పాత కార్ల విడిభాగాల నుండి 15 అత్భుతమైన ఫర్నీచర్స్

By Anil

పాతవి అని చులకనగా ప్రక్కకు పడేస్తే తుప్పుపట్టడం ఖాయం. కాని వాటిని ప్రత్యేక శ్రద్ద తీసుకుని వాటికి అత్బుతమైన రూపం ఇస్తే అచ్చం ప్రాణం ఉన్న వాటిలా ఎంతో అలంకరణగా ఉంటాయి. ఇంటికి కావాల్సిన కొత్త ఫర్నీచర్ కొనాలంటే వేలకు వేలు డబ్బులు ధార పోయాలి. అదే ఇలాంటి వాటి ట్రై చేయండి చూడటానికి కొంచెం కొత్తగా వెరైటీగాను కనిపిస్తాయి.

అసలు ఇంతసేపు వేటి గురించి చెబుతున్నారు అని అనుకుంటున్నారా ? కార్లలో పాత విడి, పనికి రాని విడి భాగాలతో అత్భుతమైన ఫర్నీచర్స్ తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసిన 15 అత్భుతమైన కళాఖండాలను క్రింది కథనం ద్వారా చూపిస్తున్నాము చూడండి, నచ్చితే మీరు అలాంటి వాటిని ట్రై చేయండి.

1. స్నూకర్ టేబుల్

1. స్నూకర్ టేబుల్

నిజంగా చెప్పాలంటే ఇది పాశ్చాత్త ప్రజల ఆట కాని సినిమాల ప్రభావం వలన ఇది మన దేశానికి కూడా పాకిపోయింది. కాని ఈ ఆటకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ కూడా ఉంది. చూడటానికి ఎంతో అత్భుతంగా ఉన్న ఈ స్నూకర్ గేమ్ టేబుల్ మొత్తాన్ని ఫోర్డ్ మస్టాంగా కారు విడి పరికరాలతో తయారు చేశారు.

2. సోఫా

2. సోఫా

ఈ సోఫాను చూశారా షెవర్లే మోటార్స్ వారి పాత కాలం రోజుల్లోని అత్భుతమైన కారు వెనుక వైపు డిజైన్ ఇది. అయితే అప్పట్లో దీని డిజైన్ భవిష్యత్తు డిజైన్‌ను గుర్తు చేయవచ్చు కాని అదే డిజైన్ ఇలా సోఫాలా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు కదా ...?

3. కాఫీ టేబుల్

3. కాఫీ టేబుల్

ఇంట్లో మనకు కావాల్సిన అందమైన కాఫీ టేబుల్స్‌ను తయారు చేయించు కోవడం పెద్ద కష్టమైన పని కాదు. కాని పూర్తిగా నుజ్జునుజ్జు అయిన ఫెరారి కారులోని విడి భాగాల ద్వారా కాఫీ టేబుల్‍‌‌ను తయారు చేయడం కాస్త ఇబ్బందే. అయినప్పటికీ తయారు చేశారు .

4. మరొక కాఫీ టేబుల్

4. మరొక కాఫీ టేబుల్

బాగా చెదిరిపోయిన ఫెరారి కారు భాగాలతో తయారైన కాఫీ టేబుల్‌ని చూశాం. మరి జాగ్వార్ పాత ఇంజన్‌కు బాగా మెరుగులు దిద్ది తయారు చేసిన కాఫీ టేబుల్‌ని చూశారా ? ఇక్కడ ఉన్న ఎ వి12 ఇంజన్ చూడండి చాలు

5. స్ప్రింగ్‌ కాఫీ టేబుల్

5. స్ప్రింగ్‌ కాఫీ టేబుల్

ఇంత వరకు సాధారణంగా ఉండే టేబుల్‌ చూశారు కదా. దీనిని చూడండి నాలుగు పాత సస్పెన్షన్ స్ప్రింగ్‌లను ఉపయోగించి ఎంత సింపులుగా కాఫీ టేబుల్‌ను రూపొందించారో. ఇలాంటివే మీ ఇంట్లో ఉంటే మీరు ఇలాంటి కాఫీ టేబుల్‌ను తయారు చేయండి.

 6. రేడియేటర్ కాఫీ టేబుల్

6. రేడియేటర్ కాఫీ టేబుల్

ఇది కూడా కాఫీ టేబులే అయినప్పట్టికీ, దీనికో ప్రత్యేకత ఉంది. రెండు రేడియటర్లను ఉపయోగించి దీనిని తయార చేసారు. మొత్తానికి ఇవి దేనివో తెలుసా ? అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల సంస్థ రోల్స్ రాయిస్‌కు చెందినవి.

7. నీళ్ల ట్యాంకు

7. నీళ్ల ట్యాంకు

ఈ ట్యాంకును వోల్వో నుండి సేకరించిన విడి భాగాలతో తయారు చేశారు.

8. పాన్పు (బెడ్)

8. పాన్పు (బెడ్)

క్యాడిల్లాక్ కారు అనగానే సౌకర్యవంతానికి మారు పేరు అచ్చం ఇలాంటి కారు పరికరాలను వినియోగించుకుని సౌకర్యవంతమైన బెడ్‌ను తయారు చేశారు.

9. మిత్సుబిషి బెడ్

9. మిత్సుబిషి బెడ్

ఇది మరొక బెడ్ దీనిని మిత్సుబిషికి ఎవో కారు ముందు భాగాన్ని సేకరించి ఇలా మంచలాగా తీర్చి దిద్ది దాని మీద పరుపుతో అలంకరించారు.

10. కుర్చీలు

10. కుర్చీలు

కారులో ఉన్న సీట్లు ఆఫీసులో కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇది మీకు నచ్చినట్లయితే ముందుగా కారులో ఉన్న సీటును తీసుకుని ఇలా మీ పని ప్రదేశంలో అమర్చుకోండి. ఆఫీసు పని వేళలు ముగిసిన తరువాత తిరిగి వాటిని కారులో అలాగే అమర్చుకోండి.

11. గడియారం

11. గడియారం

మీ పాత కారులోని ముందు వైపు ఉన్న రిజిస్ట్రేషన్ ప్లేటును ఏమి చేయాలో అర్థం కావట్లేదా ? అయితే దానిని అందమైన గడియారంలా డిజైన్ చేసుకోండి.

12. గ్రిల్

12. గ్రిల్

కారును రోడ్డు మీద ఆపి బ్యానెట్‌‌ను పైకెత్తు తదేకంగా పరిశీలిస్తుండటం మీరు చాలా సార్లు గమనించి ఉంటారు. కాని ఇక్కడ చూడండి ఎటువంటి సమస్య లేకుండా బ్యానెట్ తెరుచుకుని ఎలా పొగలు కక్కుతుందో దీనిని ఒక వ్యక్తి ఇలా గ్రిల్‌ ఉపయోగించుకుంటున్నాడు. అయితే చూసిన దీనిని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

13. అల్మారా

13. అల్మారా

అందమైన వస్తువులు ఎక్కడైన కనబడితే వాటని తెచ్చి ఇంట్లో షెల్ఫ్ దాచేస్తాం, అదే వాటిని షెల్ఫ్‌కు బదులుగా ఇలాంటి పాత జాగ్వార్ కారును ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చూడండి.

14. ఆఫీస్ డెస్క్

14. ఆఫీస్ డెస్క్

మీ ఆఫీస్ డెస్క్ తరచూ చూసి చూసి బోర్‌గా ఉందా అయితే దీనిని చూడండి. కుదిరితే మీరు ఒకటి తయారు చేయించుకోండి.

15. క్యాబిన్

15. క్యాబిన్

ఎంప్లాయిస్ కాదు ఒకే క్యాబిన్ చూసి చూసి బాస్‌లకు కూడా బోర్ కొడుతుంది. అందుకే ప్రత్యేకంగా బాస్‌ల కోసం బస్సు ముందు బాగాన్ని ఇలా క్యాబిన్‌లా మలిచేశారు.

 మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....
  • మూత్రం నుండి కాఫీ చేసుకున్నాం: వ్యోమగాముల అనుభవాలు
  • లీఫ్ నెలలో టాప్ లేపిన కార్ల అమ్మకాలు
  • వస్తాడు, భిక్షమెత్తుకుంటాడు, ప్రతి రోజు ఆడి కారులో ఇంటికి వెళతాడు

Most Read Articles

English summary
15 Cool Furniture Made From Old Car Parts
Story first published: Monday, March 7, 2016, 10:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X