రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న దెయ్యాలు

Written By:

దేశంలో ప్రయాణికులు రైల్వే రవాణా ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరుకోవాలంటే ముందుగా సమీప రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. అంటే రైల్వే రవాణాలో రైల్వే స్టేషన్లు కూడా ఎంతో కీలకంగా ఉన్నాయి.

కాని ఈ మధ్య కాలంలో కొన్ని ఇండియన్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు అనుకోని సంఘటనలకు గురవుతున్నారు. వివిధ కారణాల వలన రైల్వే స్టేషన్లో ఉండిపోయిన కొన్ని ప్రేతాత్మలు రైల్వే ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రయాణికులను ముప్పుతిప్పలు పెట్టే ప్రేతాత్మలు సంచరిస్తున్న ఇండియన్ రైల్వే స్టేషన్లు గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

1. బరోగ్ రైల్వే స్టేషన్ - షిమ్లా

కల్నల్ బరోగ్, బరోగ్ రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో నెం.33 వ టన్నెల్ కలదు. ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నపుడు సరిగ్గా 33 వ టన్నెల్‌కు సమీపంలోకి రాగానే కల్నల్ బరోగ్ ఆత్మ చిత్రం రూపంలో టన్నెల్ గోడల మీద ప్రతిబింబిస్తుంది అనే కథనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టన్నెల్ నిర్మాణానికి కల్నల్ బరోగ్ ఇంజనీరుగా వ్యవహరించే వాడు. దీని నిర్మాణ సమయంలో ఇతన్ని ఇక్కడే ఖననం చేసారు. అప్పటి నుండి ఈ చోద్యం జరుగుతూనే ఉంది.
Picture credit: Pinterest 

2. బేగున్‌కోడార్ రైల్వే స్టేషన్ - కలకత్తా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బేగున్‌కోడార్ రైల్వే స్టేషన్ ప్రేతాత్మలతో నిండి ఉంది అని దేశ వ్యాప్తంగా విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే దీని వెనకున్న అసలు విషయాన్ని సమీక్షిస్తే, సుమారుగా 1967 సం. ప్రాంతంలో స్టేషన్‌కు సమీపంలో తెల్లచీరలో మహిళ రాత్రి వేళల్లో ప్రయాణికులకు దర్శణమిచ్చేదని ఆ తరువాత వారు చనిపోతున్నారని తెలిసింది. ఇదే కారణంగా 1967 లో ఈ స్టేషన్‌ను మూసేసారు. తరువాత శతాబ్దంలోకి అడుగుపెట్టిన తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ గారు సుమారుగా 42 ఏళ్ల తరువాత 2007 లో ఈ స్టేషన్‌ను తిరిగి పునరుద్దరించి ప్రారంభించారు.
Picture credit: nacho3-deviantart 

3. రబీంద్ర సరోబర్ మెట్రో - స్టేషన్ కలకత్తా

పశ్చిమ బెంగాల్ రాజధాని నగరంలో ఉన్న మెట్రోలో అందమైన స్టేషన్ రబీంద్ర సరోబర్ మెట్రో స్టేషన్. కాని ఈ స్టేషన్‌లో చివరి రైలు వెళ్లిపోయిన తరువాత దీనిని మించిన భయంకరమైన స్టేషన్ మరొకటి ఉండదు అనేంత భయంకరంగా ఉంటుంది. దీనిని ప్రారంభించిన తరువాత ఇక్కడ వేగంగా వెళుతున్న రైళ్లకు ఎదురుగా అడ్డంగా దూకి ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ప్రతి రోజు చివరి రైలు వెళ్లిపోయిన తరువాత ఆత్మలు నీడల రూపంలో సంచరిస్తున్నాయని ఎంతో మంది ప్రయాణికులు ప్రత్యక్ష అనుభవం గడించారట.
Picture credit: listosaur 

4. ద్వారక సెక్టార్ 9 మెట్రో స్టేషన్ - ఢిల్లీ

ద్వారక సెక్టార్ 9 మెట్రో స్టేషన్ ఢిల్లీ మహానగరంలో ఉన్న ప్రజానీకానికి కూడా ప్రేతాత్మల ఇబ్బంది తప్పలేదు. ఈ స్టేషన్ మరియు స్టేషన్ చుట్టు ప్రక్కల ఒక మహిళ ప్రేతాత్మ తెల్లటి చీరలో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. బయటి వైపున కార్లను వెంబడించడం, కార్ల తలుపులు కొట్టడం మరియు దొరికిన వారి చెంప చెల్లుమనిపించడం వంటివి చేస్తోంది అనే కథనం ప్రస్తుతం ఉంది.
Picture credit: fififlowers 

5. ఎమ్‌జి రోడ్డు మెట్రో స్టేషన్ - గుర్గావ్

ఇంతకు మునుపటి కథనాలకు ఈ కథనానికి కొంచెం వ్యత్యాసం ఉంది. ఈ రైల్వే స్టేషన్‌లో ఒక వృద్దురాలు పట్టాలు దాటుతూ రైలు ప్రమాదంలో మరణించింది. అయితే ఆమె ఆత్మ రూపంలో ఇక్కడే సంచరిస్తోంది అనే కథనం అక్కడ ఉంది. ఒక్కోసారి ఆమె నడుస్తున్న రైలు చివరి భాగంలో కూర్చుని పళ్లు ఇకలిస్తూ, నూరెళ్లబెడుతూ వెళుతుందనే సమాచారం అక్కడ చక్కర్లు కొడుతోంది.
 Picture credit: Wiki Commons

6. నైని రైల్వే స్టేషన్ - ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న నైని రైల్వే స్టేషన్‌లో చాలా మంది చనిపోయిన ఆత్మలు ఇక్కడ సంచరస్తున్నాయి అనే కథనం ప్రచారంలో ఉంది. అసలు విషయం గురించి తీవ్రంగా ఆరాతీస్తే, ఈ రైల్వే స్టేషన్‌కు సమీపంలో నైని జైలు కలదు, ఇందులో స్వాతంత్ర్యం కోసం పోరాడి యోధులు భారీగా మరణించారట, అయితే ఈ ఆత్మలు నైని రైల్వే స్టేషన్‌ను ఆవాసంగా చేసుకున్నట్లు వదంతులు.
Picture credit: piximus 

7. చిత్తూరు రైల్వే స్టేషన్ - ఆంధ్ర ప్రదేశ్

అక్టోబరు 31, 2013 న న్యూ ఢిల్లీ -బౌండ్ కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు చిత్తూరు రైల్వే స్టేషన్‌లో ఆగి ఉంది. పట్టాలకు ఇరువైపులా వాతావరణం నిర్జీవంగా ఉంది. అంతలో అక్కడికి సిఆర్‌పిఎఫ్ ఉద్యోగి అయిన హరి సింగ్ ఇద్దరు టిటిఇ (ట్రావెలర్ టికెట్ ఎగ్జామినర్) ఉద్యోగుల చేత ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో గొడవ కాస్త పెద్దదిగా మారి ఆర్ పి ఎఫ్ ఉద్యోగి మరియు ఇద్దరు టిటిలు హరిసింగ్ మీద దాడికి పాల్పడ్డారు. అనతరం రైలు స్టేషన్ దాటిపోయింది, హరిసింగ్ ఆస్పత్రి పాలైపోయాడు. చివరికి ప్రాణాలు కోల్పోయిన హరిసింగ్ చిత్తూరు రైల్వేస్టేన్‌లో న్యాయం కోసం పోరాడుతున్నాడని వదంతులు వివిపిస్తున్నాయి.
Picture credit: vividscreen

8. లుధియానా రైల్వే స్టేషన్ - లుధియానా

దేశంలో అత్యంధికంగా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో లుధియానా ఒకటి. ఈ స్టేషన్‌లో రిజర్వేషన్ గదికి ప్రక్కనే ఉన్న మరో గదిలో అతి భయంకరంగా విపరీతమైన అరుపులు వినిపిస్తుంటాయి అనేది అక్కడ అనుభవం పొందిన ప్రయాణికుల కథనం. అయితే అసలు విషయం గురించి ఆరాతీస్తే ఇందులో రిజర్వేషన్ ఉద్యోగిగా పనిచేసిన సుభాష్ 2007 లో మరణించాడు, అయితే మరణానంతరం కూడా ఉద్యోగం మీద ఉన్న మక్కువ అతను చనిపోయాక కూడా ఆత్మ రూపంలో సంచరిస్తున్నాడు అని తెలిసింది.
Picture credit: wandereringsoul.deviantart 

  

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రైలు #rail
Story first published: Tuesday, July 5, 2016, 13:21 [IST]
English summary
8 Most Haunted Train Stations In India
Please Wait while comments are loading...

Latest Photos