నిద్రపోయే డ్రైవరును అప్రమత్తం చేసే కార్ సీట్

By Ravi

ఎక్కువ దూరం డ్రైవ్ చేసినప్పుడు అలసట వచ్చి కంటిపై కునుకు పడటం సాధారణం. అలాగే, బాగా అలసటగా ఉన్నప్పుడు లేదా సరిగ్గా నిద్ర పోకుండా కారును నడినప్పుడు డ్రైవర్ వాహనాన్ని నడుపుతూనే నిద్రలోకి జారుకునే సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తే, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహించటానికి సాధ్యం కావు.

డ్రైవింగ్‌లో నిద్ర పోవటం చాలా ప్రమాదకరం, నిద్ర రాకుండా అరికట్టేందుకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలం అవుతూనే ఉంటాయి. అందుకే, కునుకు తీసే డ్రైవర్లను గుర్తించి, వారిని అప్రమత్తం చేసేందుకు కొత్త రకం కార్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

A Car Seat That Could Alert Sleepy Driver

నాటిన్ఘమ్ ట్రెంట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం తెలిపిన దాని ప్రకారం, కారుకు సీటుకు అమర్చిన సెన్సార్లు ఆ కారును నడిపే డ్రైవర్ గుండె చప్పుడును గుర్తించి వారిని అప్రమత్తం చేస్తాయి. ప్లెస్సీ సెమీకండక్టర్స్ అనే యూకే సంస్థ ఈ యూనివర్సిటీ బృందంతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఇది పరిశోధన దశలో ఉంది. ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోవటానికి ఆస్కారం ఉండకపోవచ్చు. మరి మీరేమంటారు..?
Most Read Articles

English summary
A team of researchers at Nottingham Trent University are working on a solution to alert asleep driver at the wheel. They're doing it with sensors in a car seat that detect the driver's heart rate, and alert the driver if they start dozing off.
Story first published: Thursday, August 7, 2014, 18:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X