రోజూవారీ మోటార్‌సైక్లిస్ట్‌లకు కావల్సిన 5 ముఖ్యమైన యాక్ససరీస్

By Ravi

మోటార్‌సైకిల్ అంటే యువతకు ఎంతో ప్యాషన్. అందులోనే పెర్ఫార్మెన్స్ బైక్‌లంటే ఇంకా మోజు ఎక్కువ. మనలో చాలా మంది ప్రతిరోజు ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తుంటారు. ఆఫీస్‌కు, కాలేజ్‌కు, సరుకులు తీసుకురావటానికి ఇలా అనేక పనుల కోసం నిత్యం ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తుంటారు.

ద్విచక్ర వాహనంపై మనం ప్రయాణించే దూరం ఎంతైనా సరే, అందుకు తగిన భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకుంటే, ప్రమాదాల బారిన పడటం ఖాయం. మీరు ప్రతినిత్యం ద్విచక్రం వాహనంపై ప్రయాణించే వారైతే, మీ వద్ద ఈ కథనంలో పేర్కొన్న కనీసం 3 యాక్ససరీలు తప్పనిసరిగా ఉండాలి.

ఈ యాక్ససరీలతో ప్రమాదాలను తప్పించుకోవటమే కాకుండా, మన శరీరాన్ని కూడా కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఆ యాక్ససరీలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

రోజూవారీ మోటార్‌సైక్లిస్ట్‌లకు కావల్సిన 5 ముఖ్యమైన యాక్ససరీస్

తర్వాతి స్లైడ్‌లలో మరింత సమాచారాన్ని పరిశీలించండి..!

హెల్మెట్

హెల్మెట్

ద్విచక్ర వాహనం నడుపుతున్న హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం పోలీసుల నుంచి తప్పించుకునేందుకే కాకుండా, మన సేఫ్టీ కోసం మనపై ఆధారపడి ఉండి, ఇంటి వద్ద మీ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూసే మీవారి కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.

హెల్మెట్‌ను ఎంచుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. హెల్మెట్‌లను నేరుగా వెళ్లి కొనటం మంచిది. సరైన సైజ్, క్లియర్ విజన్ కలిగిన వైజర్ (ప్లెయిన్ విజర్ మంచిది), సౌకర్యం, బరువు తదితర అంశాలను పరిశీలించుకొని హెల్మెట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. కొంచెం డబ్బులు ఎక్కువైనా ఫర్వాలేదు, ఐఎస్ఐ మార్క్ కలిగిన బ్రాండెడ్ హెల్మెట్‌ను కొనుగోలు చేయటం చాలా ఉత్తమం.

సన్‌గ్లాసెస్

సన్‌గ్లాసెస్

మీరు ఎక్కువగా వేడి వాతారణంలో ద్విచక్ర వాహనం నడుపుతూ ఉండే వారైతే, నాణ్యమైన సన్‌గ్లాసెస్‌ను ఉపయోగించడం మంచిది. ఇవి ఎండ వేడి నుంచి, అతినీళలోహిత కాంతి కిరణాలు మరియు ధుమ్ము, ధూళి నుంచి మీ కళ్లను రక్షించడమే కాకుండా, ఇవి మీకు మంచి స్టయిల్‌ని కూడా ఆఫర్ చేస్తాయి. కాబట్టి, హెల్మెట్ ఉన్నప్పటికీ, పగటి వేళల్లో ప్రయాణం చేసే వారు సన్‌గ్లాసెస్ ధరించడం ఉత్తమం.

హ్యాండ్ గ్లౌవ్స్

హ్యాండ్ గ్లౌవ్స్

మనం రోజూ ద్విచక్ర వాహనం నడిపేది కొద్ది కిలోమీటర్ల దూరమే కదా, మరి ఆ మాత్రానికే హ్యాండ్ గ్లౌవ్స్ ధరించడం అవసరమై అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, వాస్తవానికి హ్యాండ్ గ్లౌవ్స్ మీ చేతులకు మంచి రక్షణ కవచంగా నిలుస్తాయి. నాణ్యమైన రైడింగ్ హ్యాండ్ గ్లౌవ్స్ ధరించినప్పుడు, ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి క్రింద పడిపోయినా లేదా మీ బైక్ హ్యాండిల్ వేరే ఇతర వాహనంతో ఢీకొట్టినా చేతివేళ్లకు గాయాలు కాకుండా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. అంతేకాకుండా, మీ చేతులపై ధుమ్ము, ధూళిని ఇవి చేరనీయవు.

రైడింగ్ జాకెట్

రైడింగ్ జాకెట్

బైక్ రైడ్ చేస్తున్నప్పుడు జాకెట్ ధరించడం ఉత్పత్తమం. ఇది ధుమ్ము, ధూళి నుంచి మీ దుస్తులు పాడుకాకుండా ఉండేందుకు సహకరించడమే కాకుండా, ఎండ వేడిమి మరియు పర్యావరణ, వాహన కాలుష్యం వలన మీ శరీరం పాడు కాకుండా ఉండేందుకు తోడ్పతుతుంది. చలి ప్రాంతాలలో ద్విచక్ర వాహనం నడిపేవారు, మందంగా ఉండే జాకెట్లను, వేడి ప్రాంతాలలో ద్విచక్ర వాహనం నడిపేవారు తేలికగా ఉండే పలుచని రైడింగ్ జాకెట్లను ధరించడం మంచిది.

రైడింగ్ షూస్

రైడింగ్ షూస్

ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు సరైన రైడింగ్ షూస్ ఉంటే మంచిది. ఇవి అటు సేఫ్టీకి మరియు ఇటు స్టైల్‌కి పనికొస్తాయి. అత్యవసర సమయాల్లో ఈ రైడింగ్ షూస్ చక్కటి సేఫ్టీని ఆఫర్ చేసి, మీ కాలుకి రక్షణ కవచంలా నిలుస్తాయి.

Most Read Articles

English summary
Two-wheelers in India have for a long time been just a mode of transport and not a subject of passion unlike other countries. These everyday items may not look like much, but in an ugly situation, these will help the most!
Story first published: Friday, November 7, 2014, 11:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X