ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

By Ravi

రైట్ సోదరులు మొట్టమొదటి సారిగా విమానాన్ని కనిపెట్టిన సంగతి మనందరికీ తెలిసినదే. వారు 22 అడుగులున్న తమ మొట్టమొదటి విమానాన్ని గాల్లోకి ఎగిరించారు. అలాంటి 14 విమానాలను ఒకేసారి ఈ ఫొటోలో కనిపిస్తున్న విమానంలో తీసుకువెళ్లవచ్చు. ఈ విమానం పేరు ఎయిర్‌ల్యాండర్ (Airlander). ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం ఇది.

సాధారణ విమానాలతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు అధునాతనంగా, విశిష్టంగా ఉండే ఎయిర్‌ల్యాండర్ విమానాన్ని బ్రిటీష్ కంపెనీ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ తయారు చేసింది. 300 అడుగుల పొడవు, జెప్లియన్ షేపులో ఉండే ఈ హీలియంతో నిండిన విమానం ప్రపంచంలోనే సరికొత్త విమానం. ఈ ఎయిర్‌ల్యాండర్ విమానానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

వాస్తవానికి ఎయిర్‌‌ల్యాండర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అమెరికన్ ప్రభుత్వం. తొలుత ఈ ప్రాజెక్టు కోసం అమెరికా నిధులు వెచ్చించినప్పటికీ, ఆ తర్వాత బడ్జెట్ కోతల కారణంగా ఈ ప్లాన్స్‌ను చెత్తబుట్టలో వేసేశారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

బ్రిటీష్ కంపెనీ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ (హెచ్ఏవి) తిరిగి ఎయిర్‌ల్యాండర్ ప్రాజెక్టుకు జీవం పోసింది. 40 భారీ క్రేట్ సైజు బాక్సులలో ఈ విమాన విడిభాగాలను ఇంగ్లాండ్‌లోని కార్డింగ్టన్‌లోని తమ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించింది.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

ఇంగ్లాండ్‌లోని కార్డింగ్టన్‌లో హెచ్ఏవి దాదాపు శతాబ్ధం క్రితం ఇలాంటి జెప్లియన్ విమానాలను తయారు చేసి, ఎగిరించేది. ఈ ఎయిర్‌ల్యాండర్ విమానం ఏకంగా 2700 పౌండ్ల బరువును 21 రోజుల పాటు నిరంతరాయంగా తీసుకువెళ్లగలదు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

తక్కువ దూరాలకైతే దాదాపు 5 టన్నుల బరువును తీసుకువెళ్లగలదు. ఎయిర్‌ల్యాండర్ ఎయిర్‌షిప్ ప్రపంచ విమాన చరిత్రలోనే సరికొత్త విప్లవాలకు తెరలేపనుంది.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

ఇది పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వస్తే, ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద కార్గో విమానంగా ఉన్న ఆంటోనోవ్ మ్రియా రష్యన్-ఉక్రెయిన్ కార్గో ప్లేన్ కన్నా ఇది 24 అడుగులు ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. అలాగే, ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ప్యాసింజర్ విమానమైన ఎయిర్‌బస్ ఏ380 కన్నా 60 అడుగులు పొడవుగా ఉంటుంది.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

సాంప్రదాయ విమానాలతో పోల్చుకుంటే ఎయిర్‌ల్యాండర్ దాదాపు 70 శాతం పర్యావరణ సాన్నిహిత్యమైనది. ఇది 60 శాతం హీలియం శక్తిని మిగిలిన 40 శాతం నాలుగు వి8 టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించుకొని గాల్లోకి ఎగురుతుంది.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

ఎయిర్‌ల్యాండర్ విమానం కోసం రన్‌వే అవసరం లేదు. ఇది నీటిపై, ఇసుకపై లేదా మంచుపై కూడా ల్యాండ్ కాగలదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రవాణా మార్గంలేని మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు ఈ ఎయిర్‌షిప్ చక్కగా ఉపయోగపడుతుంది.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

గతంలోని హీలియంతో నిండిన ఎయిర్‌షిప్‌ల మాదిరిగా, ఎయిర్‌ల్యాండర్‌ను ల్యాండ్ అయిన ప్రతిసారి నేలపైన తాళ్లతో కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది గాలి కన్నా ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ విమానాన్ని పైలట్ సాయం అవసరం లేకుండానే రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసేలా ఇంజనీర్లు దీనిని తీర్చిదిద్దారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

ఇద్దరు క్రూ సభ్యులతోనే ఎయిర్‌ల్యాండర్ విమానాన్ని నడపవచ్చు. అంతేకాదు ఇది నిరంతరాయంగా రెండుసార్లు ప్రపంచాన్ని చుట్టిరాగలదు. అయితే, ఇందుకు సాంప్రదాయ విమానాలకు పట్టే సమయం కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఎయిర్‌ల్యాండర్ కేవలం గంటకు 100 మైళ్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌ల్యాండర్'

ఎయిర్‌ల్యాండర్ ఫస్ట్ ఫ్లైట్ 2016 నాటికి జరగనుంది. రానున్న నాలుగేళ్ల పాటు ఏడాదికి 10 ఎయిర్‌ల్యాండర్ల చొప్పున తయారు చేయాలని నిర్ణయించుకున్నామని హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ పేర్కొంది.

మనదేశంలో కూడా ఇలాంటి ఎయిర్‌ల్యాండర్ ఎయిర్‌షిప్స్ అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుందో కదా..!

Most Read Articles

English summary
It’s as long as a football field, packed full of helium like a balloon, can stay up in the air for three weeks and might just change the way we travel around the globe. Introducing “Airlander,” a high-flying mega-blimp from Britain’s Hybrid Air Vehicles Ltd.
Story first published: Tuesday, May 20, 2014, 12:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X