ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉంటే చాలు ఈ దేశాలలో డ్రైవింగ్ చేయవచ్చు

By N Kumar

ఒక్కో దేశంలో ఒక విధమైన నియమాల మధ్య డ్రైవింగ్ లైసెన్స్‌లను అనుమతి చేస్తారు. అవి ఆ యా దేశాల నియమావళి క్రింద ఉంటాయి. అందులో భారత దేశం ఒకటి. ఇండియాలో వాహనం నడిపే ప్రతి ఒక్కరి వద్ద భారత రవాణా విభాగం జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి.

ఇండియా జారీ చేసే లైసెన్సుతో భారత్‌లో ఎక్కడైనా డ్రైవింగ్ చేయవచ్చు. కాని ఇదే లైసెన్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాలలో డ్రైవింగ్ చేయడానికి అనుమతులు ఉన్నాయి. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఉన్న 14 దేశాల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

14. ఫిన్‌లాండ్

14. ఫిన్‌లాండ్

యూరప్ దేశాలలో ఒక భాగమైన దేశం ఫిన్‌లాండ్‌లో మన భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ద్వారా అక్కడ డ్రైవింగ్ చేయవచ్చు.

13. నార్వే

13. నార్వే

యూరప్‌లో మరో అందమైన దేశం నార్వే. ఇది యూరప్‌లో ముఖ్య పర్యాటక దేశంగా ఉంది. ఇందులో మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలన నడపవచ్చు.

12. స్పెయిన్

12. స్పెయిన్

యూరప్‌లో మరొక దేశం స్పెయిన్ ఇందులో కూడా మన దేశ లైసెన్స్‌తో వాహనాలను డ్రైవ్ చేయవచ్చు. ఇందులో బార్సిలోనా మరియు మాడ్రిడ్ ప్రముఖ నగరాలు.

11. కెనడా

11. కెనడా

అమెరికా భూ భాగానికి ఉత్తర భాగంలో ఉన్న అతి విశాలమైన దేశం కెనడా. ఇక్కడ రవాణా నియమాళకు సంభందించి దాదాపుగా భారత దేశపు నియమాళను పోలి ఉంటాయి. కెనడా రాజధాని నగరం ఒట్టావా మరియు ప్రపంచంలో అతి పెద్ద జలపాతం నయగారా జలపాతం కెనడాలో కలదు.

10. ఇటలీ

10. ఇటలీ

మధ్యధరా సముద్రానికి ఉత్తర భాగన ఉన్న ఇటలీ లో మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడపడానికి అనుమతులు ఉన్నాయి.

09. మారిషస్

09. మారిషస్

మడగాస్కర్ దేశానికి తూర్పున ఉన్న రెండు అందమైన ద్వీపాలు కలవు. వీటినే మారిషస్ అంటారు. పర్యాటకానికి ఈ దేశం ప్రత్యేకం. ఏడాది పొడవునా ఈ దేశంలో మీరు మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేయవచ్చు.

08. సౌత్ ఆఫ్రికా

08. సౌత్ ఆఫ్రికా

మీరు పొందిన డ్రైవింగ్ లైసెన్స్ ప్రాంతీయ భాషలో కాకుండా ఆంగ్లంలో ఉన్నట్లయితే ఎటువంటి కారణాలు లేకుండా మీరు సౌత్ ఆఫ్రికాలో వాహనాలను నడపవచ్చు.

07. న్యూజిలాండ్

07. న్యూజిలాండ్

న్యూజిలాండ్ దేశం భూ భాగపు అడ్వెంచర్లకు ప్రత్యేకం. మీ లైసెన్స్‌‌లో మీరు ఏయే వాహనాలను నడపవచ్చు అని స్థానికి రవాణా కార్యాలయాధికారులు పొందుపరిచిన వివరాల ప్రకారం ఆయా వాహనాలను మాత్రమే ఇక్కడ నడపాల్సి ఉంటుంది.

06. స్విట్జర్లాండ్

06. స్విట్జర్లాండ్

అందమైన ప్రదేశాలు మరియు కంటికి ఇంపుగా ఉండే ప్రకృతి రమణీయ ప్రదేశాలకు నిలయం స్విట్జర్లాండ్. ఇందులో భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌లకు అనుమతి కలదు.

05. ఆస్ట్రేలియా

05. ఆస్ట్రేలియా

దేశీయంగా ప్రభుత్వం జారీ చేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఉన్నచో, మీరు ఆస్ట్రేలియాలో డ్రైవ్ చేయవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి జారీ చేసిన లైసెన్స్ ఆంగ్లంలో ఉండాలి.

04. ఫ్రాన్స్

04. ఫ్రాన్స్

ఫ్రాన్స్ దేశ వ్యాప్తంగా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో చక్కర్లు కొట్టవచ్చు. కాని మీ లైసెన్స్ ఇంగ్లీషు నుండి ఫ్రాన్స్‌ భాషలోకి మార్పిడి చేయించుకోవాలి.

03. అమెరికా (యుఎస్‌ఎ)

03. అమెరికా (యుఎస్‌ఎ)

భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌తో ఏడాది పాటు ఎటువంటి నిబంధనలు లేకుండా డ్రైవ్ చేయవచ్చు. అయితే దీనితో పాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ వారి ప్రాంతీయ భాషలో తప్పకుండా ఉండాలి.

02.ఇంగ్లాండ్

02.ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లో భాగంగా ఉన్న దేశాలలో మన భారత ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్‌తో ఏడాది పాటు ఎటువంటి అనుమతులు లేకుండా డ్రైవింగ్ చేయవచ్చు.

01. జర్మనీ

01. జర్మనీ

ఎక్కువ మంది ఇండియా నుండి జర్మనీకి పయనమవుతుంటారు అలాంటి వారి వద్ద భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే జర్మనీలో ఆరు నెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు. మీ లైసెన్స్ ప్రాంతీయ భాషలో ఉంటే దానిని ఆంగ్లంలోకి మార్పిడి చేయించుకోవాలి.

Most Read Articles

English summary
14 Countries You Can Use Your Indian Driving License
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X