సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్ "ఆదిత్య"

By Anil

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంతకు ముందు ఇస్రో చేసిన అన్ని ప్రయోగాల కన్నా ఇది ఎంతో ప్రత్యేకం.చంద్రుడితో వివిధ గ్రహాల మీద పరిశోధనలు జరపడంలో ఇస్రో తనదైన ముద్ర వేసుకుంది. ఇప్పుడు విశ్వానికే మూలమైన సూర్యుని మీద అధ్యయనం చేయడానికి సిద్దమైంది.

ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ మైలస్వామి అన్నాధురై మాట్లాడుతూ, ఆదిత్య ఎల్ 1 పేరుతో సూర్యుని మీద అద్యయనం చేయడాకి ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపాడు. వచ్చే 2019-2020 నాటికి దీనిని ప్రయోగించడానికి సంసిద్దం అవుతున్నట్లు కూడా తెలిపాడు. ఇస్రో చరిత్రలో మరొక కొత్త ప్రయోగానికి సిద్దమైన ఆదిత్య ఎల్1 గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

ఒక కాలేజిలో జరిగిన ప్రయివేట్ ఫంక్షన్ హాజరైన ఇస్రో శాటిలైట్ డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై మాట్లాడుతూ, 2019-2020 నాటికి సూర్యుడుని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్1 ను సిద్దం చేస్తున్నట్లు తెలిపాడు.

సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

ఇస్రో శాస్త్రవేత్తలు దీని మీద ఇప్పటికే ప్రయోగాలు కూడా మొదలు పెట్టారు. ఈ ఆదిత్య ఎల్1 మిషన్‌ను సుమారుగా 400 కిలోలు బరువు ఉండే విధంగా రూపొందిస్తున్నారు.

సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

ఈ ఆదిత్య ఎల్1 మిషన్‌ను భూమికి బాహ్య కక్ష్యలో సుమారుగా 800 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార కక్షలో దీనిని ప్రవేశపెట్టనున్నారు.

సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

ఈ వృత్తాకార వలయానికి దగ్గరలో ఉన్న లగ్రాంజియన్ పాయింట్ 1 వద్ద సరిగ్గా దీనిని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా సూర్యునికి మరియు ఈ ఆదిత్యం ఎల్1 మిషన్‌కు మధ్య అడ్డంగా ఏ విధమైన అవాంతరాలు రావు. దీని ద్వారా సూర్యున్ని నిరంతరం అధ్యయనం చేసే వీలు కలుగుతుంది.

సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

ఆదిత్యా ఎల్1 మిషన్ ముఖ్య ఉద్దేశ్యం సూర్యుడు విడుదల చేసే పైపైన ఉన్న కాంతి జ్వాలను పరీక్షించడమే.

సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

సూర్యుని వలయంలో కొన్ని మిలియన్ డిగ్రీ సెల్సియస్‌ల వేడి ఉంటుంది. ఈ వేడి ఎలా పుడుతోంది. అక్కడ నిరంతరం కాంతి మరియు వేడి ఎలా ఉద్భవిస్తోంది అనేది దానికి సౌర భౌతిక శాస్త్రంలో ఇప్పటికీ సమాధానం లేదు.

సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

ప్రస్తుతం ఇస్రో అభివృద్ది చేస్తోన్న ఆదిత్య ఎల్1 మిషన్ కేవలం సుర్యుని కాంతి గురించి మాత్రమే కాకుండా, సూర్యుని నుండి వెలువడే మృదు మరియు ధృడ ఎక్స్-రే కిరణాలు, యువి కిరణాలు వంటి వాటి గురించి కూడా అధ్యయనం చేయనుంది.

సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

ఇస్రో ఈ ప్రతిష్టాత్మకమైన ఆదిత్య ఎల్1 మిషన్‌ను పిఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు.

సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇండియా రష్యా యొక్క సాంకేతిక సహకారాలను కోరేది. అయితే ఇప్పుడు ఈ ఆదిత్య ఎల్1 ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు.

సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

  • ఇండియన్ ఇస్రో దాటికి బెంబేలెత్తుతున్న అమెరికన్ రాకెట్ లాంచింగ్ సంస్థలు
  • సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్

    • ప్రపంచ మార్గనిర్దేశకం ఇండియన్ ఇస్రో గురించి 20 ముఖ్య విషయాలు

Most Read Articles

English summary
Aditya L1 First Indian Mission To Study The Sun
Story first published: Tuesday, August 23, 2016, 10:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X