కొత్త కారు స్టార్ట్ అవ్వలేదని గొడ్డలితో నరికేశాడు!

By Ravi

తన కోపమే తనకు శత్రువు.. తన శాంతమే తనకు రక్ష.. అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నాం. ఇందుకు సంబంధించి అనేక ఉదాహరణలు, కథలను కూడా తెలుసుకొని ఉన్నాం. కోపాన్ని నియంత్రించుకోకపోతే, దాని వలన జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి.

ఇటలీకి చెందిన ఓ వ్యక్తి ఎంతో కాలం శ్రమించి ఓ కొత్త ఫియట్ 500 కారును కొనుగోలు చేశాడు. కొన్న వారానికే ఆ కారును కోపంతో గొడ్డలి తీసుకొని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వివరాల్లోకి వెళితే..

కారు కొనక ముందు సదరు ఇటాలియన్ రోజు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఆఫీసుకి వెళ్తూ ఉండేవాడు. ఫలితంగా ప్రతిరోజు ఆఫీసు ఆలస్యం కావటం, బాస్ చేతిలో అక్షింతలు వేయించుకోవటం అతనికి మామూలే అయిపోయింది.

Angry Owner Destroys New Fiat Car

అయితే, ప్రతిరోజు బాస్ సీరియస్ అవుతుండటంతో, ఎలాగైనా ఆఫీసుకి త్వరగా చేరుకోవాలని అతను కొత్త ఫియట్ 500 కారును కొన్నాడు. మొదటి నాలుగైదు రోజులు సరిగ్గా పనిచేసిన ఫియట్ 500 కారు, ఓ రోజు ఉదయం స్టార్ట్ కాలేదు.

దీంతో కారు కొన్నప్పటికీ, సమయానికి ఆఫీసుకి చేరుకోలేకపోతున్నామనే కోపంతో అతను ఓ గొడ్డలి తీసుకొని కొత్త కారును ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అయితే, ఈ విషయాన్ని చివరకు పోలీసులు కూడా నమ్మలేదు.

కార్ ఓనరే తమ కొత్త కారును ఇలా ఎందుకు నాశనం చేసుకుంటాడని వారు భావించారు. కానీ, నిజం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తి తీవ్రమైన పని వత్తిడికి గురై అలా చేసి ఉంటాడని భావించి, అతని ఆస్పత్రికి తరలించే వత్తిడి తగ్గించే ప్రయత్నం చేశారు.

చూశారు కదా.. కోపంలో మనుషులు సైతం ఎంత మూర్ఖంగా మారిపోయి, తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోతారో. కాబట్టి మీరు కూడా ఎప్పుడూ కోపం తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. ప్రత్యేకించి రోడ్డుపై ఇతరులతో గొడవకు దిగకండి.

Most Read Articles

English summary
A man in Italy hadn’t even gotten the new car smell out of his Fiat 500 when he picked up an ax and demolished the car when it wouldn’t start.
Story first published: Tuesday, November 18, 2014, 12:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X