కారు కలెక్షన్‌లోనూ కిలాడీనే: అక్షయ్ కుమార్

By N Kumar

బాలీవుడ్‌లో ఉన్న విభిన్నమైన నటులలో అక్షయ్ కుమార్ ఒకడు. 1992 లో కిలాడిగా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యి ఆ తరువాత కిలాడి శ్రేణి సినిమాలతో అలరించాడు. తెలుగు ప్రేక్షకులకు అడ్వెంచర్స్ చేసే అక్షయ్ కుమార్‌గా సుపరిచితం అయిన అక్షయ్ నిజజీవితంలో కూడా అడ్వెంచర్స్‌కు ఎక్కువ ఇష్టపడుతాడు. సినిమాలలో ఎలాంటి కిలాడీనో కార్లు ఎంచుకునే విషయంలోని అంతే కిలాడీ.

తాను ఎంచుకునే కార్లను తానే స్వంతంగా నడపాలనే కోరుకుంటాడు అక్షయ్. అందుకే కాబోలు ఈ ధేహధారుడ్యుడు ఎవ్వరూ అంచనా వేయలేని విధంగా కార్లను ఎంచుకుంటాడు. కిలాడి వద్ద ఎలాంటి కార్లు ఉన్నయో క్రింది కథనంలో గుర్తించండి.

1. రోల్స్ రాయిస్ ఫాంటమ్

1. రోల్స్ రాయిస్ ఫాంటమ్

బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ తరువాత అక్షయ్ కుమార్ మాత్రమే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును కలిగి ఉన్నాడు. ఇది రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కన్నా ఖరీదైనదే. రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ధర రూ.3.34 కోట్లు నుండి ప్రారంభం అవుతుంది.

Photo Credit: Photo Bucket

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో 6.8 లీటర్ సామర్థ్యం ఉన్న వి12 వింజన్‌ కలదు. ఇందులోని ఇంజన్‌కు అనుసంధానం చేయబడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ నుండి చక్రాలకు శక్తిని సరఫరా చేస్తుంది.

 2. బెంట్లీ కాంటినెన్షియల్

2. బెంట్లీ కాంటినెన్షియల్

భారతీయ సెలబ్రిటీలలో అతి తక్కువ మంది ఎంచుకున్న కారు బెంట్లీ కాంటినెన్షియల్. సుమారుగా రూ. 3.21 కోట్ల ప్రారంభ ధరతో లభ్యమయ్యే ఈ కారును అక్షయ్ ఎంచుకున్నాడు.

Photo Credit: Pinkvilla

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

బెంట్లీ కాంటినెన్షియల్ కారులో 4.0 లీటర్ సామర్థ్య ఉన్న వి8 ఇంజన్ కలదు, ఇది సుమారుగా 500 బిహెచ్‌పి పవర్ మరియు 660 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ బెంట్లీ కాంటినెన్షియల్ కారులో 616 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 6.0 లీటర్ ఇంజన్ కలదు.

3. రేంజ్ రోవర్ వోగ్

3. రేంజ్ రోవర్ వోగ్

ఇండియన్ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన మరియు అధునాతన లగ్జరీ ఎస్‌‌యువిలలో ఇది ఎంతో ఉత్తమమైనది. దీని ధర రూ. 2.18 నుండి 2.75 కోట్ల మధ్య ఉంటుంది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్ వేరియంట్ అయిన 5 లీటర్ సామర్థ్యం ఉన్న వి8 టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ గల రేంజ్ రోవర్ వోగ్ కారును ఎంచుకున్నాడు.

4. పోర్షే కయేన్

4. పోర్షే కయేన్

పోర్షే సంస్థ ప్రపంచ వ్యప్తంగా అత్యధికంగా అమ్మకాలు చేపడుతున్న ఎస్‌యువిలలో కయేన్ ఒకటి. పనితీరు మరియు విలాసానికి సంభందించిన విషయాల పరంగా చూస్తే పోర్షే కయేన్ కారు మంచి మార్కులే తెచ్చుకుంది. పోర్షే కయేన్ ప్రారంభ ధర సుమారుగా రూ. 1.04 కోట్లు వరకు ఉంది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

పోర్షే కయేన్ ఎస్‌యువి ఇండియన్ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా లభిస్తోంది. టాప్ ఎండ్ వేరింట్ కేయాన్ ఎస్‌యువిలో 500 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 4.8 లీటర్ సామర్థ్యం ఉన్న వి8 పెట్రోల్ ఇంజన్ కలదు.

5. అక్షయ్ కుమారక్ హోండా సిఆర్-వి

5. అక్షయ్ కుమారక్ హోండా సిఆర్-వి

ఉత్తమ ఇంజన్ మరియు రియలయబుల్ ఎస్‌యువిగా ఇండియన్ మార్కెట్లో పేరుగాంచిన వాటిలో హోండా సిఆర్-వి ఒకటి. సాధారణ ట్రిప్‌ల కోసం అక్షయ్ కుమార్ ఈ ఎస్‌యువిని వినియోగిస్తున్నాడు. దీనిని నడుపుతున్నపుడు సాధారణ సెడాన్ కారును డ్రైవ్ చేస్తున్నట్లుంటుందని అక్షయ్ తెలిపాడు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

హోండా సిఆర్-వి రెండు పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి 2.0 లీటర్ మరియు 2.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లు. హోండా సిఆర్-వి ఎస్‌యువి యొక్క ప్రారంభ ధర సుమారుగా రూ. 21.09 లక్షలుగా ఉంది.

మీకు నచ్చిన సెలబ్రిటీల కార్ల గురించి చదవండి...

ఖరీదైన కార్లను కలిగి ఉన్న దక్షిణ భారత సినీతారలు

కోట్ల మంది అభిమానించే సచిన్ ఎవరి అభిమానో తెలుసా ?

మీకు నచ్చిన సెలబ్రిటీల కార్ల గురించి చదవండి...

మైఖేల్ జాక్సన్ జ్ఞాపకాలు.. :(

ఇండియన్ సెలబ్రిటీలు కార్లను ఇలా కస్టమైజ్ చేయించుకుంటారా ?

Most Read Articles

English summary
Actor Akshay Kumar Luxury Car Collection
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X