విమాన ఇంజన్‌తో నడిచిన ప్రపంచపు మొదటి రైలు: స్టన్నింగ్ ఫ్యాక్ట్స్

ఇప్పుడు మన ఇండియన్ రైల్వేలోని రైళ్లు గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగం కన్నా వెళ్లవు. కాని 1970 లో నిర్మించిన ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచింది. ఈ రైలు గురించి మరిన్ని వివరాలు...

Written By:

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో గరిష్ట వేగంతో ప్రయాణించే రైలు గటిమాన్ ఎక్స్‌ప్రెస్. దీని గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లుగా ఉంది. అయితే 1970 ల కాలంలోనే విదేశీయులు సృష్టించిన రైలు ద్వారా ఈ వేగాన్ని అందుకున్నారు. ఇప్పుడు వారి వద్ద ఉన్న రైళ్లు 300 కిలోమీటర్లకు పైబడి వేగంతో ప్రయాణిస్తున్నాయి.

సుమారుగా 45 ఏళ్ల క్రితం అంత వేగంతో రైలు ఎలా నడిచింది. మిమ్మల్నే కాదు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. దీని గురించి నెట్టింట్లో కర్సర్ పెట్టి కాస్త లోతుగా శోధిస్తే అసలు విషయం బయటపడింది. 1970 ల కాలంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన రైలు గురించి హిస్టరీ ఏం చెప్తోందో చూద్దాం రండి.

విభిన్నమైన డిజైన్‌లో కనబడుతున్న ఈ రైలును చూశారా , దీనిని 1970 లో తయారు చేశారు. ఈ రైలు పూర్తిగా టర్బోజెట్ ద్వారా నియంత్రించబడేది.

రైలులోని ఇంజన్‌కు టుర్బోజెట్ అనుసంధానం ఉంటుంది. తద్వారా ఇది గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేది అయితే ఎక్కువ ఇంధనం తీసుకోవడం వలన ఈ కాన్సెప్ట్‌ను ప్రక్కకు నెట్టేశారు.

అప్పట్లో అచ్చం ఇలాంటి రైలునే అమెరికా కూడా డిజైన్ చేసింది. అయితే ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసే విధంగా గంటకు 183 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించి రికార్డుకెక్కింది.

విమాన రెక్కల మీద పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయి గమనించారా..? అలాంటి రెండింటిని ఈ రైలు మీద అందించారు. అప్పట్లో ఈ రైలు నిర్మాణం తరువాత, భవిష్యత్తు రైళ్లన్నీ ఇలానే ఉంటాయని దీనిని పొగడ్తలతో ముంచెత్తారు. అదే రైలు ఇప్పుడు ఎటూ పనికిరాకుండా ప్రక్కన పడి ఉంది.

1970 ల కాలంలోనే అంతటి గరిష్ట వేగాన్ని అందుకోవడానికి ఇంజన్ పై భాగంలో అమర్చిన టుర్బో జెట్ కు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ రైలు ఆ వేగాన్ని అందుకోవడానికి ముఖ్య కారణం అదే.

చూడటానికి ఎంతో ఆకర్షణీయమైన డిజైన్‌లో ఉన్నప్పటికీ ఎక్కువ ఇంధనాన్ని తీసుకుంటోంది అనే నెపంతో ఇలా ఖాళీగా ప్రక్కకు నెట్టేశారు. ప్రయోగాత్మక దశలోనే ఈ ప్రాజెక్ట్ చతికిల పడిపోయింది.

టుర్బో జెట్ ఇంజన్ ద్వారా రైలును నడిపిన ఘనత అమెరికాదే. న్యూయార్క్ సెంట్రల్ రైల్ రోడ్ లో పనిచేసే డాన్ వెట్జెల్ ఈ రూపకల్పనకు ముఖ్య కారకుడని చెప్పాలి.

టుర్బోజెట్ ద్వారా నియంత్రించబడే ఇంజన్‌ను రైలు ప్రవేశపెట్టాడు. అయితే ఎక్కువ ఇంధనాన్ని తీసుకోవడం వలన ప్రాజెక్ట్ పట్టాలు తప్పింది. అయితే గంటకు 183 కిలోమీటర్ల వేగాన్ని పొందడంలో అందరినీ అబ్బురపరిచింది.

1960 ల కాలంలో డాన్ వెట్జెల్ అనే ఇంజనీరు ఈ టుర్బో జెట్ రైలును అభివృద్ది చేశాడు. తక్కువ ఖర్చు, అధిక భద్రతతో వేగవంతమైన రైలు రూపకల్పనలో భాగంగా ఎమ్-497 బ్లాక్ బీటిల్ రైలును అభివృద్ది చేసాడు.

అప్పట్లో విమానాలలో వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ జె47-19 అనే ఇంజన్‌ను రైలు ముందు భాగంలో ఉన్న కొనలో అమర్చాడు. ప్రమాదానికి గురి కాకుండా దానిని ప్రత్యేకంగా మెటల్ కవర్‌తో భద్రంగా మూసేశాడు.

విమానంలో వినియోగించిన ఇంజన్‌ను రైలులోని ఇంజన్‌తో అనుసంధానం చేసి టుర్బో జెట్ రైల్ కార్ ఇంజన్‌ను అభివృద్ది చేసి, టుర్బో జెట్ నియంత్రిత రైలును ఆవిష్కరించాడు.

యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ వారి వద్ద నుండి 5,000 అమెరికన్ డాలర్లకు విమానంలోని ఇంజన్‌ను కొనుగోలు చేశాడు డాన్.

టుర్బో జెట్ రైలులోని వినియోగించిన విమానం యొక్క ఇంజన్ కన్వీయర్ బి-36 అనే ఖండాతర బాంబర్ విమానంలో ఉపయోగించేవారు. 5,000 హార్స్‌‌పవర్ వరకు శక్తిని విడుదల చేసే అత్యంత సరసమైన ఇంజన్ అప్పట్లో అదే.

1966 లో పూర్తి స్థాయిలో అభివృద్ది చేసిన రైలును ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అందరినీ విస్మయానికి గురి చేస్తూ గంటకు 183 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. అయితే అధిక ఇంధనాన్ని తీసుకోవడంతో దానిని అలాగే వదిలేశారు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రైలు #rail
Story first published: Friday, November 18, 2016, 12:41 [IST]
English summary
Abandoned Soviet Jet Train Capable Of Travelling At 160mph
Please Wait while comments are loading...

Latest Photos