ఇక్కడ విమానం దిగాలంటే ప్రపంచ వ్యాప్తంగా 8 మంది పైలట్లు మాత్రమే అర్హులు

By Anil

ఇండియాకు మిత్ర దేశమైన భూటాన్‌ హిమాలయాల అందాలకు అణువణువునా నిదర్శనం. ఈ భూటాన్‌లో పారో అనే అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇలాంటి సుందరమైన ప్రదేశాలలో విమానాశ్రయం ఉండటం సర్వసాధారణమే అనే కదా మీ సందేహం. దీనికి ఒక విశేషం ఉందండోయ్, అదేంటంటే మిగతా విమానాశ్రయాల మాదిరిగా నిటారుగా, తిన్నగా విమానం దిగే అవకాశం ఏ మాత్రం ఇందులో లేదు. విమానాన్ని వంపుతూ, వాల్చూతూ ఇక్కడకు తీసుకొచ్చి ల్యాండ్ చేయాలి. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఎనిమిది మంది పైలట్లు మాత్రమే ఇక్కడ విమానాలు ల్యాండ్ చేయగలరు. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

పారో విమానాశ్రయం

హిమాలయ పర్వతాలలో ఉండే ఈ పారో విమానాశ్రయంలో సుందరమైన కొండల మధ్య 6,500 అడుగుల మేర పొడవైన రన్‌వే కలదు.

Picture credit: Douglas J. McLaughlin/Wiki Commons

పారో విమానాశ్రయం

సుమారుగా 18,000 అడుగులు ఎత్తైన కొండల మధ్య విమానం నేలకు సమాతరంగా ప్రయాణించలేదు. అందుకు పైలట్ విమానాన్ని కొంత కోణంలో వంపులకు గురిచేస్తూ నడుపుతాడు. ఇక ఇందులో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం ఆద్యంతం విస్మయపోతూ భయానికి గురవుతుంటారు.

Picture credit: STR/Reuters/Corbis

పారో విమానాశ్రయం

ఈ భయంకరమైన విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేసే అర్హత ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఎనిమిది మంది పైలట్లకు మాత్రమే ఉంది. ఇలాంటి ప్రదేశాలలో విమానాన్ని ల్యాండ్ చేసే సామర్థ్యం ఉన్న వారు కేవలం ఎనిమిది మంది మాత్రమే.

Picture credit: keyword-suggestions

పారో విమానాశ్రయం

సముద్ర మట్టానికి గరిష్టం ఎత్తులో, చుట్టూ కొండల మధ్య అత్యంత ఇరుకుగా ఉండే విమానాశ్రయాలలో అతి తక్కువ పొడవైన రన్‌వే‌ను (కేవలం 6,500 అడుగులు) కలిగి ఉన్న విమానాశ్రయం కూడా ఇదే.

Picture credit: Youtube/Wiki Commons

పారో విమానాశ్రయం

భూటాన్ ఆధారిత రాయల్ భూటాన్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇక్కడికి విమాన సేవలందిస్తోంది. ఈ సంస్థ మాత్రమే ఇక్కడ సేవలందిస్తోంది.

స్పేర్ వీల్‌కు స్టెప్నీ అనే పేరు ఎలా వచ్చింది ?

విదేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ వాడితే ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు

పారో విమానాశ్రయం

భూటాన్ దేశం యొక్క రాజధాని నగరమైన థింఫూ నగరానికి అతి సమీపంలో ఉన్న ఈ పారో విమానాశ్రయంలో విమానాలు కేవలం పగటి పూట మాత్రమే ల్యాండింగ్ మరియు టేకాఫ్ తీసుకుంటాయి.

పారో విమానాశ్రయం

ప్రపంచ దేశాలకు విమానాలను సరఫరా చేస్తున్న సంస్థ బోయింగ్ ఈ విమానాశ్రయాన్ని సందర్శించి, ల్యాండిగ్ మరియు టేకాఫ్ తీసుకోవడానికి అత్యంత ఇబ్బందికరమైన విమానాశ్రయంగా స్పష్టం చేసింది.

Picture credit: Doug Knuth/Wiki Commons

పారో విమానాశ్రయం

పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేకంగా నిలిచిన ఈ ప్రాంతానికి ఏటా సుమారుగా 30,000 మంది యాత్రికులు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Picture credit: Göran Höglund/Wiki Commons

పారో విమానాశ్రయం

అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌గా పేరుగాంచిన నేపాల్ దేశానికి చెందిన బుద్ద్ ఎయిర్ లైన్స్‌ విమానాలకు ఇక్కడ ల్యాండింగ్ అవకాశం కలదు. పారో కు వెళ్లాలంటే సమీపం ఎయిర్ పోర్ట్‌లకు చేరుకుని పారోకు వెళ్లాల్సి ఉంటుంది.

Picture credit: shrimpo1967/Wiki Commons

పారో విమానాశ్రయం

పొడవైన రన్‌‌వేలు ఉన్న 10 భారత విమానాశ్రయాలు

ఇండియాలో ఉన్న ఆరు అందమైన ఎయిర్‌పోర్ట్‌లు

Most Read Articles

English summary
There Are Only 8 Pilots In The World That Are Qualified To Fly To This Airport
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X