ఎమర్జెన్సీలో ప్రాణాలను రక్షించే అంబులెన్స్ డ్రోన్

By Ravi

మనం ఇప్పటి వరకూ మానవరహిత విమానాలతో సరిహద్దుల్లో గస్తీ చేయటం, డ్రోన్‌ల సాయంతో పిజ్జాలు, కొరియర్లను డెలివరీ చేచయం చూశాం. కానీ, తొలిసారిగా ఓ మానవ రహిత డ్రోన్ ఓ చిన్నపాటి అంబులెన్స్‌గా మారి హృద్రోగులను (హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లను) కాపాడబోతోంది.

వివరాల్లోకి వెళితే.. నెథర్లాండ్స్‌కి చెందిన అలెక్స్ మోన్టన్ అనే యువ ఇంజన్ 'అంబులెన్స్ డ్రోన్'ను సృష్టించాండు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం సాయం అందించేందుకు వీలుగా ఆల్-పర్పస్ మెడికల్ టూల్‌కిట్‌ను కలిగి ఉన్న ఈ డ్రోన్, నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందిస్తుంది.

మరింత సమాచారాన్ని మరియు ఈ అంబులెన్స్ డ్రోన్ పనితీరును ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

అంబులెన్స్ డ్రోన్

డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన అలెక్స్, అత్యవస పరిస్థితుల్లో వైద్య సాయం కోసం అంబులెన్స్ కోసం వేచి ఉండటం కన్నా, వీలైనంత త్వరగా ప్రథమ చికిత్స అందించగలిగినట్లయితే, ప్రాణాలు నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆ ఉద్దేశ్యం నుంచి పుట్టుకొచ్చినదే ఈ అంబులెన్స్ డ్రోన్ అని చెప్పాడు.

అంబులెన్స్ డ్రోన్

అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ కోసం కావల్సిన వస్తువులు కలిగి ఉండే ఓ ఫ్లయింగ్ టూల్‌బాక్సే ఈ అంబులెన్స్ డ్రోన్. ఈ తొలి ప్రోటోటైప్‌లో భాగంగా, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి అత్యవసరంగా సేవలు అందించాల్సి వచ్చినప్పుడు అవసరమయ్యే ఆటోమేటెడ్ డెఫిబ్రిలేటర్ (ఈఏడి)ని అమర్చారు.

అంబులెన్స్ డ్రోన్

అలెక్స్ మోన్టన్ ప్రకారం, యూరోపియన్ యూనియన్‌లో ప్రతి ఏటా దాదాపు 8 లక్షల మంది హార్ట్ అటాక్‌కు గురవుతున్నారు, వీరిలో కేవలం 8 శాతం మంది మాత్రమే ప్రాణాలు నిలబెట్టుకోగలుగుతున్నారు. సరైన సమయానికి వైద్యం అందని కారణంగానే, ఎక్కువ మంది చనిపోతున్నారు, అదే వీరికి సత్వర ప్రథమ చికిత్స లభిస్తే, బ్రతికే చాన్స్ ఎక్కువ ఉంటుంది.

వీడియో

అంబులెన్స్ డ్రోన్ పనితీరు గురించి అలెక్స్ మాటల్లోనే ఈ వీడియో ద్వారా చూడండి.

Most Read Articles

English summary
Each year nearly a million people in Europe suffer from a cardiac arrest. A mere 8% survives due to slow response times of emergency services. The ambulance-drone is capable of saving lives with an integrated defibrillator. The goal is to improve existing emergency infrastructure with a network of drones. 
Story first published: Friday, October 31, 2014, 10:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X