లాక్ చేసిన కారులో రెండేళ్ల చిన్నారి మృతి

By Ravi

Kid
తల్లిదండ్రులు చేసిన నిర్వాకానికి ఓ పసికందు బలైంది. షాపింగ్‌కు వచ్చిన ఓ జంట తమ పిల్లలను, కారులోనే లాక్ చేసిన షాపింగ్ మాల్‌లోకి వెళ్లారు. గంటల తరబడి షాపింగ్‌లో నిమగ్నమైన వారు, తమ పిల్లల సంగతి మర్చిపోయారు. తిరిగు వచ్చి చూసే సరికి అందులోని రెండేళ్ల చిన్నారి ఊపిరి ఆడక మృతి చెందింది. వివరాల్లోకి వెలితే..

రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఇష్తాక్ ఖాన్ ఆయన భార్య ఉన్నాస్‌లు తమ పిల్లలు మహిమా (2 ఏళ్లు), పర్వానా (3 ఏళ్లు) మరియు అల్లుడు ఫర్హాన్ (5 ఏళ్లు)ను రామ్‌ఘడ్ టౌన్‌లోని ఓ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ వద్ద పార్క్ చేసిన కారులోనే ఉంచి, కారును లాక్ షాపింగ్‌కు వెళ్లారు. దాదాపు గంటకు పైగా సమయం గడిచినా వారు తిరిగి రాలేదు.

దీంతో కారులోని పిల్లలకు ఊపిరాడకపోవటంతే, కారు అద్దాలును చేతుల్తో తట్టుతూ, గట్టిగా కేకలు వేయటం ప్రారంభించారు. ఇది గమనించిన రోడ్డుపై వేళ్లే వారు కారు అద్దాలను పగులగొట్టి పిల్లలను బయటకు తీయడానికి ప్రయత్నించారు. అయితే, ఈలోపుగానే కారు వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు సొమ్మసిల్ల పడిపోయిన్న పిల్లలను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ సంఘటనలో మహిమా అనే రెండేళ్ల బాలిక శ్వాస అందక కారులోనే మృతి చెందింది. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియూకు తరలించారు.

ఈ సంఘటనను చూసైనా నేటి తరం తల్లిదండ్రులు మేలుకోవాల్సిన అసరం ఎంతైనా ఉంది. పిల్లలను ఇలా నిర్లక్ష్యం కారులో ఉంచి లాక్ చేసి వెళ్లటం చాలా ప్రమాదకరం. సాధారణంగా ఇంజన్ స్టాప్ చేసిన కారులో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. పెద్దవాళ్లకే ఊపిరి పీల్చుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోను పిల్లను కారులో లాక్ చేసి బయటకు వెళ్లరాదు.

Most Read Articles

English summary
A two-year-old girl suffocated to death after her parents locked her inside a closed car and went off shopping for an hour.
Story first published: Monday, July 1, 2013, 12:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X