భూమిని చుట్టి వచ్చే విమాన సర్వీసును ప్రారంభించిన ఎయిర్ ఇండియా

Written By:

ప్రపంచంలో కెల్లా అత్యంత దూరం ప్రయాణించే నాన్ స్టాప్ విమాన సర్వీసును ఎయిర్ ఇండియా ప్రారంభించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుండి శాన్‌ప్రాన్సిస్కో వరకు ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
 

ఇంతకుమునుపు ఢిల్లీ నుండి శాన్‌ఫ్రాన్సిస్కోకు అట్లాంటిక్ సముద్రం మీద నుండి విమానం సర్వీసు ఉండేది. అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా ఈ సర్వీసును ఫసిఫిక్ మహా సముద్రం మీద నుండి ప్రారంభించింది.

సుమారుగా 15,300 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని కేవలం 14.5 గంటల సమయంలో నాన్ స్టాప్‌గా ప్రయాణించి శానిఫ్రాన్సిస్కోను చేరుకోనుంది.

ఈ సర్వీసుకు వినియోగించిన విమానానికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఇందుకంటే మునుపు ఈ రెండు నగరాల మధ్య ఉన్న ప్రయాణం దూరాన్ని రెండు గంటల వరకు తగ్గించింది.

ఈ విమానంలోని తోక భాగంలో ఉన్న రెక్కలు ప్రత్యేకత మరో అంశం. ఇది గాలి వీచే దిశను బట్టి అనువుగా మారుతూ ఉంటుంది. కాబట్టి గాలి వలన కలిగే ఘర్షణ దాదాపుగా తగ్గిపోతుంది.

భూమి పడమర నుండి తూర్పు దిశ వైపుగా తిరుగుతుంది, కాబట్టి గాలులు కూడా అదే దిశలో వీస్తాయి. ఈ తరుణంలో పడమర వైపుకు ఆకాశంలో ప్రయాణించడం అనేది పెద్ద సవాలుతో కూడుకున్నది.

కాబట్టి తూర్పు దిశగా ప్రయాణించడం ఎంతో ఉత్తమం. దీని కోసం ఈ విమానంలో ఉన్న ప్రత్యేకమైన తోకరెక్క ఎంతగానో సహకరిస్తుందని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు.

సాధారణంగా పడమర దిక్కున అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణించినపుడు భూమి వ్యతిరేక దిశలో భ్రమిస్తుంది కాబట్టి గంటకు 24 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురు గాలులు  వీస్తాయి, ఆ సమయంలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సిన విమానం 776 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 

అదే తూర్పు దిశలో పసిఫిక్ సముద్రం మీద ప్రయాణిస్తే విమానం ప్రయాణించే దిశకు గాలి కూడా సహకరిస్తుంది. ఈ మార్గంలో విమానంతో పాటు వీచే గాలి వేగం గంటకు 138 కిలోమీటర్లుగా ఉంటుంది. తద్వారా గంటకు 938 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.

ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో విమాన సర్వీసులో రజనీష్ శర్మ, గౌతమ్ వర్మ, ఎమ్ఎ ఖాన్ మరియు ఎస్ఎమ్ పాలేకర్‌ అనే నలుగురు పైలట్లతో సహా 10 మంది విమాన సిబ్బంది ఇందులో ఉంటారు.

ఎయిర్ ఇండియా వారి ఢిల్లీ-శాన్‌ప్రాన్సిస్కో మరియు శాన్‌ఫ్రాన్సిస్కో-ఢిల్లీ మధ్య ప్రయాణించే వారు భూమిని చుట్టి రాగలరు. ఎందుకంటే శాన్‌ఫ్రాన్సిస్కో కు తుర్పు నుండి వెళ్లి మరియు భారత్‌ను పశ్చిమ దిశ నుండి చేరుకుంటుంది.

ఎయిర్ ఇండియా ఈ సర్వీస్ కోసం బోయిగ్ వారి లాంగ్ రేంజ్ విమానం బోయింగ్-777 200 ను వినియోగిస్తోంది.

ఈ విమానంలో ప్రయాణించే వారికి ఒక నెల వేసవి కాలం మరియు మూడు నెలలు చలి కాలం ఉంటుంది.

బోయింగ్-777 200 విమానం ఇంధనం కూడా చాలా తక్కువగా వినియోగించుకుంటుంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Thursday, October 27, 2016, 10:33 [IST]
English summary
Read In Telugu: Air India Starts Delhi San Francisco Nonstop Flight Service
Please Wait while comments are loading...

Latest Photos