8 అందమైన డ్రైవ్ ప్రాంతాలు ఇవే......

By N Kumar

డ్రైవ్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. మరికొందరికి సరదా కూడా. మన ప్రాంతంలోని రోడ్లలో డ్రైవ్ చేయడం చిరాకుగా ఉంటుంది.

భారతదేశంలో చిరాకు పడకుండా సాఫీగా డ్రైవ్ చేయడానికి కొన్ని అద్భుతమైన, అందమైన డ్రైవ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి.

దేశంలోని 8 అందమైన డ్రైవ్ ప్రాంతాల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం...........

1. డిగా నుంచి చండీపూర్ :

1. డిగా నుంచి చండీపూర్ :

ఈ ప్రాంతం ఒడిస్సాలో ఉంది. సుభర్ణరేఖ నది ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంది. కసౌరినా చెట్లు ఈ మార్గంలో ఎక్కువగా కన్పిస్తాయి. దీంతో ఆ ప్రదేశం అందంగా కన్పిస్తుంది.

2. ముజప్ఫిలంగడ్ డ్రైవ్ బీచ్ :

2. ముజప్ఫిలంగడ్ డ్రైవ్ బీచ్ :

ముజప్ఫిలంగడ్ బీచ్ కేరళలో ప్రాముఖ్యమైన బీచ్. ఇది ఎన్‌హెచ్17కు సమాంతరంగా ఉంది. ఇది ఏసియాలోనే ఏకైక డ్రైవ్ బీచ్. ఏప్రెల్ నెల దీన్ని సందర్శించడానికి అనువైనది.

3. కార్వార్ నుంచి మంగళూరు :

3. కార్వార్ నుంచి మంగళూరు :

కార్వార్ నుంచి మంగళూరు మార్గంలో ఓవైపు సముద్రం మరో వైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఈ మార్గంలో ఒక చోట కలి నది ఆరేబియా సముద్రంలో కలుస్తుంది. కొబ్బరి చెట్లు ఆహ్లాదాన్ని కల్పిస్తాయి.

4. కసర్‌గడ్ నుంచి కొచ్చి :

4. కసర్‌గడ్ నుంచి కొచ్చి :

ఈ మార్గంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కంసర్‌గడ్ మసీదు, బెకల్ మరియు చంద్రగిరి కోటలు ఉన్నాయి. వాస్కోడిగామా అడుగుపెట్టిన కప్పాడ ఈ దారిలోనే ఉంది.

5. విశాఖపట్నం నుంచి రాజమండ్రి :

5. విశాఖపట్నం నుంచి రాజమండ్రి :

ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఇది ఎన్‍‌హెచ్5 మీద ఉంది. ఈ మార్గం ప్రయాణికులకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది కొస్తా తీరం వెంబడి ఉంది.

6. ధనుష్‌కోడి నుంచి కన్యాకుమారి :

6. ధనుష్‌కోడి నుంచి కన్యాకుమారి :

ధనుష్‌కోడి నుంచి కన్యాకుమారి ప్రయాణం తీర్థయాత్ర వంటిది. తీరాలను తాకే అలలు, అనైముడి కొండల నుంచి దిగివచ్చిన మేఘాలు చూడచక్కగా ఉంటాయి.

7. ముంబై నుంచి రత్నగిరి :

7. ముంబై నుంచి రత్నగిరి :

ఈ మార్గం ఎన్‌హెచ్ 66 మీద ఉంది. చాలా రకాల పక్షులు, జంతువులు ఈ మార్గంలో కన్పిస్తాయి. ఘాట్ రోడ్డుల్లో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.

8. చెన్నై నుంచి ట్రాన్క్విబార్ :

8. చెన్నై నుంచి ట్రాన్క్విబార్ :

ఇది భారతదేశంలోనే అతి సుందరమైన డ్రైవ్ ప్రాంతం. ఇది సేదతీరడానికి చాలా మంచి ప్రదేశం. ఇది సింగిల్ లేన్ రహదారి.

Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు

Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు

Most Read Articles

English summary
here is about the 8 beautiful drives in india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X