ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ షిప్‌లో ప్రయాణించడానికి గల 17 ముఖ్య కారణాలు

By Anil

హార్మనీ ఆఫ్ ది సీస్ ప్రపంచంలో అతి పెద్ద నౌక రెండు వారాల క్రితం రాయల్ కరేబియన్ క్రూయిజ్ షిప్స్ సంస్థ పూర్తి స్థాయిలో తయారు చేసి అందుబాటులోకి తెచ్చింది. భూమి మీదున్న ఈఫిల్ టవర్ కన్నా పొడవైనది ఈ నౌక. ఇందులో ఖచ్చితంగా ప్రయాణించాలి అనడానికి ఉన్న 17 ముఖ్య కారణాలు నేటి కథనంలో అందిస్తున్నాము.

17. అత్భుతమైన అగాధం

17. అత్భుతమైన అగాధం

నిజమే ఈ నౌక పై భాగంలో అంటే సముద్రం మట్టానికి 45.72 మీటర్ల ఎత్తులో అతి పెద్ద అగాధం లాంటి గొట్టం కలదు. ఇక్కడ మనం జారిపోతే నౌక అడుగు భాగంలో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లోనికి చేరుకుంటాము. భారీ పొడవు ఉండే ఈ గొట్టంలో వింత శబ్దాలతో ఒక కొత్త అనుభూతిని ఆనందిస్తూ నిట్టనిలువుగా జారిపోవచ్చు.

16. ఫ్లో రైడర్

16. ఫ్లో రైడర్

అతి పెద్ద జారుడు బల్ల అది కూడా చూట్టూ నీళ్లు, సాధారణంగా కూర్చుని జారే జారుడు బల్ల కాదు. సర్ఫ్ టేబుల్ మీద ఒక మోకాళి మీదుగా కూర్చుని అత్యంత ఎత్తు నుండి పై పైన వాలు జారిమీద సర్ఫింగ్ చేయడం అంత ఆశామాషీ కాదు. కాని ఇక్కడ కొన్ని గంటలసేపయినా ఆడుకోవాలనే ఆలోచన మీకు తప్పకుండా కలుగుతుంది.

15. క్రేజీ గోల్ఫ్

15. క్రేజీ గోల్ఫ్

పాశ్చాత దేశాలలో గోల్ఫ్‌ ఆటకు ఓ ప్రత్యేక ఉంది. ఎక్కువ మంది గోల్ఫ్ ఆటడటానికి ఎంతో ఆసక్తి చూపుతారు. కాని ఇదే గోల్ఫ్ సముద్రం మధ్యలో అతి పెద్ద నౌకలో గోల్ఫ్ ఆడుతుంటే భలే బాగుటుంది కదా. ఈ అవకాశాన్ని ఈ ప్రపంచపు అతి పెద్ద నౌకలో ప్రయాణించే వారికి కల్పించారు.

14. బయోనిక్ బార్

14. బయోనిక్ బార్

ఈ అతి పెద్ద నౌకలో సౌకర్యాలకు కొదవేలేదు. సాధారణంగా కొన్ని బార్లలో అక్కడక్క రోబోలను సర్వింగ్ కోసం వినియోగిస్తుంటారు. కాని ఈ నౌకలో ఉన్న బయోనిక్ బార్‌లో రోబోలే సర్వర్లు. మీకు కావాల్సిన వాటిని మీ టేబుల్ మీదున్న శామ్‌సంగ్ ట్యాబ్ ద్వారా ఆర్డర్ ఇస్తే క్షణాల్లో రోబో ద్వారా అక్కడికి చేరుతాయి. తద్వారా ఈ నౌకలో ప్రయాణించినం సేపు మీరు దీనిని బాగా ఆనందిస్తారు (మద్యం తాగే అలవాటు ఉంటే.

13. వండర్ ల్యాండ్

13. వండర్ ల్యాండ్

మన ఇళ్లు మనకు మొదటి వండర్ ల్యాండ్, తరువాతనే ఏదైనా. అచ్చం అలాంటిదే ఈ నౌక. ఇందులో అత్భుతమైన వంటకాలను మీరు రుచి చూడవచ్చు. మెనూలో ఉన్న అన్నింటిని మీరు రుచి చూడవచ్చు. ఈ అవకాశం ఇంటిలో తప్ప మరెక్కడ ఉంటుంది. వంటకాలతో పాటు స్వర్గాన్ని తలపించే అత్బుతమైన భోజనశాలలు ఇందులో ఉంటాయి.

12. రైసింగ్ టైడ్

12. రైసింగ్ టైడ్

రైసింగ్ టైడ్ అనగా ఆటుపోటుల మద్య సరదాగా తిరిగడం, నౌక మధ్య భాగంలో గోడి గ్రుడ్డు ఆకారంలో ఉండేటటుంటి దానిలో ఆటు పోటులను అనుభవిస్తూ సరదాగా కాలక్షేపం చేయవచ్చు. హార్మనీ ఆఫ్ ది సీస్ మద్య భాగంలో ఇది కలదు.

11. టేబుల్ టెన్నిస్

11. టేబుల్ టెన్నిస్

ఇందులో నీటితో ఆడుకునే ఆటలు మాత్రమే కాకుండా, టేబుల్ టెన్నిస్ కూడా ఉంది. నీటి జల్లుల మధ్యలో అయినా లేదంటే నాలుగు గోడల మధ్యలో అయినా టేబుల్ టెన్నిస్ ఆడవచ్చు.

10. బాస్కెట్ బాల్ కోర్ట్

10. బాస్కెట్ బాల్ కోర్ట్

హార్మనీ ఆఫ్ ది సీస్ నౌకలో పై భాగంలో టెన్నిస్ మరియు గోల్ఫ్ ఆటలడే ప్రదేశానికి దగ్గరలోనే బాస్కెట్ బాల్ కోర్ట్ కలదు. అంత పై నుండి బాస్కెట్ బాల్ సముద్రంలోకి పడిపోతుందేమో అని సందేహించాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే కోర్టు చుట్టూరా వలను అమర్చారు.

09. జారుడు బల్లలు

09. జారుడు బల్లలు

ఇందులో మూడు అతి పెద్ద గొట్టాలాంటి నిర్మాణాలు కలవు. ఇందులో కొద్దిగా నీటిని వదులుతూ ఇందులోకి వ్యక్తులను అనుమతిస్తారు. సైక్లోన్, టైఫూన్ మరియు సూపర్ సెల్ అనే మూడు అతి పెద్ద గొట్టాలు కలవు. ఇంత మేర పొడవైన వాటిని మనం ఈ నౌకలో తప్ప మరెక్కడ చూడలేము.

08. జిప్ లైన్

08. జిప్ లైన్

లోతును చూసి ఆనందపడే వారికి ఆనందాన్ని మరియు భయపడేవారికి ధైర్యాన్ని అందిస్తుంది ఈ జిప్‌లైన్. నౌకలోని సుమారుగా 16 వ అంతస్తు నుండి 9 వ అంతస్తు వరకు తాడును పట్టుకుని చెక్కబాటను అనుసరిస్తూ చేసే సాహసాలు ఉంటాయి.

07. పర్వత అదిరోహణ

07. పర్వత అదిరోహణ

భూమి మీద అనుభవించాల్సిన అన్నింటిని సముద్రం మధ్యలో చేయడానికి అవకాశం కల్పించింది ఈ హార్మనీ ఆఫ్ ది సీస్ నౌక. ఇందులో కొండలను కూడా ఎక్కవచ్చు. పర్వాతలను అధిరోహించాడినికి ఇష్టపడే వారి కోసం ఇందులో అలాంటి అవకాశాన్ని కల్పించారు. దీని చుట్టూ మిమ్మల్ని భయపెట్టడానికి పెద్ద పెద్ద శబ్దాలను సృష్టిస్తారు.

06. గ్రీస్ సంగీతం

06. గ్రీస్ సంగీతం

పాశ్చాత్యులు ఈ గ్రీస్ సంగీతాన్ని వింటూ డ్యాన్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సంగీతం 1971 నాటి కాలానికి చెందిన పాపులర్ సంగీతం. దీనిని ఎంజాయ్ చేయడానికి ఇందులో ప్రత్యేక ప్రదేశాన్ని అందించారు.

05. పార్క్

05. పార్క్

భూమ్మీద పార్క్‌లను అభివృద్ది చేయడం చాలా సహజం , కాని నౌకలో అతి పెద్ద పార్క్‌ను ఏర్పాటు చేయడం ఏమాత్రం సులభం కాదు. నౌక మధ్య భాగంలో ఉన్న ఈ పార్క్‌లో సుమారుగా 12,000 చెట్లు ఉన్నాయి.

04. జాజ్ బార్

04. జాజ్ బార్

ఈ నౌకలో ఎక్కువగా ఇష్టపడేవాటిలో ఉన్నది జాజ్ బార్. ఇందులో వివిధ రకాల మెలోడీ పాటలు మదిని ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ప్రశాంతతో కూడిన వాతావరణంలో ఎకాంతంగా మద్యం సేవించడానికి దీనిని ఉపయోగిస్తారు.

03. మంచు మీద స్కేటింగ్

03. మంచు మీద స్కేటింగ్

ఈ నౌకలో స్టుడియో బి అనే విభాగం కలదు ఇది కూడా వినోధానికి సంభందించినదే. ఇందులో కొందరు వ్యక్తులు మంచు మీద స్కేటింగ్ చేస్తుంటారు. వారిని అనుసరిస్తూ మీరు కూడా స్కేటింగ్ చేయవచ్చు.

02. అక్వా థియేటర్

02. అక్వా థియేటర్

హార్మనీ ఆఫ్ ది సీస్‌కు వెనుక వైపున అతి పెద్ద ఆక్వా థియేటర్ కలదు. ఇక్కడ కూర్చున్న వారు సముద్రం మొత్తాన్ని చూడగలరు. వీరి ముందు నీటిలో రకారకాల విన్యాసాలు జరుపుతారు. మంచులో స్కేటింగ్, కామెడీ మరే ఇతర షోలు కూడా మిమ్మల్ని ఆకట్టుకోలేకపోతే ఇక్కడ మీరు కోరుకున్నదానికన్నా అధికంగా ఆనందించగలరు.

01. ఇంటర్నెట్ కనెక్షన్

01. ఇంటర్నెట్ కనెక్షన్

ఇంతటి భారీ నౌకలో అంతర్జాలానికి దూరంగా ఉండటం మామూలు విషయం కాదు. అందుకోసం నౌకలో ఉన్న వారందరికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి శాటిలైట్ ఆధారిత అంతర్జాలం వూమ్ అనే పేరుతో అందిస్తున్నారు. తద్వారా ఇందులో ట్విటర్, పేస్ బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లుకు దూరంగా ఉండలేరు.

హార్మనీ ఆఫ్ ది సీస్‌

ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన, ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ షిప్‌ గురించి ఆసక్తికర విషయాలు

Most Read Articles

Read more on: #నౌకలు #ships
English summary
17 amazing reasons to go on the world's largest cruise ship
Story first published: Friday, May 27, 2016, 10:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X