ఆనంద్ మహీంద్ర గురించి ఆసక్తికరమైన విషయాలు

By N Kumar

ఆనంద్ మహీంద్ర ఈయన గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు. ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు మహీంద్ర అండ్ మహీంద్రా గ్రూప్ గౌరవ ఛైర్మెన్ అయిన ఆనంద్ మహీంద్ర తను ఎదిగిన తీరు, అతని ఆచరణ మార్గం ద్వారా కంపెనిలో ఎన్నో కొత్త ఉత్పత్తులు ప్రారంభించిన తీరు ఎంతో మంది కొత్త ఎంటర్‌ప్రెన్యుర్‌లకు రోల్ మోడల్‌గా నిలిచాడు.
Also Read: జపాన్ అణు విపత్తు యొక్క విషయాలు-నిర్ఘాంతపోయే సత్యాలు

ఆనంద్ మహీంద్ర అతని విద్యాభ్యాసం అనంతం 1989 సంవత్సరంలో మహీంద్ర యుజిని స్టీల్ కంపెనీ లిమెటెడ్‌లో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్సిక్యుటివ్ అసిస్టెంట్ స్థానంలో భాద్యతలు స్వీకరించాడు. మీగతా వారిలా ఇతను ఒకే సారి సి.ఇ.ఒ లేదా యమ్‌ డి స్థానాన్ని పొందలేదు. ఒక్కటిగా తనకు అనుగుణంగా మలుచుకుంటూ మొత్తం మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ సంస్థకే సి.ఇ.ఒ అయిపోయాడు. విభిన్నమైన మార్పులతో కంపెనీని దేశంలో అగ్రస్థానంలో నిలిపాడు.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన ట్రక్‌ను కొనుగోలు చేసిన మలేషియా సుల్తాన్

ఆనంద్ మహీంద్ర గురించి మీరు తెలుసుకోవాల్సిన మరిన్ని విషయాలు గురించి క్రింది స్లైడర్‌లో వివరంగా ఉన్నాయి. ఓలుక్కేయండి మరి.

1. పుట్టిన రోజు

1. పుట్టిన రోజు

ఆనంద్ మహీంద్ర 1955, మే 1 వ తేదీన ముంబయ్‌లో జన్మించాడు. ఇతని తాత కె సి మహీంద్ర ప్రముఖ పారిశ్రామికవేత్త అప్పటికే దేశం పారిశ్రామికంగా అభివృద్ది చెందుతోంది. మహీంద్ర వంశస్థులు ఇండియాలో మహీంద్ర యుజిని స్టీల్ కంపెనీని స్థాపించారు.

2. విధ్యాభ్యాసం

2. విధ్యాభ్యాసం

1977 సంవత్సరంలో ఆనంద్ మహీంద్రా హార్వర్డ్ యూనివర్సిటి నుండి డిగ్రీ పట్టాను పొందాడు. తరువాత 1981 నాటికి అతను ఎమ్‌బిఎ పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు.

3. మహీంద్రా గ్రూపులో ఆనంద్ అడుగులు

3. మహీంద్రా గ్రూపులో ఆనంద్ అడుగులు

1989 లో ఆనంద్ మహీంద్రా సంస్థకు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అందివ్వడం మొదలు పెట్టిమన తరువాత అనంద్ ఇక తిరిగి వెనక్కి చూసుకోలేదు. అప్పుడు సరిగ్గా రియల్ ఎస్టేట్ మరియు హాస్పిటాలిటి మీద దృష్టి సారించాడు. ఆ రెండు రంగాలు కూడా బాగా పుంజుకున్నాయి. ఆ తరువాత 1991లో ఎమ్ అండ్ ఎమ్ డిప్యూటి మేనిజింగ్ డైరెక్టర్‌గా, 1997 లో మేనేజింగ్ డైరక్టర్ స్థానాన్ని ఆక్రమించాడు.

4. వైస్ ఛైర్మన్ గా

4. వైస్ ఛైర్మన్ గా

ఆనంద్ మహీంద్రాకు మరిన్ని బాద్యతలు పెరిగాయి ఎందుకంటే 2003 సంవత్సరంలో వైస్ ఛైర్మన్ గా భాద్యతలు అందాయి. కంపెనీకి అప్పుటికే తెలిసిపోయింది. మహీంద్రా అండ్ మహీంద్రాను ఇంత విజయవంతంగా అభివృద్ది చేయగల సత్తా ఆనంద్ మహీంద్రాకు ఉందని. అందుకే ఆనంద్ మహీంద్రా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి ఈ స్థాయికి ఎదిగారు.

5.ఆటో మొబైల్‌ రంగంలో సుస్థిర స్థానం

5.ఆటో మొబైల్‌ రంగంలో సుస్థిర స్థానం

ఆనంద్ మహీంద్రా కంపెనీలోకి అడుగుపెట్టిన తరువాత ఆటోమొబైల్ రంగాన్ని విసృతంగా అభివృద్దిపరిచాడు. అందులో భాగంగా ఎన్నో రకాల యస్‌యువిలను, యమ్‌యునవిలను,మూడు చక్రాల ఆటోలు, చిన్నపాటి వాణిజ్య వాహనాలును, ట్రాక్టర్లను, టూవీలర్లను ఆకరిరకి ఎయిర్ క్రాఫ్ట్‌లను కూడా అందిస్తున్నారు. భారతీయ రోడ్ల మీద ఇప్పుడు దాదాపుగా మహీద్రా వాహనాలే ఉన్నాయని చెప్పవచ్చు.

6. ఫోర్బ్స్ జాబితాలో

6. ఫోర్బ్స్ జాబితాలో

భారత దేశంలో ఆస్తుల పరంగా ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన జాబితాలో ఆనంద్ మహీంద్రాను 99 వ అత్యంత ధనికునిగా నిర్ణయించింది.

7. ఆనంద్ మహీంద్రా సంపద

7. ఆనంద్ మహీంద్రా సంపద

2/11/2015 నాటికి ఆనంద్ మహీంద్రా యొక్క మొత్తం సంపద 1.22 బిలియన్ డాలర్లు. ఫార్చ్యూన్ పత్రిక ప్రచురించి అతి ఉత్తమమైన 50 మంది పారిశ్రామిక వేత్తలలో ఆనంద్ మహీంద్రా స్థానం సంపాదించుకున్నాడు. మరియు 2014 సంవత్సరంలో ఆసియాలో అత్యంత శక్తివంతమైన 25 మంది పారిశ్రామిక వేత్తలలో అనంద్ మహీంద్రాకు చోటు దక్కింది.

8. మంచి ఫోటోగ్రాఫర్

8. మంచి ఫోటోగ్రాఫర్

ఆనంద్ మహీంద్రకు ఫోటోగ్రఫి అంటే ఎంతో మక్కువ. మరియు ఇతనికి బ్లూస్ మ్యూజిక్ అంటే ఎంతో ఇష్ట తీరిక దొరికినప్పడల్లా ఈ బ్లూస్ సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు. మరియు మహీంద్ర ఆద్వర్యంలో ముంబైలో రెండు రోజుల పాటు ఈ బ్లూస్ పండుగని నిర్వహిస్తారు.

 9.తమిళంతో సంభందం

9.తమిళంతో సంభందం

ఇతనికి తమిళ భాష పట్ల విడదీయరాని అనుబందం ఉంది, ఎందుకంటే ఆనంద్ మహీంద్రా ఊటిలో ఉన్న స్కూల్‌లో విధ్యను ఆబ్యసించాడు. ఊటి తమిళనాడులో ఉన్నందున అతనికి తమిళం మీద మక్కువ కలిగింది.

10. పారిశ్రామిక నేపథ్యం

10. పారిశ్రామిక నేపథ్యం

ఆనంద్ మహీంద్ర తాత అయిన కె సి మహీంద్రా, గులామ్ మహ్మద్ ఉక్కు సంస్థను కొనుగోలు చేసి మాహీంద్రా యుజిని స్టీల్ సంస్థగా ప్రారంభించారు. అప్పట్లో అత్యదికంగా స్టీలును ఉత్పత్తి చేసిన సంస్థంగా చరిత్ర కూడా ఉంది.

11. ఎన్నో సంస్కరణలు

11. ఎన్నో సంస్కరణలు

ఒక ఆటోమొబైల్ ఇడస్ట్రీలో భాగస్వామిగా అతి తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేసే వాహనాలను అందివ్వావని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఎఆర్ఎఐ(ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) లో అధ్యక్షులుగా ఉన్నారు. ఇది వాహనాల కాలుష్య కారకాలను ప్రయాగపరంగా పరీక్షించడంలో తగిన సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుంది.

12. విపరీతమైన ఫాలోయర్స్

12. విపరీతమైన ఫాలోయర్స్

Worldofceo.com 2013 లో సోషల్ నెట్‌వర్క్‌లో అత్యదిక మంది ఫాలో అవుతున్న టాప్-30 మంది సి.ఇ.ఒ లలో ఆనంద్ మహీంద్రా మూడవ స్థానంలో ఉన్నాడు. 2/11/2015 నాటికి ట్వట్టర్ ద్వారా ఆనంద్ మహీంద్రాను ఫోలో వారి సంఖ్య 2.54 మిలియన్.

13. మీకు తెలుసా...

13. మీకు తెలుసా...

ఆనంద్ మహీంద్రా దేశంలో ఉన్న దాదాపు 70,000 మంది నిరుపేద అమ్మాయిలకు నన్షి కాళి అనే కార్యక్రమం ద్వారా ఉచిత విధ్యను అందిస్తున్నాడు. మరియు దేశం వ్యాప్తంగా అతి పెద్ద ఉచిత త్రాగునీటి సంస్థ అయిన నాంది డానోన్ లో ఇతను సహ వ్యవస్థాపకుడుగా ఉన్నాడు. ఈ సంస్థ ద్వారా దాదాపుగా దేశ వ్యాప్తంగా 3 మిలియన్ల ప్రజలకు తాగు నీటిని అందిస్తున్నారు.

14. మీకు తెలుసా...

14. మీకు తెలుసా...

భారతదేశం నుండి వ్యక్తిగతంగా హార్వర్డ్ హుమినిటీస్ కు అత్యదికంగా విరాళం అందిస్తున్న ఏకైక వ్యక్తి ఆనంద్ మహీంద్రా. ఎంతో తెలుసా? దాదాపుగా 10 మిలియన్ డాలర్లు.

15.ఆనంద్ మహీంద్రా వ్యక్తిగతం

15.ఆనంద్ మహీంద్రా వ్యక్తిగతం

ఆనంద్ మహీంద్రా ఎక్కువగా సెయిలింగ్ మరియు టెన్నిస్ ఆడటానికి ఇష్టపడతాడు. మరియు ఎక్కువగా అంతర్జాతీయ సినిమాలను చూస్తాడు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ముంబాయ్‌లో నివసిస్తున్నాడు.

16. ఆనంద్ మహీంద్రా కుటుంబం

16. ఆనంద్ మహీంద్రా కుటుంబం

ఆనంద్ మహీంద్రా భార్య అనురాధ మహీంద్రా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ ఇద్దరూ ఆలికా మరియు దివ్యా

మరిన్ని ఆసక్తికరమైన విషయాల మీ కోసం....

Most Read Articles

English summary
interesting facts about Anand Mahindra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X