నిజం కార్లలా కనిపించే బొమ్మ కార్లతో అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

By Ravi

కళానైపుణ్యానికి అవధులు లేవు. కళాకారులు ఆలోచోనలకు ఎల్లలు లేవు. ఈ కథనంలో మనం అలాంటి ఓ కాళాకారుడి అద్భుతాల గురించి తెలుసుకుందాం రండి. అమెరికాకు చెందిన మైఖేల్ పౌల్ స్మిత్ అనే ఫొటోగ్రాఫర్ బొమ్మ కార్లను ఉపయోగించి ఫొటోలు తీస్తాడు.

ఇందులో వింతేముంది అనుకోకండి.. అసలు విషయం అక్కడే ఉంది. ఈ బుజ్జి బుజ్జి బొమ్మ కార్లతో అతను తీసిన ఫొటోలను చూస్తే, మీరు షాక్‌కు గురవటం ఖాయం. ఎందుకంటే, ఇవి అచ్చం నిజం కార్లతో తీసిన ఫొటోలను తలపిస్తాయి.

మైఖేల్ ఈ ఫొటోలన్నింటినీ తన ఊహా నగరమైన ఎల్గిన్ పార్క్‌లో (మైఖేల్ తన ట్రిక్ ఫొటోలను సృష్టించేందుకు పెట్టుకున్న ఊహాలోకం పేరు) ప్రదర్శనకు ఉంచాడు. మరి ఆ అద్భుతాలను చూడాలంటే, ఆలస్యం చేయకుండా క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

మైఖేల్ తన ట్రిక్ ఫొటోగ్రఫీ ప్యాషన్‌ను 300 లకు పైగా పురాతన డైకాస్ట్ మోడల్ కార్లతో (బొమ్మ కార్లు) ప్రారంభించాడు. ఇతని క్రియేషన్‌లో హీరోలు ఈ స్కేల్ మోడల్ వాహనాలే.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

ఎల్గిన్ పార్క్ అనే ఈ ఊహాలోకంలో కనీసం రెండు పురాతన వాహనాలను రోడ్డుపై ప్రయాణిస్తున్నట్లు లేదా పార్క్ చేసినట్లు ఉంటాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఫొటోలకు ఉపయోగించే బ్యాగ్రౌండ్ రియల్‌గా ఉండటమే కాకుండా, పురాతన రోజులను తలపించేవిగా ఉంటాయి.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

మైఖేల్ ఈ ఫొటోలను స్టూడియోలో తీయలేదు. ప్రతి ఫొటో కూడా ఓపెన్ ఏరియాలో షూట్ చేసినదే. రియల్ స్కై, రియల్ బిల్డింగ్స్, రియల్ ట్రీస్ ఇలా తన ఫొటోలో బొమ్మ కార్లు మినహా అన్ని రియల్‌గానే ఉంటాయి.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

మైఖేల్ తన ఆర్ట్ వర్క్ కోసం పెద్ద సాంకేతికతనేమీ ఉపయోగించడు, కానీ ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం అత్యంత ఆశ్చర్యకరంగా ఉంటుంది.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

మైఖేల్ తన పని ప్రారంభించడానికి ముందుగా, కొంచెం హోమ్‌వర్క్ చేస్తాడు. తాను క్రియేట్ చేయాలనుకున్న సీన్ గురించి, ఆర్కిటెక్చర్ గురించి, పరిసరాల గురించి ముందుగానే అంచనా వేసుకుంటాడు.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

అంతేకాదు, ఖచ్చిమైన ఎఫెక్ట్ రావటం కోసం అతను కొన్ని పురాతన ఫొటోగ్రాఫ్‌లను కూడా పరిశీలిస్తాడు.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

ఒకవేళ సీన్‌కు కావల్సిన రియల్ లొకేషన్ దొరకకపోయినట్లయితే, మైఖేల్ స్కేల్ మోడల్ బిల్డింగ్‌లను , పరిసరాలను కూడా బొమ్మల రూపంలో తయారు చేస్తాడు.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

ఇతను తీసిన ఫొటోల్లో కనిపించే రోడ్డు, నిజమైన రోడ్డులా కనిపిస్తుంది. కానీ ఇదొక 3x4 ఫుట్ పీస్ కార్డ్ బోర్డ్. రియల్ ఫీల్ వచ్చేలా ఈ కార్డు బోర్డును రోడ్డు రూపంలో పెయింట్ చేస్తారు.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

ఒక సింగిల్ ప్రాజెక్ట్ (సింగిల్ ఫొటో) కోసం అతను రెండు డజన్లకు పైగా ఫొటోలను తీస్తాడు. అందులో ఒకటో రెండో మంచి ఫలితాన్ని చూపిస్తుంది.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

మైఖేల్ ఇలా తీసిన ఫొటోల్లో బెస్ట్‌గా వచ్చిన వాటిని తన ఆర్ట్ వర్క్ కలెక్షన్‌లో చేరుస్తాడు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఫొటో ఎడిటింగ్ టూల్స్‌ను ఉపయోగించకూడదని ఆయన కంకణం కట్టుకున్నాడట.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

అయితే, కేవలం ఫొటోషాపప్ ఫిల్టర్‌ను చేర్చడం ద్వారా రెట్రో ఫీల్‌ను కల్పించేందుకు ఓ టింట్‌ను జనరేట్ చేస్తాడట.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

ఎల్గిన్ పార్క్ అనే ఈ ఊహాలోకానికి రియల్ లైఫ్ లోకానికి ఏదైనా సంబంధం ఉందా అంటే..? కొంతవరకు ఉందనే చెప్పాలి.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

మైఖేల్ తన తొలి రెండు దశాబ్ధాల జీవితాన్ని అమెరికా, పెనుస్లేవియాలోని సెవిక్లే నగరంలో గడిపాడు.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

ఆ సమయంలో అతను చూసిన నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉండేందుకు మైఖేల్ ఇప్పుడు ఈ ఫొటోలను తయారు చేశాడు.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

చరిత్రలో కలిసి పోయిన జ్ఞాపకాలను చిరకాల జ్ఞాపకాలుగా మార్చేందుకు మైఖేల్ ఈ ఫొటోగ్రఫీ ప్యాషన్‌ను ఎంచుకున్నాడు.

మైఖేల్ పౌల్ స్మిత్ అమేజింగ్ ట్రిక్ ఫొటోగ్రఫీ

మైఖేల్ పౌల్ స్మిత్ సృష్టించిన మరిన్ని ఆర్ట్ వర్క్‌లను అతని ఫ్లికర్ పేజ్‌లో చూడొచ్చు.

Most Read Articles

English summary
Elgin Park is the name of a place that you will not find on any map. Not because it is a top secret government facility, but because it resides in the imaginary world of artist Michael Paul Smith. Elgin Park is an imaginary city which comes to life in the beautiful creations of the artist.
Story first published: Monday, November 4, 2013, 9:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X