అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుకగా బిఎమ్‌డబ్ల్యూ

By Anil

టాలీవుడ్ హీరో అక్కనేని నాగార్జున తన 57 వ పుట్టిన రోజు వేడుకలను ఆగష్టు 29 న జరుపుకున్నాడు. అయితే 2016 బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును తనంతట తానుగా బహుకరించుకున్నాడు. అత్యంత అరుదైన ఉండే ఫ్రాజెన్ బ్లూ రంగుల్లో ఉండే 750ఎల్ఐ ఎక్స్‌డ్రైవ్ ఎమ్ స్పోర్ట్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు గురించి పూర్తి వివరాలు.

అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుగా బిఎమ్‌డబ్ల్యూ

ఈ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు నాగార్జున ఎంచుకున్న రెండవది. ఇంతకు ముందు కూడా ఇలాంటి 7-సిరీస్ (ఎఫ్02 740ఎల్ఐ బ్లాక్) కారునే ఎంచుకున్నాడు. అయితే తన విభిన్నమైన కార్ల ఎంపికతో మరో సారి ఇతను బిఎమ్‌డబ్ల్యూ కార్ల ప్రేమికుడు నిరూపించుకున్నాడు.

అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుగా బిఎమ్‌డబ్ల్యూ

ప్రస్తుతం నాగార్జున ఎంచుకున్న 7-సిరీస్‌లో 4.4-లీటర్ సామర్థ్యం గల టర్బోఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 445బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును.

అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుగా బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ దీనిని తక్కువ బరువు ఉండే విధంగా డిజైన్ చేయడానికి అల్యూమినియం మరియు కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్‌డ్ పదార్థం (CFRP)తో డిజైన్ చేసింది. తద్వారా ఇది మునుపటి 7-సిరీస్ కారుతో పోల్చుకుంటే సుమారుగా 130 కిలోల తక్కువ బరువును కలిగి ఉంది.

అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుగా బిఎమ్‌డబ్ల్యూ

ఫీచర్ల పరంగా ఇందులో అత్యాధునిక ఫ్యూచర్ ఫీచర్లు ఉన్నాయి. అందులో గెస్చర్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ పార్కింగ్, బిఎమ్‌డబ్ల్యూ డిస్ల్పే కీ, బిఎమ్‌డబ్ల్యూ టచ్ కమాండ్ సిస్టమ్, వైర్ లెస్ ఛార్జింగ్ మరియు స్కై లాంగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుగా బిఎమ్‌డబ్ల్యూ

లీటర్‌కు 5.8 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల ఈ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు ధర రూ. 1.59 కోట్లు ఎక్స్ షోరూమ్‌గా ఉంది.

నాగార్జున గురించి

నాగార్జున గురించి

ప్రముఖ నటుడు స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు మరియు అక్కినేని అన్నపూర్ణమ్మ దంపతులకు ఆగష్టు 29, 1959 లో జన్మించాడు. నాగార్జున మొదటి సారిగా 1967 లో సుడిగుండాలు అనే సినిమాలో బాలనటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. 1984 లో దగ్గుబాటి లక్షిని పెళ్లి చేసుకున్నాడు, తరువాత 1992 లో అమల గారిని వివాహమాడారు. నాగచైతన్య మరియు అఖిల్ ఇద్దరు కుమారులున్నారు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కాని నాగార్జున ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఎమ్.ఎస్ చేశారు. అందుకే కాబోలు కార్లు మరియు బైకులంటే విపరీతంగా ఇష్టం.

.

అక్కినేని ఫ్యామిలీలోని కార్లు:అక్కినేని ఫ్యామిలీ కార్ కలెక్షన్

Most Read Articles

English summary
Nagarjuna Gifts Himselves With A Brand New Bimmer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X