మెర్సిడెస్ బెంజ్ ప్రమాదంలో మృతి చెందిన మంత్రి నారాయణ కుమారుడు నిశిత్

Written By:

బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీ హైదరాబాద్‌లోని బూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36లో మెట్రో రైలు కోసం నిర్మిస్తున్న పిల్లర్‌ను ఢీ కొన్న సంఘటనలో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మరణించాడు.

నిశిత్ నారాయణ మరియు అతడి స్నేహితుడు రాజా రవి వర్మ బుధవారం రాత్రి మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 వాహనంలో రైడ్‌కు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో భారీ ఈదురు గాలుతో కూడిన వర్షం రావడంతో రవి వర్మ ఇంట్లో కాసేపు ఆగి మళ్లీ ప్రయాణం ప్రారంభించారు.

మరో కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే ఇంటిని చేరుకోవాల్సిన వీరు జూబ్లీ హిల్స్ లోని రోడ్డు నెంబరు 36లో మెట్రో రైలు కోసం నిర్మించిన పిల్లర్‌ను వేగంగా ఢీకొన్నారు.

ప్రమాదానంతరం భారీ శబ్దం రావడంతో చుట్టుప్రక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరిని వెలికితీయడానికి సుమారుగా రెండు గంటలకు పైగా శ్రమించారు.

అప్పటికే నిశిత్ మరణించి ఉండగా, రవి వర్మలో కదలికలను గుర్తించి అంబులెన్సులో హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమద్యలో అతను కూడా చనిపోయాడు.

ఈ ప్రమాదంలో ఇద్దరూ చనిపోవడానికి మితిమీరిన వేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రధానం కారణం అని తెలిసింది. అయితే ఇద్దరూ కూడా మద్యం సేవించలేదని పోస్ట్‌మార్టంలో తేలింది.

నిజానికి మెర్సిడెస్ బెంజ్ సంస్థ తమ వాహనాలను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించి ఉత్తమ భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన వాహనాన్న పరిశీలిస్తే ప్రమాద తీవ్రత ఏ మేరకు ఉందో తెలుస్తుంది.

ప్రమాదం జరిగిన సందర్భంలో వాహన వేగం గంటకు 120కిలోమీటర్లుగా పైగా ఉన్నట్లు తెలిసింది. ఈ వేగం వద్ద పిల్లర్‌ను డీ కొట్టడం ద్వారా ఎయిర్ బ్యాగులు పగిలిపోయాయి. డ్రైవింగ్ చేస్తున్న నిశిత్ పొట్టలోకి స్టీరింగ్ వీల్ చొచ్చుకెళ్లినట్లు పోస్ట్ మార్టంలో పేర్కొన్నారు.

వీరిరువురూ ప్రయాణిస్తున్న మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ కూడా లేదు. అంతే కాకుండా ఇద్దరూ సీట్ బెల్టులను ధరించలేదని తెలిసింది.

నారాయణ విద్యాసంస్థల డైరక్టరుగా నిశిత్ నారాయణ ఉన్నారు, మరియు ఇదే ప్రమాదంలో మృతి చెందిన రాజా రవి వర్మ వ్యాపారి చినబాబు కుమారుడని తెలిసింది.

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ మరియు మంత్రి లోకేష్ నెల్లూరుకు తిరుగు ప్రయాణమయ్యారు.

నిశిత్ డ్రైవ్ చేసినటువంటి మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 గురించిన సాంకేతిక మరియు భద్రత ఫీచర్ల గురించి చూద్దాం రండి...

 

మెర్సిడెస్ బెంజ్ సాంకేతికంగా ఈ ఏఎమ్‌జి జి63 లగ్జరీ ఎస్‌యూవీలో 5461సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

ఇందులోని శక్తివంతమైన పెట్రోల్ యంత్రము 563బిహెచ్‌పి పవర్ మరియు 760ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఫోర్ వీల్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా పవర్ మరియు టార్క్ చక్రాలకు సరఫరా అవుతుంది.

భద్రత పరంగా మెర్సిడెస్ బెంజ్ ఈ ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీలో ఎనిమిది ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ వార్నింగ్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్లు ఉన్నాయి.

  • బ్రేక్ అసిస్ట్,
  • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, 
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, 
  • హిల్ హోల్డ్ కంట్రోల్,
  • హిల్ డిసెంట్ కంట్రోల్, వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 లగ్జరీ ఎస్‌యూవీ ధర రూ. 2.06 కోట్లు ఎక్స్-షోరూమ్‌(ఢిల్లీ)గా ఉంది. హైదరాబాదులో దీని అన్ రోడ్ ధర రూ. 2,47,55,507 లుగా ఉంది.

ఒక చిన్న నిర్లక్ష్యం, భద్రతను పాటించడంలో అలసత్వం, అశ్రద్ద ఇంతటి ప్రమాదానికి దారితీసిందని చెప్పవచ్చు. భద్రత పాటించడంలో ఇప్పటికీ అనేక మంది అశ్రద్ద చూపుతున్నారు. ప్రమాదం అనేది ఎలాంటి వ్యక్తులకైనా ఒకేలా ఉంటుంది. కాబట్టి భద్రత నియమాలను పాటించడం మరువకండి.
Source: V6 News 

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, May 10, 2017, 13:24 [IST]
English summary
Read In Telugu Ap minister narayana son and his friend killed after a high speed crash in his mercedes G63 AMG
Please Wait while comments are loading...

Latest Photos