నేటి వీడియో: రాజీ పడితే ఇలానే జరుగుతుంది..!

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ 'ఆడి ఏ3' (Audi A3) సెడాన్ కోసం కంపెనీ ఓ వినూత్న కమర్షియల్ ప్రకటనను తయారు చేసింది. ఈ ఏడాది సూపర్ బైల్ సీజన్ కోసం 'డాబర్‌హువావా' (Doberhuahua) అనే పేరుతో రూపొందించిన ఈ ప్రకటనీ అందరికీ నవ్వు తెప్పించడమే కాకుండా, తమ కారు గురించి ఆలోజింపచేస్తుంది.

ఎందులోను రాజీపడాల్సిన అవసరం లేదు అనేది ఈ ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రకటనలో విచిత్రంగా కనిపించే కుక్క 'డాబర్‌హువావా' (ఇదేం పేరు అనుకుంటున్నారా.. పేరే కాదు ఈ జాతి కూడా వింతగా ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా.. ఇది భీకరంగా ఉండే డాబర్‌మేన్ జాతి కుక్క మరియు బుజ్జిగా ఉండే చిహువావా జాతి కుక్క క్రాస్ చేస్తే పుట్టింది) ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Doberhuahua

కుక్క తలభాగం వరకు డాబర్‌మేన్, మొండెం భాగం చిహువావాను పోలి ఉంటుంది. భార్యాభర్తలు ఈ రెండు జాతుల కుక్కలను కావాలనుకుంటారు, కానీ సేల్స్‌మేన్ ఇవి రెండు క్రాసింగ్ వలన పుట్టిన డాబర్‌హువావా కుక్కను తీసుకోమంటాడు. ఈ విషయంలో రాజీపడిన సదరు భార్యాభర్తలు ఆ డాబర్‌హువావా కుక్కను ఇంటికి తీసుకువెళ్లి పడరాని పాట్లు పడుతారు.

ఆడి కూడా ఇదే కాన్సెప్ట్‌ను తమ కారుతో పోల్చుతూ, రాజీ పడి నచ్చిన వాహనం కొంటే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, అదే తమ ఆడి ఏ3 సెడాన్‌ను కొంటే ఏక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదనేది ఈ ప్రకటన సారాంశం. మరి ఆ సరదా ప్రకటనను క్రింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/gZQogu_rt9Y?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Audi America has released their much awaited television commercial for this year's Super Bowl season titled Doberhuahua. The ad was previously teased through other videos which left everyone wondering what the relation was between an Audi sedan and a strange and scary looking fictional Doberhuahua (If you didn't get it, that's a cross between a doberman and a chihuahua) or for that matter what was the message they were trying to deliver.&#13;
Story first published: Friday, January 31, 2014, 18:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X