అయితే కారు లేదంటే ఎగిరే కారుగా వాడుకోవచ్చు: ఎయిర్‌బస్ విన్నూత్న ఆవిష్కరణ

Written By:

ఇప్పటి వరకు అనేక సంస్థలు వివిధ ఆవిష్కరణ వేదికల మీద తమ ఎగిరే వెహికల్స్‌ను ప్రదర్శిస్తూ వచ్చాయి. వీటిలో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రపంచ విమాన ఉత్పత్తుల తయారీలో పేరుగాంచిన దిగ్గజ సంస్థ ఎయిర్‌బస్, గాలిలో ఎగిరే వెహికల్‌గా అదే విధంగా నేల మీద కారులా నడిచే సామర్థ్యం ఉన్న వాహనాన్ని ఆవిష్కరించింది. ఎయిర్‌బస్‌కు విమానాల తయారీలో మంచి అనుభవం ఉండటం కారణం చేత ఈ కాన్సెప్ట్ కార్యరూపందాల్చే అవకాశం ఉంది.

దిగ్గజ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ మరియు ప్రముఖ కోచ్‌బిల్డర్ ఇటాల్‌డిజైన్ సంస్థలు సంయుక్తంగా ఈ స్వయం చాలక ఎగిరే కారును ఆవిష్కరించాయి. గగన మరియు భూ తలం రెండింటిలో కూడా ఇది డ్రైవర్ అవసరం లేకుండా నడుస్తుంది.

ఎయిర్‌బస్ మరియు ఇటాల్‌డిజైన్ సంస్థలు ఈ ఆవిష్కరణకు పాప్.అప్ సిస్టమ్ అనే పేరును పెట్టాయి. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ కలదు, ఇది వ్యక్తిగత అవసరానికి, సాధ్యమయ్యే విభిన్న మార్గాలు, రవాణా అవకాశాలు మరియు అత్యుత్తమ ట్రావెల్ ఆప్షన్స్ అన్వేషించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.

ప్రాథమిక నిర్మాణం పరంగా చూస్తే ఇది ప్రయాణికులనే తరలించే పెట్టెలా ఉంటుంది. ఇందులోకి ప్రయాణికుడు ప్రవేశించిన తరువాత, చేరాల్సిన గమ్యాన్ని ఎంచుకుని రోడ్డు ద్వారా లేదా ఎయిర్ ట్రావెల్ అనే మోడల్‌లలో ఒక దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

పాప్.అప్ సిస్టమ్ గురించి ఎయిర్‌బస్ మాట్లాడుతూ, వీటిని హైపర్ లూప్ రవాణా వ్యవస్థలలో కూడా వినియోగించవచ్చని తెలిపింది. ఈ టెక్నాలజీ మీద ప్రస్తుతం ప్రయోగాలు చేపడుతున్నాము, పూర్తి స్థాయిలో అభివృద్ది చెందిన తరువాత విరివిగా వినియోగంలోకి తెస్తామని ప్రకటించింది

ప్రస్తుతం ఇలాంటి పరిజ్ఞానాన్ని అభివృద్ది చేస్తున్న మరియు వీటి అవసరం ఉన్న సంస్థలతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్లు ఎయిర్‌బస్ తెలిపింది.

ఈ వెహికల్‌ను పూర్తిగా ఎగిరే కారుగా లేదా నేల మీద మాత్రమే నడిచే కారుగా ఉపయోగించుకోవచ్చు. పైనున్న ఫోటోను గమనించండి: మధ్యలో ఉన్న భాగం ప్రయాణికుల క్యాబిన్, క్రింద ఉన్న విభాగం నేల పై నడవడానికి, పైనున్న విభాగం గాలిలో ఎగరడానికి.

ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రదేశాలలో ఇది ఆటోమేటిక్ సెల్ఫ్ పైలెటెడ్ ఎయిర్ వెహికల్‌గా మారిపోతుంది. అందుకోసం ఇందులో ఎనిమిది కౌంటర్ రొటేటింగ్ రోటార్లు ఉంటాయి.

ప్రయాణికులు ఒక్కసారి గమ్యస్థానానికి చేరుకున్న తరువాత, వాటంతట అవే చార్జింగ్ స్టేషన్లకు చేరుకుంటాయి. తరువాత రైడర్లు బుక్ చేసుకునే ప్రదేశానికి కూడా ఆటోమేటిక్‌గా చేరుకుంటాయి.

రోడ్డు మీద నడిచే ఈ ఫ్లయింగ్ కారులో 79బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ మోడ్‌లో కారు గరిష్టంగా 129కిలోమీటర్లు పరిధి వరకు ప్రయాణిస్తుంది.

ఎగిరే మోడ్‌లో ఈ కారులో నాలుగు మోటార్లు ఉంటాయి. ఇవి గరిష్టంగా 181బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తాయి. ఈ మోడ్‌లో కారు యొక్క గరిష్ట పరిధి 15 నిమిషాల పాటు సుమారుగా 97కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది.

ఈ ప్లయింగ్ కార్లు మార్కెట్‌ను చేరేంత వరకు, నేల మీద నడిచే నాలుగు చక్రాల కార్లే అన్ని రోడ్లను పాలిస్తాయి. ప్రస్తుతం మారుతి సుజుకి కార్లు భారీ సంఖ్యలో ఇండియన్ రోడ్లను చేరాయి, అతి త్వరలో మారుతి నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించనుంది. దీనికి చెందిన ఫోటోల కోసం....

 

Story first published: Friday, March 10, 2017, 16:07 [IST]
English summary
Airbus Reveals Flying Car Concept — Is This The Future of Cars?
Please Wait while comments are loading...

Latest Photos