అమెరికా అధ్యక్ష విమానం ఎయిర్ ఫోర్స్ వన్ గురించి చారిత్రాత్మక విశేషాలు

By Anil

అమెరికా అధ్యక్షున్ని ఎంచుకోవడానికి సమయం సమీపిస్తున్న తరుణంలో, ఎయిర్ ఫోర్స్ వన్ అధ్యక్షుని కోసం నూతన అధికారిక విహంగాన్ని అభివృద్ది చేస్తోంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఎయిర్ ఫోర్స్‌ వన్ నూతన విమానాన్ని అభివృద్ది చేస్తూ వస్తోంది.

దీని కోసం ప్రపంచ ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్ నూతన ఎయిర్ ఫోర్స్ వన్‌ను రూపొందిస్తోంది. గరిష్ట స్థాయి భద్రత ప్రమాణాలతో 2024 నాటికి అధ్యక్షుని కోసం అందుబాటులోకి రానుంది. ఈ విమానం గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో...

 ఎయిర్ ఫోర్స్ వన్ యొక్క చారిత్రాత్మక విషయాలు

అమెరికా ఒక కాలం నాటి అధ్యక్షుడు రూస్వెల్ట్ నుండి నేటి ప్రధాని ఒబామా వరకు అందరికీ బోయింగ్ విమానాలు సేవలందించాయి. బోయింగ్ 747 తో పరిచయం అయ్యి ఇప్పుడు 747-8 వరకు అభివృద్ది చెందుతూ వచ్చాయి.

 ఎయిర్ ఫోర్స్ వన్ యొక్క చారిత్రాత్మక విషయాలు

అమెరికా భవిష్యత్ అధ్యక్షుని కోసం సమగ్ర భద్రత ప్రమాణాలతో రూపొందుతోన్న 747-8 విమానం ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్న రెండు 747-200 విమానాలకు సమానంగా ఉంటుంది.

 ఎయిర్ ఫోర్స్ వన్ యొక్క చారిత్రాత్మక విషయాలు

సుమారుగా అర్థ శతాబ్దం పాటు బోయింగ్ సంస్థ అమెరికా అధ్యక్షులకు సేవలందించి రికార్డు సృష్టించింది. తరువాత కథనాలలో 747-8 విమానం యొక్క ప్రత్యేకతలు మరియు అమెరికా అధ్యక్షులు వారి వినియోగించిన రకరకాల విమానాల గురించి తెలుసుకుందాం...

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుని ఎయిర్ ఫోర్స్ వన్ గురించి...

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుని ఎయిర్ ఫోర్స్ వన్ గురించి...

ఇంతకు మునుపు అధ్యక్షులు వినియోగించిన విమానాలతో పోల్చితే ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వన్‌లో అమెరికా అధ్యక్షునికి సేవలందిస్తున్న బోయింగ్ 747-200 విమానం అత్యంత శక్తివంతమైనది మరియు అతి పెద్ద అధ్యక్ష విమానం ఇది.

 ఎయిర్ ఫోర్స్ వన్ యొక్క చారిత్రాత్మక విషయాలు

  • అధ్యక్ష ప్రయాణాలకు వివియోగించే విమానాలలో లాంగ్ రేంజ్ గల విమానం ఇది.
  • గగన తలంలో ఇంధన నింపే పద్దతి.
  • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్ట్‌లలో స్వయం సమృద్ది (Self-sufficiency) గల విమానం.
  •  ఎయిర్ ఫోర్స్ వన్ యొక్క చారిత్రాత్మక విషయాలు

    ఈ బోయింగ్ 747-200 విమానంలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లోర్ స్పేస్ కలదు.

     ఎయిర్ ఫోర్స్ వన్ యొక్క చారిత్రాత్మక విషయాలు

    • బోయింగ్ 747-200 అధ్యక్ష విమానంలో వసతులు,
    • కాన్ఫరెన్స్/డైనింగ్ రూమ్,
    • అధ్యక్షుడు మరియు అతని సతీమణికి ప్రత్యేక గది,
    • సీనియర్ స్టాఫ్‌కు ప్రత్యేక హాల్,
    • వైద్య అవసరాల కోసం ప్రత్యేక గది,
    •  ఎయిర్ ఫోర్స్ వన్ యొక్క చారిత్రాత్మక విషయాలు

      • అధ్యక్షుడి యొక్క సలహాదారుల కోసం పని మరియు విశ్రాంతి గదులు,
      • ఎయిర్ పోర్స్ వన్ ఉద్యోగులు మరియు మీడియా కోసం ప్రత్యేక హాల్,
      • ఒక్క సారి 100 మంది కూర్చుని భోజనం చేసే విధంగా సీటింగ్
      • ఎయిర్-ఎయిర్, ఎయిర్-గ్రౌండ్ మరియు శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు.
      • బోయింగ్ 747-200 మరియు 747-8 మధ్య గల వ్యత్యాసాలు

        బోయింగ్ 747-200 మరియు 747-8 మధ్య గల వ్యత్యాసాలు

        కాలుష్యం :

        బోయింగ్ 747-8 విమానం 747-200 కన్నా 16 టన్నులు తక్కువగా కాలుష్యాన్ని వెదజల్లును, అదే 747-200 వలన అయితే ఏడాదికి సగటున 13 ఎకరాల అమెరికా అడవి నాశనం అవుతోంది.

        రేంజ్

        రేంజ్

        బోయింగ్ 747-200 కన్నా 747-8 విమానం 1000 మైళ్ల అత్యధిక దూరం ప్రయాణిస్తుంది. 747-200 విమానం రేంజ్ - 6,735nmi మరియు 747-8 విమానం రేంజ్ 7,730nmi గా ఉంది.

        వేగం

        వేగం

        747-200 విమానం యొక్క గరిష్టం వేగం 0.84మ్యాక్ గా ఉంది మరియు 747-8 విమానం యొక్క గరిష్ట వేగం 0.855 మ్యాక్‌గా ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే కమర్షియల్ విమానం 747-8.

        టేకాఫ్ బరువు

        టేకాఫ్ బరువు

        747-200 విమానం టేకాఫ్ తీసుకున్నపుడు గరిష్టంగా మోయగలిగే బరువు 8,33,000 పౌండ్లు ఉంటుంది అయితే 747-8 విమానం గరిష్టంగా తీసుకుళ్లే బరువు 9,87,000 పౌండ్లుగా ఉంది.

        రెక్కల పొడవు

        రెక్కల పొడవు

        747-200 రెక్కల పొడవు 195 అడుగులు అయితే 747-8 విమానం యొక్క వింగ్ స్పాన్ 224 అడుగులుగా ఉంది.

        విమానం పొడవు

        విమానం పొడవు

        747-200 విమానం యొక్క మొత్తం బాడీ పొడవు 231 అడుగులు మరియు 747-8 విమానం యొక్క బాడీ పొడవు 250 అడుగులుగా ఉంది.

        1943 లో

        1943 లో

        1943, బోయింగ్ 314 కాలిపర్, అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూస్వెల్ట్

        1942-1945

        1942-1945

        • 1942-1945, డుగ్లాస్ సి-54సి (డిసి-4) స్కైమాస్టర్,
        • అధ్యక్షుడు: ఫ్రాంక్లిన్ డి. రూస్వెల్ట్ మరియు హ్యార్రీ ఎస్. ట్రుమాన్.
        • 1947-1953

          1947-1953

          • 1947-1953 , డుగ్లాస్ విసి-118 (డిసి-6) లిఫ్ట్ మాస్టర్
          • అధ్యక్షుడు: ఎస్. ట్రుమాన్
          • 1959-1962

            1959-1962

            • 959-1962, బోయింగ్ 707, విసి-137ఎ
            • అధ్యక్షులు: డ్విట్ డి. ఈసెన్‌హోవర్, జాన్ ఎఫ్.కెన్నెడీ, లిండన్ బి. జాన్సన్, రిచర్డ్ ఎమ్. నిక్సాన్ వీరందరూ ఈ విమానాన్ని వినియోగించారు.
            • 1962-1990

              1962-1990

              • 1962-1990, బోయింగ్ 707, విసి-137సి
              • అధ్యక్షులు: జాన్ ఎఫ్.కెన్నెడీ, లిండన్ బి. జాన్సన్, రిచర్డ్ ఎమ్. నిక్సాన్, గెరాల్డ్ ఆర్. ఫోర్డ్, జేమ్స్ ఇ. కార్టర్, రోనాల్డ్ డబ్ల్యూ, రీగాన్, జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ వంటి వారి దీనిని వినియోగించారు.
              • 1990- ప్రస్తుతం...

                1990- ప్రస్తుతం...

                • 1990-ప్రస్తుతం, బోయింగ్ 747, విసి-25ఎ
                • అధ్యక్షులు: జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్, విలియమ్ జె. క్లింటన్, జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్, బరాక్ హెచ్. ఒబామా.
                • .

                  • దేశాధిపతులు మరియు వారి రాయల్ కార్లు

Most Read Articles

English summary
Amazing Historical Facts About Air Force One
Story first published: Thursday, August 11, 2016, 15:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X