అల్లాయ్ వీల్స్: ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు

By Ravi

అల్లాయ్ వీల్స్ సాధారణంగా బడ్జెట్ కార్లు/ఎంటట్రీ లెవల్ వేరియంట్లలో లభ్యం కారు. ఈ వీల్స్ కారుకు అందాన్నివ్వటమే కాకుండా, మంచి సేఫ్టీని కూడా ఆఫర్ చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి డిజైన్ చాలా ఆకర్షనీయంగా ఉండి, కారు ఓవరాల్ లుక్ అండ్ ఫీల్‌ని మార్చేయటంలో సహకరిస్తాయి.

సాధారణ స్టీల్ వీల్స్‌తో లభించే కార్లకు సైతం అల్లాయ్ వీల్స్ అమర్చుకోవచ్చు. అయితే, అల్లాయ్ వీల్స్ చాలా ఖరీదుతో కూడుకున్నవి, వీటికి ఉపయోగించే టైర్లు కూడా వేరుగా ఉంటాయి. కారుకు అల్లాయ్ వీల్స్‌ను అమర్చుకోవటం వలన కొన్ని ప్రయోజనాలు, అలాగే కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

అల్లాయ్ వీల్స్: ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు

తర్వాతి స్లైడ్‌లలో అల్లాయ్ వీల్స్ ప్రయోజనాలను, దుష్ప్రయోజనాలను తెలుసుకోండి.

అల్లాయ్ వీల్స్ గురించి

అల్లాయ్ వీల్స్ గురించి

అల్లాయ్ వీల్స్‌ని మాగ్ వీల్స్ లేదా క్యాస్ట్ వీల్స్ అని కూడా పిలుస్తారు. వీటిని సాధారణంగా అల్యూమినియం లేదా మెగ్నీషియం లేదా ఒక్కోసారి రెండింటినీ కలిపిన అల్లాయ్‌తో తయారు చేస్తారు. సాధారణంగా, టాప్-ఎండ్ మోడళ్లు, లగ్జరీ కార్లలోనే ఇలాంటి వీల్స్ లభిస్తుంటాయి. ప్రస్తుతం బడ్జెట్ కార్లలో కూడా అల్లాయ్ వీల్స్ ఆప్షనల్‌గా లభ్యమవుతున్నాయి.

అల్లాయ్ వీల్స్: ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు

అల్లాయ్ వీల్స్‌లో అత్యధిక శాతం క్యాస్ట్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ఉంటాయి. అలాగే, కొన్ని ఫోర్జ్డ్ మెగ్నీషియం అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. ఈ అల్లాయ్ వీల్స్ మంచి ధృడత్వాన్ని కలిగి ఉంటాయి. మొదట్లో కార్ వీల్స్‌ను స్టీల్ (ఇనుము/ఉక్కు)తో తయారు చేసేవారు, ఇవి కూడా మంచి ధృడత్వాన్ని, సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మోటార్‌స్పోర్ట్ ఇండస్ట్రీలో కూడా అల్లాయ్ వీల్స్ వాడకం గణనీయంగా పెరిగింది.

1. స్టయిలిష్ లుక్

1. స్టయిలిష్ లుక్

అల్లాయ్ వీల్స్ కనిపించినంత అందంగా స్టీల్ వీల్స్ కనిపించవు. అల్లాయ్ వీల్స్ కలిగిన కార్లు సైడ్ నుంచి ఆకర్షనీయంగా కనిపిస్తాయి. ఈ పోర్షే కేమ్యాన్ కారుకు అమర్చిన బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్ చూడండి.. ఇవి మీ కళ్లను ఆకట్టుకోవటం లేదా?

2. వేడిని తట్టుకోగలవు

2. వేడిని తట్టుకోగలవు

స్టీల్ వీల్స్‌తో పోల్చుకుంటే అల్లాయ్ వీల్స్ అధిక ఉష్ణోగ్రతలను కూడా హ్యాండిల్ చేయగలవు. వీల్ తిరిగేటప్పుడు పుట్టే వేడిని ఇవి సమర్థవంతంగా తట్టుకోగలవు. ఫలితంగా అల్లాయ్ వీల్స్ మంచి బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉండి, బ్రేక్ ఫెయిల్యూర్ రిస్క్‌ని తగ్గిస్తాయి.

3. మంచి పెర్ఫార్మెన్స్

3. మంచి పెర్ఫార్మెన్స్

స్టీల్ వీల్స్‌తో పోల్చుకుంటే అల్లాయ్ వీల్స్ తేలికపాటి నిర్మాణాన్ని కలిగి ఉండటం వలన మంచి పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇవి సస్పెన్షన్ పనితీరును మెరుగుపరచేందుకు, మంచి రోడ్ గ్రిప్‌ను ఆఫర్ చేసేందుకు కూడా సహకరిస్తాయి. ఈ వీల్స్ కలిగిన కార్ల హ్యాండ్లింగ్, స్టీరింగ్, కార్నరింగ్ మెరుగ్గా ఉంటుంది.

4. బెటర్ మైలేజ్

4. బెటర్ మైలేజ్

స్టీల్ వీల్స్ కన్నా అల్లాయ్ వీల్స్ తేలికపాటి నిర్మాణాన్ని కలిగి ఉండటం వలన, మైలేజ్ కూడా పెరుగుతుంది.

5. బ్రేకింగ్

5. బ్రేకింగ్

అల్లాయ్ వీల్స్‌లో వీల్ హాప్ తగ్గించడం వలన బ్రేకింగ్ సమయంలో టైరుకు, రోడ్డుకు మధ్య మంచి ట్రాక్షన్ (రాపిడి) కలిగి, బ్రేకింగ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

6. తుప్పు పట్టే అవకాశం తక్కువ

6. తుప్పు పట్టే అవకాశం తక్కువ

అల్లాయ్ వీల్స్‌ను అల్యూమనినియం అల్లాయ్‌తో తయారు చేసిన కారణంగా, స్టీల్ వీల్స్ మాదిరిగా ఇవి తుప్పు పట్టవు.

7. టైరు జీవితకాలం పెరుగుతుంది

7. టైరు జీవితకాలం పెరుగుతుంది

టైరు జీవితకాలాన్ని పెంచడం అల్లాయ్ వీల్స్ చక్కగా సహకరిస్తాయి. ఈ వీల్స్ ఉష్ణాన్ని తట్టుకుంటాయి కాబట్టి, టైర్లు త్వరగా అరిగిపోవు.

8. ట్యూబ్‌లెస్ టైర్లకు చక్కగా సూట్ అవుతాయి

8. ట్యూబ్‌లెస్ టైర్లకు చక్కగా సూట్ అవుతాయి

అల్లాయ్ వీల్స్ పూర్తిగా ఎయిర్‌టైట్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, ఇవి ట్యూబ్‌లెస్ టైర్లకు చక్కగా సూట్ అవుతాయి.

1. ధృడంగా ఉండవు

1. ధృడంగా ఉండవు

వాస్తవానికి అల్లాయ్ వీల్స్ కన్నా స్టీల్ వీల్సే ధృడంగా ఉంటాయి. వేగంగా వెళ్తూ ఏదైనా పాట్‌హోల్‌ను ఫేస్ చేసిన్పపుడు స్టీల్ వీల్స్ అయితే బెండ్ అవుతాయి, కానీ అల్లాయ్ వీల్స్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. స్టీల్ వీల్స్ బెండ్ తీయటం కుదురుతుంది, కానీ అల్లాయ్ వీల్స్ విషయంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి, మీరు నడిపే రోడ్డు స్థితిగతులను బట్టి వీల్స్ ఎంచుకోవటం మంచిది.

2. ఖరీదైనవి

2. ఖరీదైనవి

స్టీల్ వీల్స్‌తో పోల్చుకుంటే అల్లాయ్ వీల్స్ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అల్లాయ్ వీల్స్ తయారీ, కొనుగోలు, రిపేరుకు అయ్యే ఖర్చు అధికంగా ఉంటుంది. స్టీల్ వీల్స్‌తో పోల్చుకుంటే అల్లాయ్ వీల్స్ ఖర్చు దాదాపు 75-80 శాతం అధికంగా ఉంటుంది. మనదేశంలో అల్లాయ్ వీల్స్ ధరలు రూ.2,500 నుంచి రూ.50,000 వరకూ ఉంటున్నాయి.

3. దొంగలెత్తుకెళ్లే అవకాశం ఎక్కువ

3. దొంగలెత్తుకెళ్లే అవకాశం ఎక్కువ

స్టీల్ వీల్స్‌తో పోల్చుకుంటే అల్లాయ్ వీల్స్ ఎక్కువ ధరను కలిగి ఉంటాయి, కాబట్టి దొంగలకి కూడా అల్లాయ్ వీల్స్ ఆకర్షనీయంగా కనిపిస్తాయి. కాబట్టి, వీటిని దొంగలు అపహరించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో, లాకింగ్ నట్స్‌ను ఉపయోగించి అల్లాయ్ వీల్స్‌ను బిగించుకున్నట్లయితే, ఇవి చోరీకి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.

చివరిమాట

చివరిమాట

అల్లాయ్ వీల్స్ కారు అప్పీరెన్స్, పెర్ఫార్మెన్స్‌ను పెంచడంలో సహకరించినప్పటికీ, ఇవి స్టీల్ వీల్స్ కన్నా తక్కువ ధృడత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, మీరు నడిపే రోడ్లు సుందరంగా, స్మూత్‌గా ఉన్నట్లయితే అల్లాయ్ వీల్స్‌కి అప్‌గ్రేడ్ అవ్వండి. లేదంటే స్టీల్ వీల్స్‌నే ఉంచేసుకోండి. నిర్ణయం మీదే.

Most Read Articles

English summary
There's something really attractive about your neighbour's car, but you can't put your finger on it. You look harder, and realise that the wheels on his car are really attractive and lend the car improved visual impact and character. That's because he's probably had alloy wheels fitted to his car.
Story first published: Monday, December 22, 2014, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X