ఈ భారతీయ రోడ్ల మీద ప్రయాణం తాడు మీద నడిచే అనుభవానికి సమానం !

భారత దేశంలో అత్యంత ప్రమాదకరమైన 16 రహదారులు. అద్యంతం ఉత్కంఠభరితమైన ఈ రహదారుల గురించి ప్రత్యేక కథనం...

By Anil

మానవ అభివృద్దిలో రహదారులది కీలక పాత్ర. ప్రారంభంలో రవాణా అనేది రహదారుల నుండే ప్రారంభం అయ్యింది, కాలక్రమంలో వివిధ రకాల ప్రయాణ సాధనాలు అందుబాటులోకి రావడంతో జల, రైలు మరియు వాయు మార్గాలకు రవాణా విస్తరించింది. ఏదేమయినప్పటికీ నిరంతర జనజీవనంలో రహదారులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ఇక భారత రహదారుల విషయానికి వస్తే అత్యంత సుదరమైన రహదారులతో పాటు అత్యంత ప్రమాదకరమైన మరియు భయంకరమైన రహదారులు కూడా ఉన్నాయి. అందులో ప్రమాదాలకు నిలయమైన 16 డేంజరస్ రోడ్ల గురించి రహదారుల సెక్షన్ ద్వారా ప్రత్యేక కథనం.

1. జోజిలా పాస్

1. జోజిలా పాస్

సముద్ర మట్టానికి సుమారుగా 3,538 అడుగుల ఎత్తులో ఉంది ఈ జోజిలా పాస్ రహదారి. ఏ విధమైన నిర్మాణ విలువలు లేకుండా మట్టితో ఉండే ఈ ఇరుకైన రహదారి భారత రహదారుల్లో కెల్లా అత్యంత ప్రమాదకరమైనది.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

నల్లటి మట్టితో ఎప్పుడు వదులుగా ఉంటుంది ఈ రహదారి మరియు రహదారి మొత్తం కొండలకు ఆనుకుని ఉండటం వలన కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లఢక్ మరియు కాశ్మీరు మధ్యలో ఇదే ప్రధానమైన రహదారి. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చినపుడు ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది.

2. నెరల్ - మథేరన్ రహదారి

2. నెరల్ - మథేరన్ రహదారి

సర్పిలాకారంలో ఉన్న ఈ రహదారుల గుండా ప్రయాణిస్తే గుండె నోట్లోకి రావడం ఖాయం. అందంగా, మృదువుగా ఎన్నో వంపులను కలిగి ఉండే ఈ రహదారి నెరల్ నుండి మథేరాన్ వరకు కలదు.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

అత్యంత ఇరుకుగా ఉండే ఈ రహదారి మీద గరిష్టం వేగంతో ప్రయాణం ఏ మాత్రం సాధ్యం కాదు. ఈ రహదారుల్లో మీరు డ్రైవ్ చేయడానికి ఇష్టం లేకపోతే ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

3. జాతీయ రహదారి 22

3. జాతీయ రహదారి 22

ఈ జాతీయ రహదారి 22 రోడ్డు డైరెక్ట్‌గా నరకానికి వేసినట్లు ఉంటుంది. దీనిని నరకానికి రహదారిని చెప్పవచ్చు. అత్యంత ప్రమాదకరమైన ఇండియన్ రహదారుల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

కొండలను తొలిచి ఈ రహదారిని నిర్మించారు. మధ్య మధ్యలో గుహలు కూడా వస్తాయి. ఎక్కువ సేపు గుహల్లో ప్రయాణించడం వలన ఊపిరి అందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ దారుల్లో ప్రయాణించేటపుడు ఎంతో శ్రద్దతో ఉండాలి.

4. చాంగ్ లా

4. చాంగ్ లా

సుదరమైన హిమాలయాల్లో ఉన్న ఈ రహదారిలో ప్రయాణం ఊపిరి బిగబట్టే రీతిలో ఉంటుంది. మరియు చాలా మంది డ్రైవర్ల అనుభవం ప్రకారం ఈ మార్గం గుండా వెళితే కళ్లు తిరుగుతాయని తెలిసింది. ఈ చాంగ్ లా మార్గం ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

చాంగ్ లా రహదారి భారతీయ సైనికుల వలయంలో ఉంటుంది. ఎందుకంటే చైనా భూ బాగపు సరిహద్దుకు ఇక్కడు చాలా దగ్గర. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉండటం వలన చలిని నివారించే దుస్థులు మరియు మెడికల్ కిట్లను వెంట తీసుకెళ్లటం మంచిది.

5. లేహ్ - మనాలి హైవే

5. లేహ్ - మనాలి హైవే

సినిమాల్లో లేహ్ మరియు మనాలి ప్రాంతాలను ఎంతో అందంగా చూసుంటారు. అయితే ఈ రెండు ప్రాంతాలను కలిపే రహదారిని చూస్తే షాక్‌కు గురవుతారు. అత్యంత ఎత్తులో ఉండే అతుకుల గతుకుల రోడ్డు మొత్తం మృత్యుగీతం వినబడుతూ ఉంటుంది.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

ఇరుకైన లేహ్-మనాలి రహదారిలో రద్దీ భీబత్సంగా ఉంటుంది. భారీ ట్రక్కుల దీని మీద ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటాయి. ఇక ఇరుకైన ప్రదేశంలో రెండు లారీలు ఎదురెదురుగా వస్తే దానిని మించిన సవాలు మరొకటి ఉండదనే చెప్పాలి. మీరు గనుక ఇక్కడకు వెళితే నెమ్మదిగా వెళ్లండి. సురక్షితంగా తిరిగి రావాలంటే ఉండే ఏకైక మార్గం ఇదే.

6. మన్నార్ రహదారి

6. మన్నార్ రహదారి

మన్నార్ రహదారికి నేరల్-మథేరాన్‌ రహదారితో చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఈ రోడ్డులో కూడా వెంట వెంటనే ఎదురయ్యే ప్రమాదకరమైన మలుపులు మరియు భారీ వాలు తలాలు ఉంటాయి.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

కమ్మని తేయాకు చెట్ల నుండి వీచే గాలులతో ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే రాకెట్లలా దూసుకెళ్లే మోటార్ బైకులతో చాలా జాగ్త్రతా వ్యవహరించాలి. ఈ రహదారిలో ఏ చిన్న తప్పిదం జరిగినా పరిమాణాలు చాలా ప్రభావంగా ఉంటాయి.

7. త్రీ లెవల్ జిగ్ జాగ్ రోడ్డు

7. త్రీ లెవల్ జిగ్ జాగ్ రోడ్డు

త్రీ లెవల్ జిగ్ జాగ్ రోడ్డు అనే ఈ రహదారి సిక్కింలో కలదు. సముద్ర మట్టానికి సుమారుగా 11,200 అడుగుల ఎత్తులో ఉండే ఈ రహదారిని మీద నుండి ప్రయాణం చూస్తే హిమాలయాల దృశ్యాన్ని అద్బుతంగా వీక్షించవచ్చు.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

చివరి సీటులో కూర్చునట్లయితే మీ కళ్లు బొంగరాలు తిరిగినట్లు గింగిరాలు తిరగడం ఖాయం. నిర్ధిష్టమైన దూరంలో ఉండే మలుపులు గుండా ప్రయాణం సినిమాలో ఛేజింగ్‌ను తలపిస్తుంది. ఈ మార్గంలో వెళ్లాలంటే అక్కడి అధికారుల ప్రత్యేక అనుమతులు పొందాల్సి ఉంటుంది.

8. కర్దంగా లా పాస్

8. కర్దంగా లా పాస్

కర్దంగ్ లా పాస్ రహదారి నిరంతరం ఆర్మీ పర్యవేక్షణలో ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన రహదారుల్లో ఎంతో ముఖ్యమైనది. ఎంతో మంది యువ రైడర్లు తమ జీవితంలో ఈ ప్రాంతాన్ని సందర్శించాలని కలగా పెట్టుకుంటారు.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

కర్దంగ్ లా పాస్ రహదారి ద్వారా న్యూబ్రా వ్యాలీని చేరుకోవచ్చు. అక్టోబర్ మరియు మే మధ్య కాలంలో ఈ ప్రాంతంలో ప్రయాణించడానికి వాతావరణం ఏ మాత్రం అనుకూలించదు.

9. కిస్త్వారా - కైలాష్ రహదారి

9. కిస్త్వారా - కైలాష్ రహదారి

2013 లో పర్వతాధిరోహక అథ్లెట్ మిక్ ఫోవ్లెర్ మరియు అతి సహాద్యాయి పౌల్ రమ్స్‌డెన్ దీనిని అధిరోహించారు. సింగల్ రోడ్డు ద్వారా మాత్రమే ప్రమాదకర ప్రయాణం సాగుతుంది.

Picture credit: Youtube

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఈ మార్గంలోకి వెళితే జిపిఎస్ పనిచేయడం కూడా ఆగిపోతుంది. వాహనాల ద్వారా ఇక్కడకు చేరుకోవడం అనే ఎంతో సాహసంతో కూడుకున్నది.

10. రాజమాచి రహదారి

10. రాజమాచి రహదారి

రాళ్లు మరియు గుట్టలతో నిండి ఉండే ఈ రహదారి సహ్యాద్రి పర్వతాల్లో ఉంది. ఇక్కడ జనజీవనం లేకపోయినా. ట్రెక్కర్స్ మరియు బైకర్స్ యొక్క తాకిడి అధికంగా ఉంటుంది.

Picture credit: YouTube

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

వేసవి కాలంలో కాస్త పర్వాలేదనిపించినా వర్షాకాలంలో చిత్తడి చిత్తడిగా ఉంటూ ఎక్కువగా జారే స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ మార్గం. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్లడం మానుకోవడం మంచిదనే చెప్పాలి.

11. కిన్నూర్ రహదారి

11. కిన్నూర్ రహదారి

ఈ రహదారిలో ప్రయాణం చేసే సమయంలో మన ప్రమేయం లేకుండా శరీరంలోని అన్ని భాగాలు ఒక విధమైన భయానికి లోనవుతాయి. ఈ మార్గంలో చిన్న గుహల గుండా తొలిచిన కొండ వాలు గుండా ప్రయాణం సాగుతుంది.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉన్న సందర్భాల్లో ఈ మార్గాన్ని మూసి వేస్తారు. ఒక మీరు ఈ కిన్నూర్ రహదారిలో ప్రయాణించాల్సి వస్తే సాధ్యమైనంత వరకు భద్రంతగా వ్యవహరించండి. ఆ రహదారి నుండి పొరబాటున క్రిందకు పడిపోతే చిధ్రం అయిపోతారు.

12. నాతు లా పాస్ రహదారి

12. నాతు లా పాస్ రహదారి

ప్రపంచంలో గరిష్ట ఎత్తు వద్ద ప్రయాణించే వీలున్న ఏకైక ప్రాంతంగా ఈ నాతు లా పాస్ రహగారి పేరు గాంచింది. ఈ ప్రాంతం మూడు దేశాల సరిహద్దుకు బిందువుగా ఉంటుంది.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

చైనా, ఇండియా మరియు టిబెట్ దేశాలను కలుపుతుంది. నాతు లా పాస్ సిక్కిం రాష్ట్రం రాజధాని గ్యాంగ్‌టక్ నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. డ్రైవింగ్‌కు ఎక్కువ అంతరాయ కలిగించేవి మంచుతో కప్పబడి ఉండటం మరియు కొండచరియలు ఎక్కువగా విరిగిపడం ప్రధానం.

13. తిరుపతి ఘాట్ రోడ్డు

13. తిరుపతి ఘాట్ రోడ్డు

ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన రహదారుల్లో తిరుపతి ఘాట్ రోడ్డు ఉంది. చాలా మంది సొంత వాహనాలలో తిరుమలకు వెళుతుంటారు. లోతైన మలుపు ఉండే ఈ ఘాట్ రోడ్డులో ప్రయాణం ఎంతో ప్రమాదకరం వాహనం యొక్క వేగాన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో అవసరం.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

తిరుమల మీద మాత్రమే కాదు దానిని చేరుకునే ఘాట్ రోడ్లలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. గరిష్ట రద్దీగా ఉండే ఘట్ రోడ్లలో తిరుమల ఘాట్ రోడ్డు ఒకటి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ శ్రద్దతో వ్యవహరించాల్సి ఉంటుంది.

14. గటా లూప్స్

14. గటా లూప్స్

లేహ్-మనాలి రహదారిలో 21 ప్రమాదకరమైన మలుపులున్న ప్రాంతాన్ని గటా లూప్స్ అంటారు.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

ఓ సారి టూరిస్ట్ మరణిస్తే ఖననం చేసినందుకు ఆ ఆత్మ ఇదే ప్రాంతంలో సంచరిస్తోంది అనే వాదన ఉంది. అందుకోసం ఇక్కడకు వెళ్లే వారు సిగరెట్లు, త్రాగు నీరు మరియు ఆహార పదార్థాలను సమర్పించుకుంటున్నారు.

15. పూనే ముంబాయ్ ఎక్స్‌ప్రెస్ వే

15. పూనే ముంబాయ్ ఎక్స్‌ప్రెస్ వే

పూనే ముంబాయ్ఎక్స్‌ప్రెస్ వే ప్రమాదకర భారతీయ రహదారుల్లో ఒకటిగా నిలిచింది. కొండ చరియలు విరిగి పడటం అనేది దాదాపుగా ఉండదు. అయితే అజాగ్ర్తతతో వ్యహవరించే డ్రైవర్ల వలన భారీ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

భారీగా ఉన్న మలుపుల్లో డ్రైవర్లు అలసట మరియు నిద్రలేమి కారణంగా యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జనవరి 2006 నుండి 2014 మధ్య కాలంలో పూనే-ముంబాయ్ ఎక్స్‌ప్రెస్ వే మీద 14,186 ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. అందులో అధిక మొత్తంలో మానవ తప్పిదాల వలనే జరిగినట్లు తెలిసింది.

16. కిల్లర్-కిష్త్వార్

16. కిల్లర్-కిష్త్వార్

పెద్ద కొండల మద్య చిన్న పాయగా కొండను తొలిచి ఈ కిల్లర్-కిష్త్వార్ రహదారిని నిర్మించారు.

Picture credit: YouTube

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

రహదారి నుండి దృష్టి కాస్త ప్రక్కకు తప్పిందంటే బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అనాలి. ఇక్కడ ప్రయాణం దారం మీద నడుస్తుట్లు ఉంటుంది. మార్గంలో ప్రయాణం వీడియో గేమ్‌ని తలపిస్తుంది గేమ్‌లో లైఫ్స్ ఉంటాయేమో ఇక్కడ ఉండవు.

అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు

  • భారత రహదారుల గురించి షాకింగ్ నిజాలు
  • ఇండియాలో దాగున్న 25 సుందరమైన రోడ్లు
  • ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన 10 రహదారులు
  • అత్యంత ప్రమాదకరమైన 16 భారత రహదారులు
    • దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే
    • అద్భుతమైన మరియు ప్రఖ్యాత 10 భారత రహదారులు

Most Read Articles

English summary
16 Dangerous Roads In India That Are A Driver’s Worst Nightmare
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X