ఎగిరే మోటార్‌సైకిల్‌‌ను తయారు చేసిన ఏరోఫెక్స్..

By Ravi

విమానాలు, హెలికాఫ్టర్లనే కాకుండా కార్లను సైతం గాల్లోకి ఎగిరించగలమని నిరూపించారు మన పరిశోధకులు. కానీ, తాజాగా మోటార్‌సైకిళ్లను సైతం గాల్లోకి ఎగిరించగలమని చెబుతున్నారు అమెరికా చెందిన నిపుణులు.
నమ్మడానికి ఆశ్చర్యం కలిగించినా
ఇది నిజం.

అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన 'ఏరోఫెక్స్' (Aerofex) అనే కంపెనీ 'ఏరో-ఎక్స్' (Aero-X) అనే ఫ్లయింగ్ మోటార్‌సైకిల్ లేదా హోవర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఏరో-ఎక్స్ ఇతర ఫ్లయింగ్ మోటార్‌సైకిళ్ల మాదిరిగా కేవలం కాన్సెప్ట్ మాత్రమే పరిమితం కాకుండా, ఉత్పత్తి దశకు చేరుకోనుంది.

ఏరోఫెక్స్ తమ ఏరో-ఎక్స్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్‌ను 2017 నాటికి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. మీరు కావాలనుకుంటే, ఇప్పుడే ఏరోఫెక్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో ముందస్తు బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

ఏరో-ఎక్స్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్

ఏరోఫెక్స్ తయారు చేసిన ఫ్లయింగ్ మోటార్‌‌సైకిల్ ఏరో-ఎక్స్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ఏరో-ఎక్స్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్

మోటార్‌సైకిల్ మాదిరిగానే ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేందుకు వీలుగా ఏరో-ఎక్స్‌ను డిజైన్ చేశారు. అయితే, ముందు వెనుక చక్రాలకు బదులుగా రెండు పెద్ద కార్బన్ ఫైబర్ రోటర్లు ఉంటాయి.

ఏరో-ఎక్స్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్

హెలికాఫ్టర్ మాదిరిగా గాల్లోకి ఎగిరేందుకు ఈ రోటర్లు సహకరిస్తాయి. నేల నుంచి గరిష్టంగా 9 అడుగుల ఎత్తుకు ఎగిరేందుకు ఈ రోటర్లు ఉపయోగపడుతాయి.

ఏరో-ఎక్స్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్

ఈ హోవర్‌బైక్ లేదా ఫ్లయింగ్ మోటార్‌సైకిల్ బరువు 356 కిలోలు. ఇది 140 కేజీల బరువు వరకు మోయగలదు. ఉన్నచోటు నుంచే టేకాఫ్ అవ్వటం, ఉన్నచోటునే ల్యాండింగ్ కావటం (వెర్టికల్ టేకాఫ్ లేదా వెర్టికల్ ల్యాండింగ్) దీని ప్రత్యేకత. ఇందుకోసం ప్రత్యేక రన్‌వే లేదా హెలిప్యాడ్ అవసరం లేదు.

ఏరో-ఎక్స్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్

గాలిలో ఇది గంటకు 68 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్తుంది. ఫుల్ ట్యాంక్ చేస్తే సుమారు 75 నిమిషాల వరకు ఇది గాలిలో ఎగురుతుంది.

ఏరో-ఎక్స్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్

ఏరో-ఎక్స్‌ను నడపటం మోటార్‌సైకిల్‌ను నడపినంత సులువుగానే ఉంటుంది. ఇందులో మోటార్‌సైకిల్ లాంటి స్టీరింగ్ హ్యాండిల్ ఉంటుంది. రైడర్ కదలికలను బట్టి ఇది స్పందిస్తుంది.

ఏరో-ఎక్స్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్

ఏరోఫెక్స్ ఫౌండర్ మార్క్ డి రోచ్ తెలిపిన సమాచారం ప్రకారం, ఒక సగటు రైడర్ కేవలం ఒక్క వారంతపు శిక్షణతోనే దీనిని సులువుగా నడిపేయొచ్చు.

ఏరో-ఎక్స్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్

ఏరో-ఎక్స్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్ ధర 85,000 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.50 లక్షలు). కంపెనీ వెబ్‌సైట్‌లో 5,000 డాలర్ల రీఫండబల్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.

వీడియో

ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఏరో-ఎక్స్‌‌ను మరో మూడేళ్లలో మార్కెట్లోకి రిలీజ్‌ చేసేందుకు ఏరోఫెక్స్ సన్నాహాలు చేస్తోంది. ఈలోపుగా ఏరో-ఎక్స్ బైక్ పనితీరుకు సంబంధించిన వీడియోని వీక్షించండి.

Most Read Articles

English summary
Aero-X is a vehicle straight out of Hollywood sci-fi movies. Being developed by a california based company called Aerofex, the Aero-X is a flying motorcycle or rather a hoverbike.
Story first published: Thursday, May 22, 2014, 15:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X