గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు

Written By:

మైనింగ్: సాధారణ ప్రజలను మైనింగ్ గురించి కదిలిస్తే, తవ్వడం, అమ్మడం అనే చెబుతారు. అయితే మైనింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం. ఇంటిలోని ఇనుప వాసాల నుండి వొంటి మీద ధరించి బంగారం మరియు వజ్రాల వరకు మైనింగ్ చేయందే ఏవీ కూడా రావు.

మైనింగ్ చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. ఖనిజాలు, బంగారం మరియు వజ్రాలు వంటి ఎన్నో విలువైన వాటిని ఎన్నో ఏళ్ల నుండి మైనింగ్ చేస్తూ భూ గర్భం నుండి వెలికి తీస్తూ వచ్చారు. ఎంతో ముఖ్యమైన మైనింగ్ అభవృద్ది సాధాసీదాగా జరగలేదు. ఇందుకోసం ఎన్నో రకాల మైనింగ్ వాహనాలను వినియోగించారు. వీటి ద్వారా ఎన్నో రకాల అత్బుతమైన గనుల తవ్వకాలు చేపట్టారు.

క్రింది కథనం ద్వారా మైనింగ్ ద్వారా బయల్పడిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెండు అతి పెద్ద గనులు మరియు మైనింగ్ కోసం ఆటోమొబైల్ రంగం అభివృద్ది చేసిన అత్భుతమైన మైనింగ్ వాహనాలు గురించి తెలుసుకుందాం రండి.

ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్ కోసం వాహనాలు అందిస్తున్న సంస్థలు

మైనింగ్ చేయాలి అంటే గునపం, పలుగు మరియు గడ్డ పార ఉంటే సరిపోదు, భారీ స్థాయిలో మెషినరీ కావాలి ఇందుకోసం మైనింగ్ వాహనాలను అందిస్తున్న సంస్థలు...

 • క్యాటర్‌పిల్లర్
 • జాన్ ఢీరె
 • వోల్వో
 • కొమట్సు
 • కెస్
 • హ్యుందాయ్ ఎర్త్‌ ఎక్విప్‌మెంట్
 • టాటా

మైనింగ్ ప్రాముఖ్యత

మైనింగ్ ద్వారా ఎన్నో ఖనిజ లవణాలను వెలికి తీస్తున్మాము కదా అయితే పుట్టిన బిడ్డకు జీవితాంతం ఏ స్థాయిలో ఖనిజ లవణాలు అవసరం అవుతాయో తెలుసా ?

 • 362 కిలోలు సీసము
 • 340 కిలోలు జింక్ (యశదము)
 • 680 కిలోలు రాగి
 • 1629 కిలోలు అల్యూమినియం
 • 14832 కిలోలు ఇనుము
 • 12042 కిలోలు మట్టి
 • 12797 కిలోలు లవణము
 • 561593 కిలోలు రాయి, ఇసుక,గలక రాయి మరియు సిమెంట్ వరకు అవసరం అవుతాయి.

మైనింగ్ చరిత్రలో అత్భుతం

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మూల కూడా మైనింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కేలం రెండు మాత్రమే పేరు ప్రఖ్యాతలు పొందాయి. అందులో రష్యాలోని తూర్పు సైబీరియాలో గల మిర్ని ప్రాతంలో ఉన్న మిర్ వజ్రాల గని మరియు ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్ ఎక్కువగా జరుగుతున్న అతి పెద్ద ఏకైక గని జర్మనీలోని గార్జ్‌వీలర్ స్ట్రిప్ మైన్.

మిర్ మైన్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్బుతమైన గనులలో మిర్ మైన్ ఒకటి ఇది తూర్పు సైబీరియాలో మిర్ అనే ప్రాంతంలో ఎంతో విశాలంగా ఉంది. ఈ గని అత్యంత అరుదైన మరియు ఖరీదైన వజ్రాలకు నిలయం ఈ గని, దీన్ని తవ్వకాలలో ఆటోమొబైల్స్ ఎంతో ప్రత్యేక పాత్ర వహించాయి అని చెప్పవచ్చు.

వజ్రాల గని

ఇక్కడ ఉన్న ఫోటో చూడండి. పసుపు రంగు ట్రక్కు భారీ పరిమాణంలో ఉంది కదూ. అక్కడ ఉన్న బాణం గుర్తు వైపు చూడండి చిన్న చుక్కలా కనపడుతున్న వాహనమే ఈ భారీ ట్రక్కు. అంటే అప్పుడు ఈ గని ఎంతటి విస్తీర్ణంలో ఉంటుందో ఊహించుకోండి.
Picture credit: Staselnik/Wiki Commons

కొలతలు

ఇది దాదాపుగా 525 మీటర్లు (1,722 అడుగులు) లోతు, 1,200 మీటర్లు (3,900 అడుగులు) చుట్టు కొలతలలో కలదు మరియు ప్రపంచ వ్యాప్తంగా తవ్వకాల ద్వారా వజ్రాలు సేకరిస్తున్న అతి పెద్ద వజ్రాల గని కూడా ఇదే.
Picture credit: Staselnik/Wiki Commons

ప్రారంభం

మిర్ని మైన్‌‌గా పిలువబడే ఈ గని 1955 లో ప్రారంభం అయ్యింది. అయితే దీనికంటే ముందుగా స్టాలిన్ ఈ గని కోసం కావాల్సిన మైనింగ్ యంత్రాల కోసం సోవియట్ యూనియన్ ఆదేశించాడు.
Picture credit: Vladimir/Wiki Commons

100 లక్షల వరకు వజ్రాలు

ఇందులో ప్రతి ఏడాది కూడా సుమారుగా కోటి వరకు మంచి నాణ్యత గల బెస్ట్ క్యారట్ వజ్రాలను వెలికి తీస్తున్నారు.
Picture credit: Staselnik/Wiki Commons

21.96 క్యారెట్ వజ్రం

ఇక్కడ తవ్వకాలు నిర్వహిస్తున్న సందర్భంలో రష్యాకే కీర్తి తెచ్చే అత్యంత అరుదైన అల్రోసా వజ్రం లభ్యమయ్యింది. దీని నాణ్యత సుమారుగా 121.96 క్యారెట్లుగా ఉంది.
Picture credit: Ptukhina Natasha/Wiki Commons

విలువ

డైమండ్ల అమ్మకాలలో బాగా చెయ్యి తిరిగిన సంస్థ సెర్జీ గురైనోవా ఈ అల్రోసా వజ్రం విలువ 1.5 మిలియన్ అమెరికన్ డాలర్లుగా లెక్కగట్టింది. అంటే 150 లక్షల అమెరికన్ డాలర్లు అన్నమాట.
Picture credit: Staselnik/Wiki Commons

సకా వజ్రాల సంస్థ

అప్పటిలో ఈ మిర్‌ మైన్‌ను సకా అనే ప్రముఖ వజ్రాలు వెలికితీసే సంస్థ దీనిని నిర్వహించింది. 1990 వరకు ఇది ఇక్కడ సేవలు కార్యకలాపాలు అందించింది.
Picture credit: Vladimir/Wiki Commons

సంవత్సరాదాయం

ప్రతి ఏడాది కూడా ఈ సంస్థ ఈ మిర్ వజ్రాల గని ద్వారా సుమరుగా 600 మిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారాన్ని చేసేది.
Picture credit: Staselnik/Wiki Commons

మూసివేత

2001 జూన్‌లో దీనిని తాత్కాలికంగా మూసి వేసారు. అయితే మిర్ వజ్రాల గనిని 2004 లో పూర్తిగా మూసి వేశారు.
Picture credit: Staselnik/Wiki Commons

పర్యాటక కేంద్రంగా

ఎన్నో ఏళ్లుగా ఆటోమొబైల్ పరిజ్ఞానం ద్వారా తయారైన వాహనాలతో మలచబడిన ఈ మిర్ వజ్రాల గని చివరికి చూడటానికి ఎంతో అందంగా రూపుదిద్దుకుంది. ఇపుడు ఇది పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.
Picture credit: Staselnik/Wiki Commons

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద మైన్ (గని)

ఆటోమొబైల్ వాహనాల ద్వారా రూపుదిద్దుకున్న గనులలో అతి పెద్దది జర్మనీలో కలదు. గార్జ్‌వీలర్ స్ట్రిప్ మిని గా పిలవబడే ఈ గని నుండి అధిక స్థాయిలో లిగ్నైట్‌ను వెలికితీస్తున్నారు.

విస్తీర్ణం

ఈ గార్జ్‌వీలర్ స్ట్రిప్ లిగ్నైట్ మైన్ సుమారుగా 2304 ఎకరాలలో విస్తరించి ఉంది. దీని కోసం ఇక్కడ చుట్టు ప్రక్కన ఉన్న చాలా వరకు ఊళ్లు ఈ గనిలో కలిసిపోయాయి.

13 బిలియన్ టన్నులు లిగ్నైట్

ఈ గని ద్వారా దాదాపుగా 13 బిలియన్ టన్నుల లిగ్నైట్‌ను వెలికి తీశారు.(1 బిలియన్ 100 కోట్లకు సమానం). ఈ ప్రాంతంలో లిగ్నైట్‌ను పూర్తిగా తవ్వేసిన తరువాత ఇప్పుడు ఈ ప్రాంతాన్ని నీటితో నింపుతున్నారు.

బ్యాజర్ 288 మైనింగ్ వాహనం

ఇంత పెద్ద మొత్తంలో మైనింగ్ చేయడానికి గల ఏకైక సాధనం బకెట్-వీల్ ఎక్స్‌కవేటర్ లేదా మొబైల్ స్ట్రిప్ మైనింగ్ మెషిన్ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్దగా ఉన్న ఇటువంటి వాహనాన్ని జర్మనీకు చెందిన క్రుప్ అనే సంస్థ బ్యాజ్ర్ 288 అనే పేరుతో తయారు చేసింది.

1978లో

ఈ బ్యాజర్ వాహనాన్ని తయారుత చేయడానికి సుమారుగా పది సంవత్సరాల సమయం పట్టింది. ఇందులో దీని చెందిన అన్ని విడిభాగాలను తయారు చేయడాని ఐదేళ్లు మరియు వాటని అనుసంధానించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి సుమారుగా మరో ఐదేళ్లు పట్టాయి.

ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద మైనింగ్ వాహనం

ఈ బ్యాజర్ 288 వాహనం ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద మైనింగ్ వాహనంగా పేరుగాంచింది. దీని కొలతలు చూస్తే మీకే అర్థం అవుతుంది.

 • ఎత్తు: 311 అడుగులు (98 మీటర్లు)
 • పొడవు: 705 అడుగులు (215 మీటర్లు)
 • దీని బరువు: 45,500 టన్నలు (1 టన్ను=1000 కిలోలు)

శక్తి

దీనిని ఆపరేట్ చేయడానికి సుమారుగా 16.56 మెగా వాట్ల విద్యుత్ అవసరం అవుతుంది.

వేగం

ఇది నిమిషానికి రెండు పది మీటర్లు అంటే (6.6 నుండి 33 అడుగుల) వేగం ప్రయాణిస్తుంది.

ఎక్స్‌కవేటింగ్ హెడ్

ఇది మట్టిని తవ్వడానికి ఉపయోగించేదానిని ఎక్స్‌కవేటింగ్ హెడ్ అంటారు, దీని చుట్టు కొలత 21.6 మీటర్లుగా ఉంది. ఒక్కసారి మట్టిని తోడితే దీనికి గల 18 బకెట్ల ద్వారా 6.6 క్యూబిక్ మీటర్ల మట్టి వస్తుంది.

రోజు వారి సామర్థ్యం

ఈ బ్యాజర్ 288 ఎక్స్కవేటర్ రోజుకి సుమారుగా 30 మీటర్లు లోతుకు 2400 వ్యాగన్లకు సరిపడా బొగ్గుని అంటే 240,000 టన్నుల బొగ్గును తవ్వుతుంది.

మైనింగ్ వ్యవస్థకు నాడిగా ఉన్న కొన్ని ముఖ్యమైన ఆటోమొబైల్ వాహనాలు గురించి తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకుందాం

1. అర్టిక్యులేటింగ్ ట్రక్

ఈ ట్రక్కు ట్రాక్టర్ మరియు ట్రాలీని పోలి ఉంటుంది, ఇది వాటిలో ఇందులో ట్రాలీ మరియు ఇంజన్‌ను వేరు చేసే అవకాశం లేదు. వెనుకన ఉన్న ట్రాలీని హ్రైడ్రాలిక్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. భారీ సంస్థాయిలో మైనింగ్ పదర్థాలను ట్రాన్స్‌పోర్ట్ చేయవచ్చు.

2. బుల్‌డోజర్

బుల్‌డోజర్లు రెండు రకాలు అవి : 1.వీల్ టైపు బుల్‌డోజర్ మరియు ట్రాక్‌టైపు బుల్‌డోజర్. వీల్‌టైపులో చక్రాలు మరియు ట్రాక్‌టైపులో చక్రాలకు బదులుగా చైన్‌ వంటి నిర్మాణం గల ట్రాక్‌ ఉంటుంది. దీనికి ముందు వైపున డోజర్ ఉంటుంది, బారీ స్థాయిలో మట్టిని జరపడానికి వీటిని ఉపయోగిస్తారు.

3. డ్రాగ్‌లైన్

నిర్మాణ మరియు ఉపరితల మైనింగ్ రంగంలో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. వీటని ఉపయోగించి చాలా వరకు ఎత్తైన ప్రదేశాలకు మైనింగ్ పదార్థాలను చేర్ఛడం మరియు లోతైన ప్రదేశాల నుండి మైనింగ్ పదార్థాలను బయటకు చేరవేయడానికి వీటని వినియోగిసారు. వీటిని ఉపయోగించి 2,000 నుండి 13,000 మెట్రిక్ టన్నుల వరకు బరువులను ఎత్తగలవు.

4. ట్రాక్ లోడర్

ట్రాక్ లోడర్లు చాలా పనులకు ఉపయోగపడతాయి. వీల్ ట్రాకర్ ద్వారా డోజర్, ఎక్స్‌కవేటర్ మరియు వీల్ లోడర్ చేసే అన్ని పనులకు దీనిని ఉపయోగించవచ్చు.

5.మోటార్ గ్రేడర్

దీనిని మీరు తారు రోడ్లు వేసేటప్పుడు గమనించవచ్చు. అయితే ఈ మోటార్ గ్రేడర్‌ను మైనింగ్ ప్రదేశాలలో మట్టని చదును చేయడానికి మరియు సమతలం మీద ఉన్న మట్టిని తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.

6. మాస్క్ ఎస్కవేటర్

ఇలాంటి వాటిని బయట చూసినపుడు చాలా మంది చైన్ బుల్డోజర్ అంటుంటారు. అయితే ఇది బుల్డోజర్ కాదు, దీనిని ఎస్కవేటర్ అంటారు. వీటని భారీ స్థాయిలో మట్టిని లోడ్ చేయడానికి వినియోగిస్తారు, దీనికి ముందు వైపున ఉన్న బకెట్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది.

7.రెండు ఇంజన్‌లు-రెండు చక్రాలు

ఇది కూడా నేలను చదును చేస్తుంది. అయితే మట్టానికన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్న మట్టిని వెనుక వైపున ఉన్న ట్రాలీలో లోడ్ చేసుకుంటుంది. అందుకోసం దీనికి ముందు మరియు వెనుక వైపున కూడా ఇంజన్ కలదు.

8. ఎలివేటర్

ఇంతకు మునుపటి దానిని నేల మీద ఎక్కువ ఉన్న మట్టిని తన ట్రాలీలో లోడు చేసుకుంటుందని చదివారు కదా. కాని ఇది దానికి వ్యతిరేకం లోడ్ చేసుకున్న మట్టిని కావాల్సిన మరియు తక్కువ ఉన్న ప్రదేశాలలో క్రిందకు జారవిడుస్తుంది.

9. షవెల్

షవెల్‌ నేలను, ఖనిజాలను, మరియు ఇతర పదార్థాలను తవ్వి ట్రాలీలోనికి లోడో చేస్తుంది.

10. పర్సనల్ క్యారియర్

పర్సనల్ క్యారియర్ ద్వారా ఉపరితలం మైనింగ్ ప్రదేశాల నుండి భూగర్భ మైనింగ్ ప్రదేశలకు మనుషులను, పరికరలాను మరియు చిన్న తరహా మెషినరీలను తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.

Story first published: Thursday, April 7, 2016, 19:54 [IST]
English summary
Mysterious And Amazing Facts About The Mining Industry You Don't Know
Please Wait while comments are loading...

Latest Photos