కువగా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన కార్లు మనకు కనిపించేవి.

10. సన్నటి ఏ పిల్లర్స్

10. సన్నటి ఏ పిల్లర్స్

ప్రస్తుత తరం కార్లలో ఏ పిల్లర్స్ పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. పాత తరం కార్లను గమనిస్తే, వాటి ఏ పిల్లర్ సన్నగా ఉండి, మలుపుల వద్ద డ్రైవర్ విజన్ బ్లాక్ అయ్యేది కాదు. కానీ ఇప్పటి కార్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.

Most Read Articles

English summary
Taking a look back in the days, anyone ever wondered what ever happened to the good old cars and the way driving used to be? Well, here is a list of 10 things that we really miss about Indian cars:
Story first published: Monday, March 23, 2015, 18:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X