ఆశ్చర్యకరమైన ఇండియన్ రహదారులు.. మిస్ కావద్దు

విస్తారమైన రహదారులను కలిగి ఉండే దేశాల్లో భారత్ 7వస్థానంలో ఉంది. ఈ భౌగోళిక భూభాగంలో పలు ప్రాంతాల రహదారులు భిన్నమైన వాతావరణాన్ని కలిగి వైవిధ్యభరతమైన అనుభూతులకులోను చేస్తాయి. దేశంలోనే అత్యంత పొడవైన రహదారి ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి దక్షిణాన ఉన్న తమళినాడులోకి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. జాతీయ రహదారి నెం.7గా పేర్కొనబడే ఈ రోడ్డు పొడవు 2369కిలో మీటర్లు. ఈ రహదారి దేశంలోని ప్రధాన నగరాలైన జబల్పూర్, నాగ్ పూర్, హైదరాబాద్, బెంగుళూరు నగరాలను కలుపుతూ వెళుతుంది.

దేశంలోనే అత్యంత చిన్నదైన జాతీయ రహదారి (నెం.47ఏ) 6 కిలో మీటర్ల పొడవును కలిగి కేరళలోని ఎర్నాకుళం నుంచి కొచ్చి ఓడరేవులను కలుపుతుంది. ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన రహదారిగా భారతదేశంలోని మనాలి (హిమాచల్ ప్రదేశ్) నుంచి లడక్(కాశ్మీర్) లోని లెహ్ గుర్తింపు పొందింది. నేటి శీర్షికలో భాగంగా దేశంలోని విభన్నరహదారులను మీకు పరిచయం చేయబోతున్నాం.

ఆశ్చర్యకరమైన ఇండియన్ రహదారులు.. మిస్ కావద్దు

ఆశ్చర్యకరమైన రహదారులు మీకోసం ఎదురుచూస్తున్నాయ్!, చూసేందుకు మీరు సిద్ధమేనా? అయితే రండి.........

ఆశ్చర్యకరమైన ఇండియన్ రహదారులు.. మిస్ కావద్దు

మనాలి నుంచి లెహ్ వరకు: భారతదేశంలోని హిమాలయ ప్రాంతం అందమైన ప్రకృతితో పాటు ప్రమాదకరమైన రహదారులను కలిగి ఉంది. మనాలి- లెహ్‌ల మధ్య ప్రయాణం అధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఆశ్చర్యకరమైన ఇండియన్ రహదారులు.. మిస్ కావద్దు

గ్రేట్ రాణ్ అఫ్ కచ్: భారత దేశానికి వాయువ్య దిశలో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఈ ప్రాంతముంది. రైడ్‌కు అనువగా ఉండే ఈ ఏడారి ప్రాంతాన్ని గ్రేట్ ఇండియన్ డెసర్ట్‌గా పిలుస్తారు. కనుచూపుమేర ప్రాంతం సువిశాలంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో పగుళ్లు

ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి ఈ పగుళ్లు మీ బైక్ లేదా కారు చక్రాలను ఇబ్బంది పెట్టవచ్చు.

ఆశ్చర్యకరమైన ఇండియన్ రహదారులు.. మిస్ కావద్దు

పంబన్ బ్రిడ్జ్ - రామేశ్వరం: పంబన్ బ్రిడ్జ్ ప్రాంతం దక్షణ భారతదేశంలోనే చూడతగ్గ ప్రదేశం. ఈ వంతనెకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 1914లో నిర్మించారు. రెండు కిలోమీటర్లు పొడవున ఉండే ఈ బ్రిడ్జ్ భారత ప్రధాన భూబాగం నుంచి రామేశ్వరంకు కలుపుతుంది.

ఆశ్చర్యకరమైన ఇండియన్ రహదారులు.. మిస్ కావద్దు

సిలా పాస్ - అరుణాచాల్ ప్రదేశ్: ఈ ప్రాంతంలో ప్రయాణం భయానకంగా ఉంటుంది. మంచుతో కప్పబడిన రోడ్ల పై డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. భూమికి 13,800 అడుగులు ఎత్తులో ఉన్న రహదారి డ్రైవింగ్‌కు ఇబ్బందికరంగా ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడి

ఉష్ణోగ్రతలు 10డిగ్రీలకు పడిపోతాయి.

ఆశ్చర్యకరమైన ఇండియన్ రహదారులు.. మిస్ కావద్దు

కూర్గ్ టూ మున్నార్ వయా ఊటీ: దక్షిణ భారత దేశంలోని ఈ హైవే కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతాన్ని కేరళలోనిలో వయనాడ్ మీదగా తమిళనాడులోని ఊటీకి కలుపుతుంది. 2011కుగాను ఈ రహదారి అల్టిమేట్ రైడింగ్ వండర్‌గా నిలిచింది. ఈ రహదారి గుండా కనిపించే టీ, కాఫీ తోటలు ఆహ్లాదాన్ని పంచుతాయి.

ఆశ్చర్యకరమైన ఇండియన్ రహదారులు.. మిస్ కావద్దు

ప్రయాణ సందర్భాల్లో ఉత్కంఠభరిమైన అనుభూతులను చేరువుచేసే పలు రహదారుల వివరాలను ఈ ఫోటో శీర్షిక ద్వారా మీకు పరిచయం చేశాం. వీటిలో మీకు నచ్చిన రహదారి లేదా చేర్చాల్సిన రహదారులు ఇంకేమైనా ఉన్నట్లయితే మీ కామెంట్‌లను క్రింద ఏర్పాటు చేసిన కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయవచ్చు.

Most Read Articles

English summary
India has some amazing roads that are known for their scenic beauty and great riding conditions. Here is a picture update of India's amazing roads.....
Story first published: Monday, February 11, 2013, 17:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X