ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారి ఆటకట్టు: ఆపిల్ ఐఒఎస్‌లో కొత్త ఫీచర్

ప్రఖ్యాత టెక్ దిగ్గజ ఆపిల్ తమ డివైజ్‌ల కోసం 'డ్రైవింగ్ చేస్తున్నపుడు డిస్టర్బ్ చేయవద్దు' అనే ఫీచర్‌ (Do not disturb while driving)ను కూడా అభివృద్ది చేసింది.

By Anil

ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదం అని తెలిసినా కూడా అలాగే చేస్తాం. దీనిని మార్చేందుకు అనేక చట్టాలు వచ్చాయి. కానీ ఎలాంటి మార్పు జరగలేదు. దేశవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాలలో ప్రతి నాలుగింటిలో ఒకటి ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ద్వారా జరుగుతోంది. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు టెక్ దిగ్గజం ఆపిల్ ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది.

'డ్రైవింగ్‍‌‌లో ఉన్నపుడు డిస్టర్బ్ చేయకండి' ఫీచర్ ప్రవేశపెట్టిన ఆపిల్

కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ డెవలపర్ల సదస్సులో ప్రఖ్యాత టెక్ దిగ్గజ ఆపిల్ తమ డివైజ్‌ల కోసం అభివృద్ది చేసిన నూతన శ్రేణి ఉత్పత్తులను మరియు ఫీచర్లను ఆవిష్కరించింది.

'డ్రైవింగ్‍‌‌లో ఉన్నపుడు డిస్టర్బ్ చేయకండి' ఫీచర్ ప్రవేశపెట్టిన ఆపిల్

ఈ ఆవిష్కరణల్లో తమ భవిష్యత్ ఐఒఎస్ 11 కోసం 'డ్రైవింగ్ చేస్తున్నపుడు డిస్టర్బ్ చేయవద్దు' అనే ఫీచర్‌ (Do not disturb while driving)ను కూడా అభివృద్ది చేసి, ఆవిష్కరించింది.

'డ్రైవింగ్‍‌‌లో ఉన్నపుడు డిస్టర్బ్ చేయకండి' ఫీచర్ ప్రవేశపెట్టిన ఆపిల్

ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నపుడు జరిగే రోడ్డు ప్రమాదాలు రేటు అధికంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. జాతీయ భద్రతా మండలి తెలిపిన గణాంకాల మేరకు ఏడాదికి 16 లక్షల రోడ్డు ప్రమాదాలు ఫోన్ వివియోగించడం ద్వారా జరుగుతున్నాయి మరియు మొత్తం రోడ్డు ప్రమాదాల్లో ప్రతి నాలుగింటిలో ఒకటి ఫోన్ వినియోగించడం ద్వారా సంభవిస్తున్నట్లు వెల్లడించింది.

'డ్రైవింగ్‍‌‌లో ఉన్నపుడు డిస్టర్బ్ చేయకండి' ఫీచర్ ప్రవేశపెట్టిన ఆపిల్

సాంకేతికంగా 'డ్రైవింగ్ చేస్తున్నపుడు డిస్టర్బ్ చేయవద్దు' అనే ఫీచర్‌ (Do not disturb while driving) పనితీరు గురించి తెలుసుకుంటే డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటాన్ని మరియు అలా జరిగే ప్రమాదాలను శాస్వతంగా అరికట్టవచ్చు.

'డ్రైవింగ్‍‌‌లో ఉన్నపుడు డిస్టర్బ్ చేయకండి' ఫీచర్ ప్రవేశపెట్టిన ఆపిల్

ఈ ఫీచర్ గల ఆపిల్ ఫోన్‌లలో Do not disturb while driving మోడ్ ఆక్టివేట్ అయితే ఇది ఆటోమేటిక్‌గా అన్ని నోటిఫికేషన్లను సైలెంట్ మోడ్‌లోకి నెట్టేస్తుంది. స్క్రీన్‌ను కూడా ఆఫ్ చేస్తుంది. తద్వారా డ్రైవింగ్‌లో ఉన్నపుడు డ్రైవర్ దృష్టి ఫోన్ మీదకు కాకుండా రోడ్డు మీదే ఉంటుంది.

'డ్రైవింగ్‍‌‌లో ఉన్నపుడు డిస్టర్బ్ చేయకండి' ఫీచర్ ప్రవేశపెట్టిన ఆపిల్

ఆపిల్ మరో ఆప్షన్‌ కూడా కల్పించింది. Do not disturb while driving మోడ్‌లో ఉన్నపుడు మీరు డ్రైవింగ్ చేస్తున్నారనే విషయాన్ని మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న ఫేవరెట్ ఫోన్ నెంబర్లకు మెసేజ్ రూపంలో పంపిస్తుంది. రైడర్ గమ్యస్థానానికి చేరే వరకు స్పందించడు అనే సమాచారాన్ని కూడా చేరవేస్తుంది.

'డ్రైవింగ్‍‌‌లో ఉన్నపుడు డిస్టర్బ్ చేయకండి' ఫీచర్ ప్రవేశపెట్టిన ఆపిల్

డ్రైవింగ్ చేయకుండా కారులో ఎక్కువ సమయం పాటు ఉన్నట్లయితే ఐఫోన్ లోని సెన్సార్లు మీరు డ్రైవ్ చేయలేదని గుర్తిస్తాయి. ఆ సమయంలో మీరు కల్పించింది. Do not disturb while driving నోటిఫికేషన్ పొందుతారు. కావాలనిపిస్తే ఆక్టివేట్ చేసుకోవచ్చు. లేదంటే నేను డ్రైవింగ్ చేయలేదు (‘I'm not driving') అనే ఆప్షన్‌ను ఆక్టివేట్ చేయవచ్చు.

'డ్రైవింగ్‍‌‌లో ఉన్నపుడు డిస్టర్బ్ చేయకండి' ఫీచర్ ప్రవేశపెట్టిన ఆపిల్

ఐఫోన్ 5ఎస్ మరియు దీనికన్నా పై స్థానంలో ఉన్న ఫోన్‌లకు, ఆరవ జనరేషన్ ఐపోడ్ టచ్ మరియు ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చిన ఐప్యాడ్ మోడళ్లలో ఈ సరికొత్త ఐఒఎస్ 11 అప్‌డేట్స్ పొందవచ్చు. ఇక్కడ తెలిపిన డివైజ్‌లలో ఐఒఎస్ 11 అప్‌డేట్ చేసుకుంటే Do not disturb while driving ఆప్షన్‌ పొందుతారు.

'డ్రైవింగ్‍‌‌లో ఉన్నపుడు డిస్టర్బ్ చేయకండి' ఫీచర్ ప్రవేశపెట్టిన ఆపిల్

ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను విరివిగా ఎంచుకుంటున్నారు కాబట్టి డ్రైవర్లకు ఇక మీదట డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడే అవకాశాన్ని ఆపిల్ ఏ మాత్రం ఇవ్వదని తెలుస్తోంది దీంతో ఈ కారణం చేత జరిగే రోడ్డు ప్రమాదాలను దాదాపుగా అరికట్టే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu To Know About Apple’s iOS 11 To Feature ‘Do Not Disturb While Driving’ Mode
Story first published: Wednesday, June 7, 2017, 10:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X