ఆంధ్రప్రదేశ్‌లోను ప్రారంభం కానున్న సీప్లేన్ సర్వీసులు

విదేశాలకు మాత్రమే పరిమితమైన నీటిపై తేలియాడే విమానాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకూ నేలపై ల్యాండిగ్/టేకాఫ్ విమానలను చూసిన రాష్ట్ర వాసులు ఇకపై నీటిపై టేకాఫ్/ల్యాండిగ్ అయ్యే విమానాలను కూడా చూడబోతున్నారు. మరో మూడు నెలల సమయంలో విజయవాడలో సీప్లేన్ టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

గడచిన మూడేళ్లుగా అండమాన్ అండ్ నికోబార్ దీవులలో సీప్లేన్ సేవలు ఆఫర్ చేస్తున్న అగ్రగామి సీప్లేన్ ఆపరేషన్స్ సంస్థ మారీటైమ్ ఎనర్జీ హెలీ ఎయిర్ సర్వీసెస్ (మెహైర్) ఆంధ్రప్రదేశ్‌లో కూడా తమ సీప్లేన్ సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మెహైర్ అధికారులు ఓ కొత్త ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుని కలిశారు.

సీప్లేన్ సేవల వలన రాష్ట్ర పర్యాటక రంగం మరింత వృద్ధి చెందగలదని భావిస్తున్నారు. వాస్తవానికి భారతదేశంలోనే తొలి సీప్లేన్ టూరిస్ట్ సర్వీసులను గడచిన సంవత్సరం జూన్ నెలలో కేరళ రాష్ట్రం ప్రారంభించింది. కేరళ రాష్ట్రం సీప్లేన్ సేవలం కోసం ప్రస్తుతం సెస్నా 206 సీప్లేన్‌ను ఉపయోగిస్తోంది. ఈ విమానంలో ఆరుగురికి మాత్రమే చోటు ఉంటుంది (పైలట్ కాకుండా). గోవా, మహారాష్ట్రలలో కూడా సీప్లేన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా మెహైర్ సంస్థే నిర్వహిస్తోంది.

Andhra Pradesh To Get Seaplane Services
Most Read Articles

English summary
Maritime Energy Heli Air Services (MEHAIR), a pioneer of Seaplane operations in the country which has been operating in the Andaman and Nicobar Islands for the last three years, will start its Seplane services in Andhra Pradesh too with in three months.
Story first published: Friday, September 19, 2014, 10:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X