అమెజాన్ ప్రైమ్ ఎయిర్: డ్రోన్‌లతో 30 నిమిషాల్లో డెలివరీ

By Ravi

'డ్రోన్' విమానాలను (యాంత్రికంగా నడిచే మానవరహిత విమానాలు) కేవలం సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కోసం, తీవ్రవాదులను తమార్చడం కోసమే కాకుండా, పార్శిళ్లను వేగంగా డెలివరీ చేసేందుకు కూడా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నాయని కొన్ని ప్రముఖ కంపెనీలు. ఇప్పటికే ప్రముఖ అమెరికన్ రెస్టారెంట్ చెయిన్ డొమినోస్ పిజ్జా 'ఆక్టోకాప్టర్'గా పిలిచే డ్రోన్‌లతో పిజ్జాలను డెలివరీ చేసే విధానాన్ని డెమోనిస్ట్రేట్ చేసి చూపిన సంగతి తెలిసినదే.

ఇదే కోవలో తాజా.. అమెరికాకు చెందిన అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ డాట్‌కామ్ కూడా డ్రోన్‌ల సాయంతో తమ ఉత్పత్తులను డెలివరీ చేందుకు సన్నాహాలు చేస్తుంది. అమెజాన్ వీటిని ప్రయోగాత్మకంగా నడిపించి చూపించింది. ఈ డ్రోన్‌ల సాయంతో కేవలం ఐటమ్‌ను బుక్ చేసుకున్న 30 నిమిషాల్లోనే డెలివరీలు చేస్తామని కంపెనీ పేర్కొంది. ఐదు పౌండ్లలోపు బరువుండే పార్శిళ్లన్నింటినీ, 10 మైళ్ల దూరంలో వుండే ప్రాంతాలకు ఈ డ్రోన్‌ల ద్వారా అందజేస్తామని కంపెనీ తెలిపింది.

Amazon Prime Air

తమ అమ్మకాల్లో 86 శాతం వస్తువులు దాదాపు 5 పౌండ్ల కన్నా తక్కువ బరువు ఉండేవేనని కంపెనీ సీఈఓ జెఫ్ బెజోస్ తెలిపారు. వాస్తవానికి ఈ మానరహిత డ్రోన్‌లను నగరంలో సంచరింపజేసేందుకు అమెజాన్‌కు ఇంకా పూర్థిస్థాయిలో అనుమతి లభించినట్లు కనిపించడం లేదు. జెజోస్ తెలిపిన సమాచారం ప్రకారం, ఇది పూర్తిస్థాయిలో అమలు కావటానికి మరో మూడునాలుగేళ్ల సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, ఈ ఐడి అమెజాన్ జీవితాన్నే మార్చేయనుంది.

అమెజాన్ తమ డ్రోన్‌లతో డెలివరీ ఎలా చేస్తుందో, క్రింది వీడియోలో వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/98BIu9dpwHU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
US leading online shopping site Amazon.com is testing the use of drones to deliver goods. If this plan executes well, you may get your goods from Amazon delivered to you in a matter of 30 minutes said its CEO Jeff Bezos.&#13;
Story first published: Saturday, December 7, 2013, 12:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X